Allu Arjun – Allu Sirish : టాలీవుడ్ స్టార్ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఈ మధ్య వరుస హిట్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. తన సినిమాలతో ప్రేక్షకుల మనస్సులలో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. బన్నీ చేసే చిత్రాల్లో చాలా వరకు హిట్ అయ్యాయి. ఇక గత చిత్రాలను తీసుకుంటే బన్నీ వరుస హిట్స్‌తో కెరీర్‌లో ఎన్నడూ లేనంత పీక్ స్థాయిలో దూసుకుపోతున్నాడు.. గతంలో వచ్చిన పుష్ప మూవీ రికార్డులను బ్రేక్ చేసింది. నేషనల్ వైడ్ గా మంచి టాక్ ను అందుకుంది. దాంతో స్టైలిష్ స్టార్ కాస్త ఐకాన్ స్టార్ అయ్యాడు. ఇక రీసెంట్ గా పాన్ ఇండియా మూవీ పుష్ప 2 తో ప్రేక్షకులను పలకరించాడు. ఆ మూవీ పాజిటివ్ టాక్ తో పాటుగా బాక్సాఫీస్ బద్దలు కొట్టే కలెక్షన్స్ ను అందుకుంటుంది. ఇక బాలీవుడ్ డైరెక్టర్స్ సైతం ఆయనతో సినిమాలు చేసేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. అయితే ఓ వైపు అల్లు అర్జున్ తన కెరీర్‌లో ఇలా అప్రతిహతంగా దూసుకుపోతుండగా.. బన్నీ తమ్ముడు అల్లు శిరీష్ మాత్రం ఆకట్టుకోలేకపోతున్నాడు. అందుకు గల కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
అల్లు శిరీష్ నటించిన చిత్రాల్లో కొత్త జంట పర్వాలేదనిపించింది. ఆ తర్వాత ప్రయోగాత్మక సినిమాలు చేసిన కూడా పెద్దగా హిట్ టాక్ ను అందుకోలేదు. దాంతో ఈయనకు అంతగా గుర్తింపు రాలేదు. తన అన్నేమో టాలీవుడ్ ఇండస్ట్రీలో బడా హీరో.. ఇంకో అన్న స్టార్ నిర్మాత.. తండ్రికి పెద్ద ప్రొడక్షన్ హౌజ్ ఉంది.. అయినప్పటికీ అల్లు శిరీష్ మాత్రం సినిమాల్లో సక్సెస్ కాలేకపోతున్నాడు. అయితే శిరీష్ కోసం అల్లు అరవింద్ ఎన్నో ప్రయత్నాలు చేశారట. కానీ ఏ ఒక్కటి కూడా సక్సెస్ అవ్వలేదని ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
అల్లు శిరీష్ సక్సెస్ అవ్వకపోవడానికి కారణం ఆయన బద్ధకమే కారణం అని తెలుస్తుంది. బన్నీ పైకి కనిపించేలా రఫ్ గా ఉండడు.. చాలా ఓపిక అని సన్నిహితులు చెబుతున్నారు. ఆయన సినిమా కథల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటాడు. చాలా ఓపిగ్గా కథలను వింటాడు. అర్థం చేసుకుంటాడట. కానీ శిరీష్ అలా కాదట. చాలా మొండిగా ఉంటాడని.. అసలు ఎవరు చెప్పినా వినడని.. మర్యాదగా ఉండడని ఫిలిం నగర్‌లో టాక్ నడుస్తోంది.. అందుకే శిరీష్ కు వచ్చిన అవకాశాలు ఉపయోగించుకోలేక పోతున్నాడని .. దాంతో ఆయన కేరీర్ సాఫిగా సాగట్లేదని.. అన్న మాత్రం దూసుకుపోతున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తుంది.. ఎంత బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా సరే.. లక్ కూడా ఉండాలి. అలాగే ప్రేక్షకులు కూడా ఆదరించాలి. అప్పుడే ఎవరైనా సరే హీరోలుగా మారుతారు. ఇప్పటికే ఎంతో మంది ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చినప్పటికీ హీరోలుగా మారారు. అందుకే సినిమా ఇండస్ట్రీలో బ్యాక్‌గ్రౌండ్ ఉండడం అనేది పూర్తిస్థాయిలో వర్కౌట్ అవదు. ఇక ఫ్యూచర్లో అయిన హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకొని సక్సెస్ అవుతాడేమో చూడాలి..