BigTV English

Actor Kanchi: ‘మర్యాద రామన్న’ నటుడి బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా.. ఆశ్చర్యపోకమానరు..!

Actor Kanchi: ‘మర్యాద రామన్న’ నటుడి బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా.. ఆశ్చర్యపోకమానరు..!

‘మర్యాద రామన్న’.. అప్పటివరకు కమెడియన్ గా దూసుకుపోతున్న సునీల్ (Sunil)  అందాల రాముడు సినిమాలో నటించినా కమెడియన్ గానే చూశారు. ‘మర్యాద రామన్న’ సినిమా ఒక్కసారిగా హీరోగా మార్చింది. అంతేకాదు ఇప్పటివరకు ఎవరు చూడని , ఊహించని సరికొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు దర్శక ధీరుడు రాజమౌళి (Rajamouli). తన చేతిలో పడితే బండరాయి అయినా శిల్పిలా మారుతుంది అని నిరూపించారు. కమెడియన్ పక్కన త్రిష (Trisha) లాంటి స్టార్.. హీరోయిన్ గా నటించినని చెప్పిన తర్వాత.. తెలుగమ్మాయి కోసం వెతుకలాడి సలోని (Saloni) అనే తెలుగమ్మాయిని ఈ సినిమాలో పెట్టి మంచి విజయం అందుకున్నారు.


మర్యాద రామన్న మూవీతో గుర్తింపు..

నాగినీడు, సుప్రీత్, ప్రభాకర్, బ్రహ్మాజీ, రావు రమేష్, ఛత్రపతి శేఖర్, సుబ్బరాయ శర్మ , ఎస్.ఎస్.కాంచి తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది . 2013 జూలైలో విడుదలైన ఈ సినిమాకి ‘ ఆస్కార్’ గ్రహీత కీరవాణి (M.M .Keeravani) స్వరాలు సమకూర్చారు. స్టార్ కాస్టింగ్ లేనప్పటికీ ఒక కమర్షియల్ మూవీకు కావలసిన అన్ని అంశాలు కూడా ఇందులో ఉన్నాయి. తండ్రికి ఉన్న గొడవల కారణంగా హీరో.. ఊరికి దూరంగా బ్రతుకుతూ ఉంటారు. అయితే ఆ ఊర్లో తనకు ఆస్తులు ఉన్నాయని తెలిసి, తిరిగి తన ఊరికి వెళ్లే క్రమంలో.. మధ్యలో ట్రైన్ లో హీరోయిన్ సలోని పరిచయమవుతుంది. చివరికి శత్రువుల ఇంట్లోనే ఆశ్రయం తీసుకోవడం, ఇంట్లో నెత్తురు కనిపించకూడదని, ఇల్లు దాటితేనే హీరోని చంపేయాలనే విలన్ కట్టుబాట్లు కూడా సినిమాను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లాయి.


కమెడియన్ గా భారీ గుర్తింపు..

ఇక ఇదంతా పక్కన పెడితే సినిమాలో ట్రైన్ సన్నివేశాలు బాగా పేలాయి. అందులోనూ అమ్మాయి ముందు ఫోజు కొడుతూ.. కొబ్బరి బొండం లో స్ట్రా వేసుకొని తాగడం మంచిది కాదు అని బిల్డప్ కొట్టి.. ట్రైన్ కదిలిన తర్వాత కిటికీ అవతల ఉన్న కొబ్బరి బొండం నుంచి నీళ్లు తాగడం ఎలాగో తెలియక సునీల్ పడే తిప్పలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయి. కొబ్బరి బొండం కోసం తిప్పలు పడే సునీల్ ని చూసి . “ఏం రావట్లేదా” అనే డైలాగుతో ఆడియన్స్ ని సైతం కడుపుబ్బా నవ్వించిన నటుడే ఎస్.ఎస్.కాంచి..

కమెడియన్ మాత్రమే కాదు..

పలు చిత్రాలతో తన విభిన్నమైన మార్క్ చూపిస్తూ ప్రేక్షకులను మెప్పించిన ఈయన బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే మాత్రం నిజంగా ఆశ్చర్యపోతారు. ఒకప్పుడు ‘అమృతం’ వంటి సీరియల్స్ లో కూడా నటించి, బుల్లితెర ఆడియన్స్ ను మెప్పించారు. నటుడుగానే కాదు రైటర్ గా కూడా పేరు దక్కించుకున్న ఈయన రాజమౌళి చిత్రాలకు పనిచేశారు. రాజమౌళి దర్శకత్వం వహించిన ‘ మగధీర ‘, ‘ఈగ ‘, ‘మర్యాదరామన్న’ వంటి సినిమాలకు రచయితగా పనిచేశారు. అలాగే ‘ శ్రీకృష్ణ 2026’, ‘ఏమో గుర్రం ఎగరావచ్చు’ వంటి చిత్రాలకు డైలాగ్ రైటర్ గా, స్క్రీన్ ప్లే రైటర్ గా కూడా పనిచేశారు.

రాజమౌళి కి సోదరుడి వరుస..

మగధీర సినిమా తర్వాత నితిన్ (Nithin) హీరోగా నటించిన ‘ సై ‘ సినిమాలో కూడా జెనీలియా(Genelia ) ఫాదర్ గా నటించారు. ఇక ఈయన ఎవరో కాదు కీరవాణి , రాజమౌళి లకి సోదరుడి వరుస అవుతారు. దగ్గర బంధుత్వం కావడంతోనే రాజమౌళి తన ప్రతి సినిమాలో కూడా ఈయనకి అవకాశం కల్పించినట్లు సమాచారం. ఇకపోతే ఇటీవల ‘మత్తు వదలరా -2’ సినిమాతో భారీ పాపులారిటీ సంపాదించుకున్న కోడూరి శ్రీ సింహ (Koduri Sri Simha) కాంచి తో చాలా ప్రేమగా ఉంటారట. అలాగే రాజమౌళి కొడుకు కార్తికేయ, సింగర్ కాల భైరవ లను కూడా కన్న బిడ్డల్లా చూసుకుంటారట. ఇక ఇన్ని రోజులు ఎవరో తెలియక అభిమానులు కమెడియన్ అనుకున్నారు. కానీ ఈయన టాలెంట్, బ్యాక్ గ్రౌండ్ తెలిసి ఆశ్చర్యపోతున్నారు.

Related News

Divvala Madhuri: ఆ రికార్డింగ్ డ్యాన్స్ వీడియోపై స్పందించిన దివ్వెల మాధురి.. రూ.కోటి మీదే!

Venuswamy : అమ్మ బాబోయ్.. వేణు స్వామి దగ్గరకు అమ్మాయిలు అందుకోసమే వస్తారా..?

Poster Talk Septmber : ఆగస్టు ఆగం అయింది… మరి సెప్టెంబర్ సేవ్ చేస్తుందా ?

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Kissik Talks Show : డైరెక్టర్స్ చేస్తుంది తప్పు.. ఆ పద్ధతి మార్చుకోండి.. గీతా సింగ్ సంచలన కామెంట్స్..

Kissik Talks Show : నటి గీతా సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

×