Kiran abbavaram..యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran abbavaram) ఇటీవలే ‘క’ (KA) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇక ఇప్పుడు దిల్ రూబా (Dilruba) అనే సినిమాలో నటిస్తున్నారు. వాలంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమాను విడుదల చేస్తామని ప్రకటించారు. కానీ కొన్ని కారణాలవల్ల సినిమా విడుదల వాయిదా పడింది. ఈ నేపథ్యంలోనే కిరణ్ అభిమానులు కాస్త నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారని చెప్పవచ్చు. ఎలాగో వాలెంటైన్స్ డే మిస్ అయింది మరి హీరో గారి రాక ఎప్పుడు అంటూ ప్రశ్నలు గుప్పిస్తున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
వాలెంటైన్స్ డే మిస్.. హోలీ ఫిక్స్..
కిరణ్ అబ్బవరం హీరోగా, రుక్సార్ థిల్లాన్ హీరోయిన్ గా రాబోతున్న చిత్రం దిల్ రూబా.. శివం సెల్యులాయిడ్ ప్రొడక్షన్స్, ఏ యూడ్లీ ఫిలిం బ్యానర్స్ పై విశ్వకరుణ్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది.విడుదలకు సిద్ధంగా ఉంది. అటు ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్, టీజర్ అన్నీ కూడా సినిమాపై అంచనాలను పెంచేశాయి. అయితే ఈరోజు విడుదల కావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాలతో ఈ సినిమాను వాయిదా వేశారు. తాజాగా సినిమా కొత్త రిలీజ్ డేట్ ని మేకర్స్ పోస్టర్ తో సహా రిలీజ్ చేశారు.ఈ సినిమా మార్చి 14వ తేదీన విడుదల కాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. వాలెంటైన్స్ డే మిస్ అయినా హోలీ పండక్కి వస్తామంటూ దిల్ రూబా సినిమా మార్చ్ 14న రిలీజ్ చేస్తున్నామని అటు హీరో కిరణ్ అబ్బవరం కూడా ప్రకటించారు. ఇప్పటికే క సినిమాతో పెద్ద సక్సెస్ కొట్టిన కిరణ్ అబ్బవరం.. ఈ సినిమాతో మరో విజయాన్ని కొడతాడని అభిమానులు కూడా ఆసక్తిగా చూస్తున్నారు. మరి కిరణ్ అబ్బవరంకి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.
కిరణ్ అబ్బవరం సినిమా కెరియర్..
2019లో ‘రాజావారు రాణిగారు’ అనే కామెడీ రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కిరణ్ అబ్బవరం, ఆ తర్వాత 2021 లో ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా చేసి ప్రేక్షకులను అలరించారు. ముఖ్యంగా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకొని, విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నాడు. అంతేకాదు ఈ చిత్రానికి రచయిత కూడా ఈయనే కావడం గమనార్హం. 2022లో సెబాస్టియన్ పి సి 524, సమ్మతమే చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన 2023లో వినరో భాగ్యము విష్ణు కథ, మీటర్, రూల్స్ రంజన్ అనే మూడు చిత్రాలను విడుదల చేశారు. ఇందులో మీటర్ సినిమా హిట్ గా నిలిచింది. ఇక దిల్ రూబా తో పాటు మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రస్తుతం కిరణ్ అబ్బవరం నుండి వచ్చే దిల్ రూబా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
Valentine’s day miss ayyindi .. Holi roju celebrate cheskundam 🙂
My love My anger on March 14th ❤️#DilrubaonMarch14th #Dilruba pic.twitter.com/nIy5n4A7GY
— Kiran Abbavaram (@Kiran_Abbavaram) February 14, 2025