E-Paper
Advertisement

Top 20 News: సుచిత్ర సర్కిల్‌లో భారీ అగ్నిప్రమాదం….పది రోజుల్లో తెలంగాణ మంత్రివర్గ విస్తరణ

Top 20 News: సుచిత్ర సర్కిల్‌లో భారీ అగ్నిప్రమాదం….పది రోజుల్లో తెలంగాణ మంత్రివర్గ విస్తరణ
Advertisement

1. రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి

కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోటేకల్ సమీపంలో రెండు కార్లు ఒకదానికొకటి ఢీకొనడంతో.. ఐదుగురు స్పాట్‌లోనే మృతి చెందారు. మరి కొందరికి తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు.

2. మావోయిస్టు నేత అనంత్‌ అలియాస్‌ వికాస్‌ లొంగిపోయారు

మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు నేత అనంత్‌ అలియాస్‌ వికాస్‌ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఆయన సహా 15 మంది మావోయిస్టులు ఆయుధాలతో మహారాష్ట్రలోని గోండియా జిల్లాలోని దారేక్ష పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయారు.

3. పది రోజుల్లో తెలంగాణ మంత్రివర్గ విస్తరణ

Advertisement

మరో వారం పది రోజుల్లో తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉంది. ఈ విస్తరణలో నలుగురు, ఐదుగురు మంత్రులను తప్పించి, కొత్తవారికి అవకాశం కల్పించనున్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్థానంలో రాజగోపాల్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ స్థానంలో మహేష్ కుమార్ గౌడ్, జూపల్లిని తప్పించి మల్ రెడ్డి రంగారెడ్డికి అవకాశం ఇవ్వనుంది. కొండా సురేఖ స్థానంలో కొత్త నేతలకు చోటు దక్కవచ్చు. దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు పీసీసీ, హోం శాఖ దక్కే అవకాశాలు ఉన్నాయి.

4. తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తాంధ్ర తీరాలకు తుఫాన్

నైరుతి బంగాళాఖాతం ఆనుకొని ఉన్న శ్రీలంక తీరంలో దిత్వా తుఫాన్ ఉత్తర-వాయువ్య దిశగా నెమ్మదిగా కదులుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆదివారం తెల్లవారుజామునకు తీవ్ర వాయుగుండంగా మారి తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తాంధ్ర తీరాలకు చేరుకునే అవకాశం ఉందని చెప్పారు. మంగళవారం వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు.

5. కాళోజీ వర్సిటీ వ్యవహారాలపై రేవంత్ రెడ్డి ఆగ్రహం

Advertisement

కాళోజీ వర్సిటీ వ్యవహారాలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం చేశారు. పరీక్ష పేపర్ల మూల్యాంకనంలో అవకతవకలు, ఇష్టారీతిగా ఇంఛార్జీల నియామకం వంటి ఘటనలపై వస్తున్న ఆరోపణలపై వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారుల నుంచి వివరణ కోరారు. వర్సిటీలో అస్తవ్యస్థ పరిస్థితులకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.

6. శబరిమల ప్రమాణాలకు భంగం కలగకుండా ఏర్పాట్లు

సీఎం చంద్రబాబు ఆసక్తికర ట్వీట్ చేశారు. శబరిమల యాత్రికుల ఇరుముడి పవిత్రతను గౌరవిస్తూ, భక్తులు దానిని విమాన ప్రయాణంలో తమతో తీసుకెళ్లడానికి పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అనుమతించింది. భద్రతా ప్రమాణాలకు భంగం కలగకుండా సాంప్రదాయాలు, భక్తి స్ఫూర్తిని నిలబెట్టే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు సీఎం చంద్రబాబు.

7. పాఠశాల బస్సు డ్రైవర్ హత్య

మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవేందర్ నగర్ కాలనీలో దారుణం జరిగింది. పాఠశాల బస్సు డ్రైవర్ అంజయ్యను చిన్న కుమారుడు, భార్య, బంధువు కలిసి టవల్‌తో ఉరి బిగించి హత్య చేశారు. మద్యం తాగి వేధిస్తున్నందుకే ఈ దారుణానికి పాల్పడినట్లు నిందితులు నేరం అంగీకరించారు.

