BigTV English

Pushpa 2 First day Collections: చరిత్ర సృష్టించిన ‘పుష్ప రాజ్’.. ఏకంగా అన్ని కోట్లా..?

Pushpa 2 First day Collections: చరిత్ర సృష్టించిన ‘పుష్ప రాజ్’.. ఏకంగా అన్ని కోట్లా..?

Pushpa 2 First day Collections: పుష్ప -2 (Pushpa 2) సినిమాతో ఎట్టకేలకు అనుకున్నది సాధించారు ‘పుష్పరాజ్’ అలియాస్ అల్లు అర్జున్ (Allu Arjun).. రూ.1000 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన వీరు మొదటి రోజే ఆల్ టైం రికార్డు క్రియేట్ చేశారు. ఇప్పటివరకు ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఏ సినిమా కూడా తొలి రోజు ఈ రేంజ్ లో కలెక్షన్స్ వసూలు చేయలేదు అనడంలో ఎటువంటి సందేహం లేదు.ప్రపంచవ్యాప్తంగా 12 వేలకు పైగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మొదటి రోజు రూ.294 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి సంచలన రికార్డు నమోదు చేసింది. ఈ విషయాన్ని చిత్ర బృందం పోస్టర్ తో సహా వెల్లడించింది.


నార్త్ లో సరికొత్త రికార్..

సాధారణంగా తెలుగు సినిమాలకు నార్త్ ఇండియాలో పెద్దగా డిమాండ్ ఉండదు. కానీ 2021లో పుష్ప సెట్ చేసిన రికార్డు అంతా ఇంతా కాదు. అయితే ఇప్పుడు ఆ రికార్డును కేవలం ఒక్క రోజులోనే పుష్ప -2 సినిమాతో సాధించారు అల్లు అర్జున్. దీన్ని బట్టి చూస్తే బన్నీకి నార్త్ లో ఏ రేంజ్ లో పాపులారిటీ ఉందో అర్థం చేసుకోవచ్చు. పుష్ప సినిమాతో రూ.100 కోట్లు రాబట్టడానికి కొంత సమయం పట్టింది. కానీ పుష్ప -2 సినిమాతో ఏకంగా తొలి రోజే రూ.72 కోట్లు రాబట్టి భారత సినీ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించారు.


బాహుబలి2, ఆర్ఆర్ఆర్ రికార్డ్స్ బ్రేక్..

ఇప్పటివరకు బాహుబలి 2 రికార్డ్ ను ఏ సినిమా కూడా టచ్ చేయలేదు. అటు రాజమౌళి, ఇటు ప్రభాస్ కూడా ఆ దరిదాపుల్లోకి మళ్ళీ వెళ్ళలేదు. ఇక ఫస్ట్ డే ఓపెనింగ్ విషయంలో బాహుబలి 2 ను ఆర్ఆర్ఆర్ బ్రేక్ చేసినప్పటికీ.. రూ.1800 కోట్ల లాంగ్ రన్ కలెక్షన్స్ రికార్డ్స్ మాత్రం బ్రేక్ చేయలేకపోయింది. అయితే ఇప్పుడు పుష్ప -2 ఆర్ఆర్ఆర్ రికార్డును కూడా బ్రేక్ చేసింది. లాంగ్ రన్ ముగిసేసరికి ఎంత వసూలు చేసింది అనే విషయం పక్కన పెడితే, మొదటిరోజు పుష్ప -2 ఏకంగా రూ.294 కోట్ల గ్రాస్ రాబట్టి సంచలన రికార్డు నమోదు చేసింది. ఆర్ఆర్ఆర్ సినిమా రూ.223 కోట్లు, బాహుబలి 2 రూ.215 కోట్లను ఒక రోజులోనే రాబడితే ఈ రికార్డులను సింగిల్ హ్యాండ్ తో లేపేశారు అల్లు అర్జున్. ఒక హిందీలో రూ.72 కోట్లు రాబట్టిన ఈ సినిమా కేరళలో రూ. 6.50 కోట్లు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. తమిళ్ , కన్నడలో కూడా అదిరిపోయే వసూలు రాబట్టింది. ఓవర్సీస్ లో ప్రీ సేల్స్, డే వన్ కలెక్షన్స్ మొత్తం కలుపుకొని 4.4 మిలియన్ డాలర్స్ రాబట్టింది.

పుష్ప 2 సినిమా విశేషాలు..

అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం పుష్ప 2. ఇందులో సునీల్, అనసూయ, రావు రమేష్, ఫహద్ ఫాజిల్ , జగపతిబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు.<

/p>

Tags

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×