BigTV English
Advertisement

KA Movie: కుర్ర హీరో రిలీజ్ డేట్ చెప్పేశాడు..ఈసారి గట్టిగా కొట్టడమే.. ?

KA Movie: కుర్ర హీరో రిలీజ్ డేట్ చెప్పేశాడు..ఈసారి గట్టిగా కొట్టడమే.. ?

KA Movie: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా సొంత కష్టంతో  పైకి వచ్చిన హీరోల్లో ఈ కుర్ర హీరో కూడా ఉన్నాడు. రాజావారు రాణిగారు సినిమాతో కెరీర్ ను మొదలుపెట్టి.. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తరువాత వరుస సినిమాలతో బిజీగా మారాడు. కొన్ని సినిమాలకు తానే నిర్మాతగా కూడా మారాడు. అంత గొప్ప విజయాలను అందుకోలేకపోయిన.. కొన్ని కొన్ని సినిమాలు పాజిటివ్ టాక్ నే తెచ్చుకున్నాయి.


ఇక వినరో భాగ్యము విష్ణు కథ.. కిరణ్ అబ్బవరం లైఫ్ ను మార్చేసింది. ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకొని.. టైర్ 2 హీరోల లిస్ట్ లో కిరణ్ ను నిలబెట్టింది. ఆ తరువాత అంతకుముందు అతను ఒప్పుకున్న సినిమాలను ఫినిష్ చేసి.. ఒక ఏడాది గ్యాప్ తీసుకున్నాడు.  ఆ గ్యాప్ ఎందుకు అనేది కూడా చెప్పుకొచ్చాడు. వరుస సినిమాలు చేయడం వలన లుక్ మార్చేలేకపోతున్నా అని, మంచి కథలను ఎంపిక చేసుకోలేకపోతున్నా అని  తెలిపాడు. అందుకే ఏడాది పాటు గ్యాప్ తీసుకొని కిరణ్.. ఒక పాన్ ఇండియా మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

Samantha: సంపాదించింది మొత్తం అందుకు ఖర్చు పెడుతున్న సామ్.. రిస్క్ తట్టుకుంటుందా.. ?


కిరణ్ అబ్బవరం హీరోగా సుజిత్ మరియు సందీప్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘క’. చింతా గోపాలకృష్ణ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో కిరణ్ సరసన నయన్ సారిక, తన్వీ రామ్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన టీజర్, పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా రీసెంట్ గా రిలీజ్ అయిన జాతర సాంగ్.. సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టించడమే కాకుండా మంచి హైప్ క్రియేట్ చేస్తుంది. ఇక తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ ప్రకటించారు. దీపావళీ కానుకగా అక్టోబర్ 31 న క మూవీ రిలీజ్ కానుందని అధికారికంగా ప్రకటించారు.

క చిత్రంపై కిరణ్ ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఈసారి గట్టిగా హిట్ అందుకోవాలని తహతహలాడుతున్నాడు. అందుకు తగ్గట్టుగానే క మూవీ అన్ని భాషల్లో బజ్ పెంచుతుంది. ఈ సినిమాను మలయాళంలోస్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రొడక్షన్ కంపెనీ వేఫేరర్ ఫిల్మ్స్ సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. దీంతో అక్కడ కూడా మంచి హైప్ ను తెచ్చుకుంది.

Chalaki Chanti : ఇకపై కామెడీ షోకు దూరం… వాళ్ళు సర్వనాశనం కావాలంటూ చంటి శాపనార్థాలు

ఇక తెలుగులో సక్సెస్ ఫుల్ నిర్మాత వంశీ నందిపాటి రిలీజ్ చేస్తున్నాడు. ఇలా క సినిమా మొత్తం పెద్ద పెద్ద వారి చేతిలోనే పడింది. మొత్తంగా క మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు రూ. 30 కోట్ల పై మాటనే జరిగిందని సమాచారం. కిరణ్ అబ్బవరం కెరీర్ లోనే ఇదొక రికార్డ్ అని చెప్పాలి.  ఇంకోపక్క అక్టోబర్ 31.. అంత ఈజీ డేట్ కూడా కాదు. ఆరోజు చాలా సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి.

అమరన్, లక్కీ భాస్కర్, భగీర, బ్రదర్.. ఇలా స్టార్ హీరోల సినిమాలు అదే రోజు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. అయితే వీరందరూ తెలుగు హీరోలు కాదు కాబట్టి.. కొద్దిగా కిరణ్ కు తెలుగులో మంచి కలక్షన్స్ వచ్చేలానే కనిపిస్తున్నాయి. ఇక ఆయా భాషల్లో కిరణ్.. వారిని దాటి కలక్షన్స్ రాబట్టాలి అంటే కథలో దమ్ముండాలి. మరి క లో అంత దమ్ముందా.. ? కిరణ్ ఈసారి గట్టిగా కొడతాడా.. ? అనేది తెలియాలంటే.. ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×