BigTV English

Kiran abhavaram: ‘దిల్ రూబా’ స్టోరీ లీక్ చేసిన కిరణ్.. థ్రిల్ పక్కా అంటూ..!

Kiran abhavaram: ‘దిల్ రూబా’ స్టోరీ లీక్ చేసిన కిరణ్.. థ్రిల్ పక్కా అంటూ..!

Kiran abhavaram.. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran abhavaram) గత కొన్ని రోజులుగా ఫుల్ పాజిటివ్ వైబ్ తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. గత ఏడాది ‘క’ సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కిన ఈయన, ఆ తర్వాత తన భార్య ప్రెగ్నెంట్ అవడంతో అటు సినీ కెరియర్ లోనే కాకుండా ఇటు వ్యక్తిగత జీవితంలో కూడా ఫుల్ జోష్ తో దూసుకుపోతున్నారు. ఇక ఇప్పుడు ఒక యూత్ ఫుల్ లవ్ స్టోరీ ‘దిల్ రూబా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. వాస్తవానికి వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14వ తేదీన ఈ యూత్ ఫుల్ లవ్ స్టోరీ సినిమాను రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడింది. ఇక ఇప్పుడు మార్చి 14వ తేదీన సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ద్వారా విశ్వకరుణ్ (Viswa Karun) ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయం కాబోతుండగా.. రుక్సార్ ధిల్లాన్ (Rukshar Dhillion) ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.


అందుకే దిల్ రూబా విడుదల వాయిదా వేశాము – కిరణ్ అబ్బవరం

ఇక విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న కిరణ్ అబ్బవరం తాజాగా దిల్ రూబా సినిమా స్టోరీ లైన్ రిలీజ్ చేసి, సినిమా పై హైప్ పెంచేశారు. దీంతో సినిమాపై బజ్ బాగా పెరిగిపోయింది అని చెప్పవచ్చు. ఇంటర్వ్యూలో భాగంగా కిరణ్ మాట్లాడుతూ.. “మొదట దిల్ రూబా సినిమాను విడుదల చేయాలనుకున్నాము. కానీ అప్పటివరకు లుక్ అన్నింటికీ ఒకే తరహాలో ఉండడంతో ఈ సినిమాకి కాస్త చేంజ్ చేద్దామనుకున్నాం. అందులో భాగంగానే అటు క, ఇటు దుల్ రూబా సినిమాలు పార్లర్గా షూటింగ్ జరుగుతూ వచ్చాయి. ఇక కొద్ది రోజులు గ్యాప్ తీసుకొని దిల్ రూబా షూటింగ్ మొత్తం మంగళూరులో పూర్తి చేశాము. ఇక ఇక్కడికి వచ్చిన తర్వాత అనుకోకుండా ఇంకా 30 రోజుల షూటింగ్ పెండింగ్ ఉందని చెప్పారు. కానీ ఆలోపే క సినిమా పూర్తి అవ్వడంతో ఆ సినిమాను విడుదల చేశాము. పైగా దిల్ రూబా నిర్మాతలు కూడా మొదటిగా వస్తున్నాం కాబట్టి కాస్త నిదానమైన పర్లేదని చెప్పడంతో సినిమాను కాస్త లేట్ చేసాము. అని తెలిపారు కిరణ్ అబ్బవరం.


దిల్ రూబా స్టోరీ లీక్ చేసిన కిరణ్ అబ్బవరం..

అలాగే దిల్ రూబా స్టోరీ గురించి చెబుతూ..”ఇక ఇప్పుడు మొత్తం సిద్ధం అయ్యింది. మార్చి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇది రెగ్యులర్ లవ్ స్టోరీ అయితే అసలు కాదు. ట్రైలర్ లో క్లియర్ గా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాము.. ముఖ్యంగా హీరో థాంక్స్, సారీ అనే పదాలు ఎవరి దగ్గర ఎప్పుడూ చెప్పరు. తన క్యారెక్టర్రైజేషన్ అది. అసలు ఎందుకు చెప్పడు అనేది సస్పెన్స్. ఎందుకంటే మనం రోజు వారిలో ఎంతోమందికి సారీలు, థాంక్స్ లు చెబుతూ ఉంటాము. అసలు వాటికి విలువ లేకుండా పోయింది. మేజర్ గా మన లైఫ్ లో ఆ పదాలకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఆ పదాల వల్ల మనం మోసపోతున్నామో లేక మనం మోసం చేస్తున్నామో తెలియాలి. అందుకే ఈ థాంక్స్, సారీ హీరో చెప్పడు. దీనిని బేస్ చేసుకుని క్లైమాక్స్లో చిన్న సీన్ ఉంటుంది. అదే సినిమాకి హైలైట్. దీనికి తోడు ఎక్స్ లవర్ వచ్చి ప్రస్తుత లవర్ ని ఎలా కలుపుతుంది అనేది సినిమాకి మరో హైలెట్. కచ్చితంగా ఇది అందరికీ కనెక్ట్ అవుతుంది” అంటూ సినిమా గురించి అద్భుతంగా చెప్పుకొచ్చారు కిరణ్ అబ్బవరం.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×