Big Stories

Yamuna River Pollution : యమునా నదిపై విషపు నురుగులు.. ప్రాణాంతకం అంటున్న వైద్యనిపుణులు..

Yamuna River Pollution : కాలుష్యవర్థాలతో యమున నదిలో తెల్లటి నురగ భారీగా పేరుకుపోయింది. ఢిల్లీ చుట్టు పక్కల ఉన్న పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాలు, మురికినీరు యమునా నదిలోకి చేరుతుంది. దీంతో నదిలోని నీరు కలుషితమవుతోంది. ఈ నేపథ్యంలో కలింది కుంజ్ ఏరియాలోని యమునా నదిపై ఏర్పడిన విషపు నురుగును సిబ్బంది తొలగిస్తున్నారు. కెమికల్స్ ను నురుగపై జెట్ స్ప్రే చేస్తున్నారు.

- Advertisement -

ఉత్తరాధి రాష్ట్రాల్లో ఘనంగా చట్ పూజను నిర్వహిస్తున్నారు. ఉద‌యం నుంచే న‌దుల వ‌ద్ద పుణ్య‌స్నానాలు ఆచరించి సూర్య భ‌గ‌వానుడికి ప్ర‌త్యేక‌పూజ‌లు నిర్వ‌హిస్తున్నారు. నాలుగు రోజుల పాటు జ‌రుపుకునే ఈ పండుగలో భాగంగా 36 గంట‌ల పాటు ఉప‌వాసం ఉంటారు. న‌దీ ఘాట్‌ల వ‌ద్ద స్నానం ఆచ‌రించి.. అక్క‌డే దీపాల‌ను వెలిగించి పూజ‌లు చేస్తున్నారు.

- Advertisement -

యమునా నదిలో ఉన్న ఈ విషవ్యర్థాలు వల్ల ఇప్పటికే పరోక్షంగా ఢిళ్లీ వాసులు అనారోగ్యానికి గురౌతున్నారు. ఛాట్ పూజా కార్యక్రమం, ఉత్సవాల్లో ఇప్పుడు ఈ కలుషితమైన నది పై పెను ప్రమాదంగా పొంచి ఉంది. ఈ యమునా నదిలో దిగి పూజలాచరించడం వల్ల చర్మ సంబంధిత వ్యాధులు వ్యాపిస్తాయి. స్కిన్ క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు. కడుపులోకి గనుక వెళ్తే.. టైఫాయిడ్, ట్యూబర్‌కులాసిస్, మెదడుసంబంధిత వ్యాధులు, హార్మోన్ ఇమ్‌బ్యాలెన్స్ సంబంవించే ప్రమాదం ఉంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News