8. పంచాయతీ ఎన్నికలు ఆపలేము: హైకోర్ట్

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు లైన్ క్లియరైంది. గ్రామ పంచాయతీల ఎన్నికలను ఆపలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఎన్నికల ప్రక్రియ మొదలైనందున జీవో 46పై స్టే ఇవ్వలేమని తేల్చి చెప్పింది. ప్రభుత్వం జారీ చేసిన జీవో 46ను సవాలు చేస్తూ వికారాబాద్‌కు చెందిన మడివాల మచ్చదేవ రజకుల సంఘం తరపున ఎస్. లక్ష్మి, మరో ఆరుగురు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ చేపట్టింది.

9. శ్రీవారి దర్శనానికి 10గంటల సమయం

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 10గంటల సమయం పడుతోంది. 18 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 70 వేల 44 మంది భక్తులు దర్శించుకున్నారు. 25 వేల 559 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3 కోట్ల 47 లక్షలు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.

10. డ్రంక్ అండ్ డ్రైవ్ లో 8 కేసులు నమోదు

హైదరాబాద్ నగరవ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరం చేశారు ట్రాఫిక్ పోలీసులు. బంజారాహిల్స్ రోడ్ నెం. 2 వద్ద వీకెండ్‌లో నిర్వహించిన టెస్టులలో ఇప్పటివరకు 8 కేసుల పైగా నమోదు చేశారు. మొదటిసారి దొరికితే జరిమానా, రెండోసారి దొరికితే జైలు శిక్ష ఉంటుందని ట్రాఫిక్ సీఐ శ్రీనివాస రెడ్డి హెచ్చరించారు.

11. సుచిత్ర సర్కిల్‌లో భారీ అగ్నిప్రమాదం

మేడ్చల్‌ జిల్లా సుచిత్ర సర్కిల్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రాఘవేంద్రనగర్‌ కాలనీలోని కార్ సర్వీస్ సెంటర్‌లో ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. షాపులో టైర్లు ఉండటంతో పెద్ద ఎత్తున మంటలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. దీంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగతో నిండిపోయింది.

12. హౌసింగ్ బోర్డు కాలనీ వద్ద దారుణ హత్య

నెల్లూరు హౌసింగ్ బోర్డు కాలనీ వద్ద పెంచలయ్య అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. స్కూల్ నుంచి పిల్లలను బైక్‌పై తీసుకెళ్తున్న సమయంలో గంజాయి అమ్మకాలు, సేవనాన్ని వ్యతిరేకిస్తూ కమిటీ వేసినందుకే స్థానిక గంజాయి బ్యాచ్ కత్తులతో దాడి చేసి చంపేశారని స్థానికులు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

13. మంత్రి సంధ్యారాణి పీఏ పోస్టుకు రాజీనామా

సాలూరు లైంగిక వేధింపుల కేసులో మరో ట్విస్ట్‌ చోటుచేసుకుంది. మంత్రి సంధ్యారాణి పీఏ పోస్టుకు రాజీనామా చేశారు సతీష్‌. లైంగిక వేధింపుల కేసులో సతీష్‌పై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

14. కర్ణాటకలో పవర్ షేరింగ్ వివాదంలో కీలక నిర్ణయం

కర్ణాటకలో నాయకత్వ మార్పు అనే నాటకం కంటిన్యూ అవుతూనే ఉంది. పవర్ షేరింగ్ వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకోబోతుంది. ఇవాళ సీఎం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ ఉంది. హైకమాండ్ సూచనతో సమాశం కానున్నారు. అధిష్ఠానం ఎలా చెప్తే అలా నడుచుకుంటానన్నారు సీఎం.

15. భూమి నుంచి 150 అడుగుల ఎత్తులో చిక్కుకుపోయిన పిల్లలు

కేరళ రాష్ట్రం ఇడుక్కిలోని అనాచల్ సమీపంలో ఒక ప్రైవేట్ ‘స్కై-డైనింగ్’ రెస్టారెంట్‌ను ఎత్తివేసే క్రేన్ సడెన్‌గా మొరాయించింది. దీంతో ఇద్దరు పిల్లలు సహా నలుగురు పర్యాటకులు భూమి నుంచి 150 అడుగుల ఎత్తులో చిక్కుకుపోయారు. రెస్క్యూ సిబ్బంది గాలిలో చిక్కుకున్న వారిని సురక్షితంగా రక్షించారు.

