Viral Video: ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా ప్రభావం బాగా పెరిగిపోయింది. ప్రతిఒక్కరూ స్మార్ట్‌ఫోన్ వాడుతున్న ఈ రోజుల్లో, సోషల్ మీడియా ఖాతా లేని వారు చాలా అరుదని చెప్పవచ్చు. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు, అందరూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో యాక్టివ్ అవుతున్నారు. దీంతో సామాజిక మాధ్యమాల్లో రోజుకో వీడియో వైరల్ అవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా మరో వీడియో వెలుగులోకి వచ్చింది. ఇది చూసిన నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
కార్ దగ్గరకు వచ్చి
వైరల్ అవుతున్న వీడియోను పరిశీలిస్తే, ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఆ క్రమంలో బైక్ నడిపే వ్యక్తి ముందుకు వెళ్లి ఆగగా, మరోవ్యక్తి కూల్‌గా, అనుమానం రాకుండా, కార్ దగ్గరకు వచ్చి ఆగాడు. చాకచక్యంగా ఇంటి తలుపు వద్దకు వెళ్లి లాక్ వేసి ఉందా లేదా అని పరిశీలించాడు. ఆ తరువాత అతను కార్ కవర్‌ను పూర్తిగా తీసుకున్నాడు.
సోషల్ మీడియాలో
అదే సమయంలో కొద్దిసేపటి తరువాత, బైక్ నడిపే వ్యక్తి తన బైక్‌ను తిప్పుకుని మళ్లీ తిరిగి అతని దగ్గరకు వచ్చాడు. దీంతో కవర్‌ను తీసుకున్న తర్వాత, ఇద్దరు దొంగలు చాకచక్యంగా అక్కడి నుంచి పారిపోయారు. ఇదంతా కూడా తక్కువ సమయంలో జరిగిపోయింది. ఈ మొత్తం సంఘటన అక్కడి సీసీ కెమెరాలో రికార్డు కాగా, అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read Also: Business Idea: పెట్టుబడి సున్నా.. నెలకు రూ. 60 వేలకుపైగా .
16 వేలకు పైగా లైక్‌లు
ఈ వీడియోను ఘంటా అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా పోస్ట్ చేశారు. “డిస్కౌంట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు” అనే క్యాప్షన్‌తో షేర్ చేయడంతో, ఇది మరింత వైరల్ అయింది. ఈ వార్త రాస్తున్న సమయానికి, వీడియోకు 16 వేలకు పైగా లైక్‌లు వచ్చాయి. ఇంకా అనేక మంది వినియోగదారులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
దొంగల తెలివి
ఈ వైరల్ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యానికి లోనవుతున్నారు. అసలు దొంగలు కారు కోసం వచ్చారా లేదా కార్ కవర్ కోసం వచ్చారా అని కామెంట్లు చేస్తున్నారు. పేదవాడు తక్కువలో సంతోషంగా ఉంటాడని, దొంగలు కూడా తెలివిగా పనిచేస్తున్నారని ఓ యూజర్ పేర్కొన్నాడు.
మరో నెటిజన్ మాత్రం
నేను ఈరోజే కవర్ మాత్రమే తీసుకున్నాను. కానీ కారు కోసం రేపు వస్తానని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. అతను చిన్న దొంగలా ఉన్నాడు, కానీ పనిచేయడంలో నిపుణుడే అని ఇంకో యూజర్ పేర్కొన్నాడు. ఈ క్రమంలో కొంతమంది వినియోగదారులు ఈ దొంగతనాన్ని చాలా చాకచక్యంగా జరిపారని ప్రశంసించగా, మరికొందరు ఇది ఎంత బుద్ధిగా జరిగిందోనని చూసి ఆశ్చర్యపడుతున్నారు.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">