OTT Movies : దసరా వరకు సినిమాల ఎక్కువగానే ఉంది. దసరా కానుకగా వరుసగా సినిమాలు రిలీజ్ అయ్యాయి. పండగ సందర్భంగా థియేటర్లలో అరడజనుకు పైగా సినిమాలు రిలీజయ్యాయి. దీంతో పెద్దగా చెప్పుకోవడానికి ఈ వారం కొత్త సినిమాలేమీ లేవు. ఉన్నంతలో కల్లు కాంపౌండ్, వీక్షణం, సముద్రుడు అనే చిన్న సినిమాలు రిలీజ్ కానున్నాయి. వీటి పై పెద్దగా బజ్ లేదు. దేవర తప్ప పెద్దగా చెప్పుకోవాల్సిన సినిమాలు లేవు. ఇక పెద్ద సినిమాలు లేకపోవడంతో ఎక్కువ మంది ఓటీటీ సినిమాల పై ఆసక్తి కనఁబరుస్తున్నారు. దసరా తర్వాత వారం కూడా ఓటీటీలో చెప్పుకోదగ్గ సినిమాలు లేవు. స్నేక్స్ అండ్ ల్యాడర్స్, 1000 బేబీస్ అనే డబ్బింగ్ సిరీస్‌లు మాత్రమే ఉన్నంతలో కాస్త చూడాలన్న ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఒకవేళ వీకెండ్ వచ్చేసరికి కొత్తగా ఏవైనా సినిమాలు సడన్ సర్‌ప్రైజ్ చేస్తాయేమో చూడాలి.. ఇక ఆలస్యం ఎందుకు ఓటీటీలో సందడి చెయ్యబోతున్న సినిమాలు ఏవి.. స్ట్రీమింగ్ ఎక్కడ అవుతున్నాయో ఒక లుక్ వేద్దాం పదండీ..
అమెజాన్ ప్రైమ్..
ద ప్రదీప్స్ ఆఫ్ పిట్స్‌బరో (ఇంగ్లీష్ సిరీస్) – అక్టోబర్ 17
కల్ట్ (ఫ్రెంచ్ సిరీస్) – అక్టోబర్ 18
కడైసి ఉలగ పొర్ (తమిళ సినిమా) – అక్టోబర్ 18
లాఫింగ్ బుద్ధా (కన్నడ మూవీ) – అక్టోబర్ 18
స్నేక్స్ & ల్యాడర్స్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) – అక్టోబర్ 18
ద డెవిల్స్ అవర్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) – అక్టోబర్ 18
ద ఆఫీస్ ఆస్ట్రేలియా (ఇంగ్లీష్ సిరీస్) – అక్టోబర్ 18
ద పార్క్ మేనియక్ (పోర్చుగీస్ మూవీ) – అక్టోబర్ 18
హాట్‌స్టార్..
రీతా సన్యల్ (హిందీ సిరీస్) – అక్టోబర్ 14
1000 బేబీస్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) – అక్టోబర్ 18
రైవల్స్ (ఇంగ్లీష్ సిరీస్) – అక్టోబర్ 18
రోడ్ డైరీ (ఇంగ్లీష్ సినిమా) – అక్టోబర్ 18
నెట్‌ఫ్లిక్స్..
మైటీ మాన్‌స్టర్ వీలిస్ (ఇంగ్లీష్ సిరీస్) – అక్టోబర్ 14
రేచల్ బ్లూమ్ (ఇంగ్లీష్ సినిమా) – అక్టోబర్ 15
స్వీట్ బాబీ (ఇంగ్లీష్ మూవీ) – అక్టోబర్ 16
గుండమ్ (ఇంగ్లీష్ సిరీస్) – అక్టోబర్ 17
జూరాసిక్ వరల్డ్ కేవోస్ థియరీ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) – అక్టోబర్ 17
ఫ్యాబులస్ లైవ్స్ vs బాలీవుడ్ వైఫ్స్ (ఇంగ్లీష్ సిరీస్) – అక్టోబర్ 18
ద మ్యాన్ హూ లవ్డ్ యూఎఫ్‌ఓస్ (స్పానిష్ మూవీ) – అక్టోబర్ 18
ఉమన్ ఆఫ్ ద అవర్ (ఇంగ్లీష్ సినిమా) – అక్టోబర్ 18
జియో సినిమా..
క్రిస్పీ రిస్తే (హిందీ మూవీ) – అక్టోబర్ 18
హ్యాపీస్ ప్లేస్ (ఇంగ్లీష్ సిరీస్) – అక్టోబర్ 19
హిస్టీరియా (ఇంగ్లీష్ సినిమా) – అక్టోబర్ 19
ఆపిల్ ప్లస్ టీవీ..
స్రింకింగ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) – అక్టోబర్ 16
ఈటీవీ విన్..
కలి (తెలుగు) అక్టోబరు 17
బుక్ మై షో…
బీటల్ జ్యూస్ (ఇంగ్లీష్ సినిమా) – అక్టోబర్ 18
ఓటీటీ ప్రేమికులకు మాత్రం సినిమాలు, వెబ్‌సిరీస్‌లు అలరించనున్నాయి. వివిధ ఓటీటీల్లో ఏకంగా 25 సినిమాలు స్ట్రీమింగ్‌కు సిద్ధంగా ఉన్నాయి. ఓటీటీలు అందుబాటులో వచ్చాక భాష సమస్య లేకుండా పోయింది. అన్ని భాషల సినిమాలు అన్ని భాషల్లో విడుదలవుతుండటంతో అందరికీ ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటోంది. ఇప్పుడు ఓటీటీలో విడుదల కాబోతున్న సినిమాల సందడే కాస్త ఎక్కువగా ఉంది.. ఇక ఈ వారం విడుదల కాబోతున్న సినిమాలు ఏ ఓటీటీలో ఎక్కువగా స్ట్రీమింగ్ కాబోతున్నాయో చూసి మీకు నచ్చిన సినిమాను చూసి ఆనందించండి..