16. వివాహ వ్యవస్థ వాణిజ్య లావాదేవీలా మారిపోయింది

ఎంతో పవిత్రమైన వివాహ వ్యవస్థ కాస్తా వరకట్న దురాచారం దృష్ట్యా వాణిజ్య లావాదేవీలా మారిపోయిందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. పరస్పర విశ్వాసం, సహవాసం, గౌరవాలపై నిర్మితమైన ఆదర్శమైన వ్యవస్థ ఇటీవలి కాలంలో ఇలా కావడం విచారకమని జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ ఆర్. మహదేవన్‌ల ధర్మాసనం పేర్కొంది.

17. శ్రీకృష్ణుడి భోదన దేశ విధానానికి మార్గదర్శకం: నరేంద్ర మోడీ

భగవద్గీత ద్వారా శ్రీకృష్ణుడు చెప్పిన బోధనలు వ్యక్తి జీవన విధానానికే కాదు.. దేశ విధానాల రూపకల్పనకూ మార్గదర్శకాలు అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కర్ణాటకలోని ఉడుపి శ్రీకృష్ణ మఠాన్ని ఆయన సందర్శించి, లక్ష కంఠ గీతా పారాయణంలో పాల్గొన్నారు.

18. పేద దేశాల జనాలు మాకు వద్దు: డోనాల్డ్ ట్రంప్

అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధం సమీపంలో కాల్పుల ఘటన నేపథ్యంలో అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పేద దేశాల నుంచి అగ్రరాజ్యానికి వలసలను శాశ్వతంగా నిలిపివేస్తామని ప్రకటించారు. దీనిపై ఇప్పటికే అమెరికా యంత్రాంగం చర్యలు ప్రారంభించినట్లు తెలిపారు.

19. అగ్నిప్రమాదంలో 128కి చేరిన మృతుల సంఖ్య

హాంకాంగ్‌లోని బహుళ అంతస్తుల భవన సముదాయంలో చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటివరకు ఈ ఘటనలో మృతుల సంఖ్య 128కి చేరింది. ఈ ఘటనలో ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు.

20. మమ్ముట్టి అసలు పేరు మహమ్మద్ కుట్టి

మలయాళ అగ్రనటుడు మమ్ముట్టి అసలు పేరు మహమ్మద్ కుట్టి అనే విషయం తెలిసిందే. కాలేజీలో తన పేరును ఒమర్ షరీఫ్‌గా చెప్పేవారట. ఒకరోజు ఐడీ కార్డు మర్చిపోవడంతో, స్నేహితుల్లో ఒకరు పొరపాటున మహమ్మద్ కుట్టిని మమ్ముట్టి అని చదివారట. అప్పటినుండి ఆ పేరే స్థిరపడిందని ఆయన చెప్పుకొచ్చారు.

Tags

Related News

నా జీవితంలోకి వచ్చిన వ్యక్తికి ఆస్కార్ ఇవ్వొచ్చు.. జయం రవి భార్య పోస్ట్ వైరల్!

Karthika Deepam 2 Serial Today Episode September 9th ‘కార్తీకదీపం2’ సీరియల్‌: రాజీ కోసం కార్తీక్ దగ్గరకు వెళ్లిన దక్షిణమూర్తి 

ఇంద్రకీలాద్రి ట్రస్ట్ బోర్డ్ లో కీలక బాధ్యత… కృతజ్ఞతలు తెలిపిన సుస్మిత కొణిదెల !

భర్తను అడ్డంగా బుక్ చేసిన యూట్యూబర్ నందు? విచారణలో కీలక విషయాలు వెల్లడి

Karthika Deepam 2 Serial Today Episode September 8th ‘కార్తీకదీపం 2’ సీరియల్‌: శివనారాయణ ఇంటికి వెళ్లిపోయిన సూరజ్  

Nindu Noorella Saavasam Serial Today Episode September 7th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మను చంపేందుకు సాగర్ కి బయలుదేరిన మను

Ninnu kori Serial Today Episode September 7th ‘నిన్నుకోరి’ సీరియల్‌: ఇంట్లో నిజం చెప్పిన విరాట్ 

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Big Stories

Advertisement
×