BigTV English

KA Movie Collections Day 1: క ఫస్ట్ డే కలెక్షన్స్.. కిరణ్ కి కలిసొచ్చినట్టేనా..?

KA Movie Collections Day 1: క ఫస్ట్ డే కలెక్షన్స్.. కిరణ్ కి కలిసొచ్చినట్టేనా..?

KA Movie Collections Day 1.. రాజావారు రాణిగారు అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). ఇండస్ట్రీలోకి రాకముందు వ్యక్తిగతంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న కిరణ్ అబ్బవరం.. ఇండస్ట్రీలోకి వచ్చి నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తన తొలి చిత్రంలో హీరోయిన్ గా నటించిన రహస్య ఘోరక్ తో ప్రేమలో పడి ఇటీవలే వివాహం చేసుకున్నారు. వివాహం అనంతరం ఆయన నటించిన తొలి చిత్రం క. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా వచ్చిన క సినిమా మొదటిరోజు ఏ మేరా కలెక్షన్లు రాబట్టింది అనే విషయం ఇప్పుడు చూద్దాం.


దీపావళి సందర్భంగా విడుదలైన కిరణ్ క మూవీ.

పీరియాడిక్ థ్రిల్లర్ మూవీగా వచ్చిన క సినిమాలో నయన్ సారిక (Nayan Sarika) , తన్విరామ్ (Thanvu Ram) హీరోయిన్లుగా నటించారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ ఈ సినిమాని విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించారు. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై గోపాలకృష్ణారెడ్డి ఈ సినిమాను నిర్మించగా, దీపావళి కానుకగా అక్టోబర్ 31న ఈ సినిమా విడుదలైంది. ఇక ఈ సినిమా క అనే ఒకే అక్షరాన్ని టైటిల్ గా పెట్టడంతో విడుదలకు ముందు నుంచే ఆసక్తి నెలకొంది.


సస్పెన్స్ థ్రిల్లర్ గా విడుదల..

దీనికి తోడు ఈ స్టోరీ 1977లో సాగుతోంది. హీరో కిరణ్ అబ్బవరం అభినయ వాసుదేవ అనే పాత్ర పోషించగా ఇందులో అనాథ.. బాల్యం మొత్తం అనాథాశ్రమంలో సాగించి, ఆ తర్వాత పోస్ట్మాన్ గా ఉద్యోగం సంపాదించుకుంటాడు. పెద్దయ్యాక క్రిష్ణగిరి అనే ఒక కొండ గ్రామంలో పోస్ట్మాన్ గా చేరుతాడు. ఈ క్రమంలో ఆ ఊరి పోస్ట్ ఆఫీస్ హెడ్ గా పనిచేస్తున్న రంగారావు కూతురు సత్యభామతో ప్రేమలో పడతాడు. కథ హ్యాపీగానే సాగుతున్న తరుణంలో ఆ వూరి అమ్మాయిలు కిడ్నాప్ అవుతూ ఉంటారు. చివరిగా దొంగతనంగా వేరే వాళ్ళ ఉత్తరాలు చదివే అలవాటున్న వాసుదేవ్ కి ఒక ఉత్తరం ద్వారా అమ్మాయిలు మిస్సింగ్ కేసు కు సంబంధించిన క్లూ దొరుకుతుంది. ఆ క్లూ ద్వారా మిస్టరీ కేసును ఎలా చేదించాడు అనేది ఈ చిత్రం.

తొలిరోజు రూ.3.8 కోట్ల కలెక్షన్స్..

మరి ఇంత అద్భుతమైన కథతో బాక్సాఫీస్ వద్ద బరిలోకి దిగిన ఈ సినిమా మొదటి రోజు ఏ విధంగా కలెక్షన్లు వసూలు చేసింది అనే విషయానికి వస్తే.. ఈ సినిమా తొలి రోజు రూ.3.8 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసింది. ఒకవైపు పండుగ, ఇంకోవైపు హాలిడేస్ ఉండడంతో సినిమా కలెక్షన్లు మరింత పెరుగుతాయని చిత్ర బృందం భావిస్తోంది. మొత్తానికైతే ఈ సినిమాతో కిరణ్ అబ్బవరం మళ్లీ కం బ్యాక్ అవుతారని ఫ్యాన్స్ కూడా భావిస్తున్నారు. ఈ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో హీరో కాస్త ఊరట పొందారు అని చెప్పవచ్చు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×