Triptii Dimri : ప్రస్తుతం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఒకే ఒక సినిమా హంగామా చేస్తుంది. సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ యానిమల్ బాక్స్ ఆఫీస్ వద్ద మొదటి రోజే సాలిడ్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఈ మూవీలో హీరోగా బాలీవుడ్ యాక్టర్ రణబీర్ కపూర్ నటించగా.. హీరోయిన్ గా రష్మిక మందన్న చేసింది. ఇక ఈ చిత్రంలో యాక్షన్ సన్నివేశాలు ఏ రేంజ్ లో ఉన్నాయో.. రొమాంటిక్ సన్నివేశాలు అంతకుమించి ఉన్నాయి. ఈ మూవీలో కొన్ని సన్నివేశాల పై హాట్ డిస్కషన్ జరుగుతోంది.
మరీ ముఖ్యంగా ఇందులో హీరోయిన్ గా ఇచ్చిన రష్మిక మందన్న పాత్ర చాలా హైలెట్ గా నిలిచింది. ఎమోషనల్ సీన్స్ తో ఆకట్టుకున్న రష్మిక కొన్ని రొమాంటిక్ సీన్స్ లో అంతకంటే హాట్ గా నటించింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో రష్మిక పై ఈ విషయంలో మిక్స్డ్ కామెంట్స్ వస్తున్నాయి. ఈ మూవీలో రష్మిక తర్వాత స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన మరొక బ్యూటీ.. మూవీలో జోయా క్యారెక్టర్ చేసిన ముద్దు బొమ్మ.
మూవీ సెకండ్ హాఫ్ లో వచ్చే ఈ పాత్ర సినిమాను సడన్ గా వేరొక మూడ్ లోకి తీసుకువెళ్తుంది. ఆమె చేసిన కొన్ని రొమాంటిక్ సీన్స్ ఊహించని విధంగా ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాయి. అందాల ఆరబోతలో ఏమాత్రం వెనుకాడకుండా.. చాలా బోల్డుగా నటించిన ఈ నటి.. ఒకవైపు ప్రేమ మరొకవైపు బాధ.. ఇలా ఎమోషన్స్ ని అద్భుతంగా హైలైట్ చేస్తూ నటించింది. ప్రస్తుతం ఈమె అందంతో పాటు అభినయం కూడా ప్రేక్షకుల మనసు దోచుకుంది.
సోషల్ మీడియాలో ఈమె ఫోటోలు కూడా బాగా వైరల్ అయ్యాయి. నెటిజెన్లు ఇంతకీ ఈమె ఎవరూ ?అంటూ ఆరాలు కూడా తీస్తున్నారు. యానిమల్ మూవీ లో జోయ పాత్ర చేసిన నటి పేరు త్రిప్తి దిమిరి. 2017 నుంచి ఆమె సినీ ఇండస్ట్రీలో కొనసాగుతోంది. శ్రీదేవి మామ్ సినిమాలో ఆమె చేసిన క్యారెక్టర్ నిడివి చాలా తక్కువ అయినప్పటికీ మంచి ఇంపాక్ట్ ఉన్న పాత్రలో నటించింది. ఇప్పటివరకు రాని గుర్తింపు త్రిప్తి.. యానిమల్ మూవీ ద్వార తెచ్చుకుంది. దీంతో ఇక ఆమె కెరియర్ రేంజ్ కూడా పెరిగే అవకాశాలు వస్తాయేమో చూడాలి.