BigTV English

JACK Kiss Song : వైష్ణవీ చైతన్యకు ఫస్ట్ ముద్దు… సిద్ధు మరీ ఇంత రొమాంటికా..?

JACK Kiss Song : వైష్ణవీ చైతన్యకు ఫస్ట్ ముద్దు… సిద్ధు మరీ ఇంత రొమాంటికా..?

Jack : గత ఏడాది ‘టిల్లు స్క్వేర్’ మూవీతో 100 కోట్ల క్లబ్ లో చేరిన యంగ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda). ఈ మూవీ ఇచ్చిన జోష్ తోనే నెక్స్ట్ మరో రొమాంటిక్ మూవీని లైన్ లో పెట్టాడు.  సిద్దు జొన్నలగడ్డ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపాందుతున్న మూవీ ‘జాక్ (Jack)’. ఈ టైటిల్ లో ‘కొంచెం క్రాక్’ అనే ఉప శీర్షికను ఉపయోగిస్తున్నారు. ‘బేబీ’ ఫేమ్ వైష్ణవి చైతన్య ఈ మూవీలో సిద్దు జొన్నలగడ్డ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే సిద్దు పుట్టినరోజు సందర్భంగా ‘జాక్’ సినిమా టీజర్ ను రిలీజ్ చేసి, అభిమానులకు మంచి ట్రీట్ ఇచ్చారు. అలాగే ఏప్రిల్ 10న ఈ మూవీ ని థియేటర్లలోకి తీసుకురాబోతున్నామని అఫీషియల్ గా అనౌన్స్ కూడా చేశారు. ఈ నేపథ్యంలోనే మ్యూజికల్ ప్రమోషన్స్ షురూ చేశారు. ‘జాక్’ మూవీ నుంచి ‘కిస్’ అనే రొమాంటిక్ సాంగ్ ప్రోమోని రిలీజ్ చేశారు.


ఓయో రూముకు వెళ్లి పోలీసులకి దొరికి పోవాలి

స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న ‘జాక్’ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై సీనియర్ ప్రొడ్యూసర్ బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇందులో ప్రకాష్ రాజ్, బ్రహ్మాజీ, నరేష్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకోగా, తాజాగా ఈ సినిమా నుంచి ‘కిస్’ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. అయితే ఎప్పటిలాగే పాటలోని ఓ పల్లవిని కాకుండా డిఫరెంట్ గా ఓ రొమాంటిక్ సీన్ తో ప్రోమోని రిలీజ్ చేశారు. అందులో సిద్దు, వైష్ణవి చైతన్య గతంలో ఎన్నడూ లేనంత రొమాంటిక్ గా కనిపించారు.


ప్రోమోలో “నువ్వు నమ్మాలంటే ఏం చేయాలో చెప్పు చేస్తాను” అని వైష్ణవి చైతన్య రొమాంటిక్ గా అడగగా… “ఒకటికి రెండుసార్లు ఆలోచించుకో. ఒకసారి కమిట్ అయ్యానంటే లైఫ్ అంతా ఉండిపోతాను” అని హీరో సమాధానం చెప్తాడు. “ఉండిపొమ్మనే కదా అంటున్నాను” అని హీరోని మరింత టెంప్ట్ చేసే ప్రయత్నం చేసింది హీరోయిన్. కానీ చివరకు కిస్ చేయనివ్వకుండా “నీకంటూ ఒక ప్లేస్ ఉండాలి, మనిద్దరమే ఉండాలి, ప్రైవేట్ గా ఉండాలి… అంటే ఫస్ట్ టైం ముద్దు పెట్టుకుంటున్నాం కదా గుర్తుండిపోయేలా ఉండాలి…” అని హీరోయిన్ మరింత రొమాంటిక్ గా అడగ్గా, “అలా లైఫ్ అంతా గుర్తుండి పోవాలంటే ఓయో రూముకు వెళ్లి, పోలీస్ లకి దొరికి పోవాలి” అంటూ నవ్వేశాడు సిద్ధూ. ఆ తర్వాత “హైదరాబాద్ మొత్తంలో ముద్దు పెట్టుకోవడానికి నాకంటూ ఒక ప్లేస్ లేకపోవడం ఏంటి ? రా” అంటూ వైష్ణవిని లాక్కెళ్లడంతో ప్రోమో ఎండ్ అయ్యింది.

‘జాక్’ కోసం నలుగురు మ్యూజిక్ డైరెక్టర్లు

ఇక ఈ సినిమాకు ఏకంగా నలుగురు మ్యూజిక్ డైరెక్టర్లు సంగీతం అందిస్తుండడం విశేషం. సురేష్ బొబ్బిలి, రధన్, అచ్చు రాజమణి, సామ్ సీఎస్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ శ్రీ చరణ్ పాకాల ఇవ్వబోతున్నారు. తాజాగా రిలీజ్ చేసిన ‘కిస్’ సాంగ్ ని జావేద్ అలీ, అమల చేబోలు, సురేష్ బొబ్బిలి పాడారు. రాజు సుందరం కొరియోగ్రఫీ అందించిన ఈ పాటకు సనారే లిరిక్స్ అందించగా, సురేష్ బొబ్బిలి మ్యూజిక్  అందించారు. భాస్కర్ ఈ పాటను కంపోజ్ చేశారు.

 

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×