BigTV English

Rajamouli : రాజమౌళికి జక్కన్న పేరు పెట్టింది ఎన్టీఆర్ కాదా.. ఎవరంటే?

Rajamouli : రాజమౌళికి జక్కన్న పేరు పెట్టింది ఎన్టీఆర్ కాదా.. ఎవరంటే?

Rajamouli : దర్శక ధీరుడు రాజమౌళికి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన తెరకెక్కిస్తున్న సినిమాలు భారీ బడ్జెట్ తో పాటుగా ప్రేక్షకుల మనసు దోచుకుంటాయి. అందుకే సినిమాల కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తారు. రావడం ఆలస్యం అవుతుందేమో కానీ సినిమాలు హిట్ అవ్వడం పక్కా అని అందరు ఆయనను అంటారు. ఓటమెరుగని విక్రమార్కుడు రాజమౌళి బాహుబలి సినిమాతో మన ఖ్యాతిని ఎల్లలు దాటించాడు. బాహుబలి ఫ్రాంచైజీలో వచ్చిన రెండు చిత్రాలను సూపర్ డూపర్ హిట్స్‌గా మార్చి ప్రేక్షకులకి సరికొత్త వినోదం పంచాడు. ఇక ట్రిపుల్ ఆర్ లాంటి ప్రత్యేక మూవీతో తనకు సాటి లేరని నిరూపించుకున్నాడు.. అలుపెరుగని ధీరుడు అందుకే ఇండస్ట్రీలో ఆయన్ను ముద్దుగా జక్కన్న అని పిలుచుకుంటారు. అయితే ఆయన ఈ జక్కన్న అని పేరు పెట్టింది ఇంతవరకు జూనియర్ ఎన్టీఆర్ అనుకున్నారు. కానీ ఎన్టీఆర్ కాదట.. మరి ఆ పేరును ఆయనకు పెట్టింది ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..


రాజమౌళికి జక్కన్న అని పేరు పెట్టింది రాజీవ్ కనకాల.. ఎన్టీఆర్‌తో రాజమౌళి తీసిన మొదటి చిత్రం స్టూడెంట్ నంబర్ 1.. ఇక 2001లో ఈ సినిమా విడుదల అయ్యింది. ఈ చిత్రంలో గజాలా హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీలో రాజీవ్ కనకాల విలన్ గా కనిపించాడు. ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకోవడంతో పాటుగా కలెక్షన్స్ ను కూడా రాబట్టింది. ఈ సినిమా షూటింగ్ టైం లో రాజమౌళి పనితీరు నచ్చిన రాజీవ్ కనకాల జక్కన్న అని పిలిచారట. ఆ పేరు ఎన్టీఆర్ కు కూడా బాగా నచ్చడంతో ఆ పేరుతోనే ఎక్కువగా పిలవడంతో ఆయనే పేరు పెట్టారని అనుకున్నారు. ఇక అప్పటి నుంచి ఇండస్ట్రీలోని అందరు ముద్దుగా జక్కన్న అని పిలుస్తున్నారు.

రాజమౌళికి తెలుగు తో పాటుగా కన్నడ బాష కూడా బాగా వచ్చు. ఇక రాజమౌళి తన కెరీర్‌లో ఒక్క ఫ్లాప్ కూడా ఇవ్వలేదు. బాక్సాఫీస్‌ని షేక్ చేయకముందు రాజమౌళి పలు సీరియల్స్‌కి దర్శకత్వం కూడా వహించాడు. ఇక బాహుబలి కోసం ఆయన కుటుంబం అంతా పని చేశారు. తండ్రి స్టోరీ రైటర్.. ఆ మూవీకి కథను ఇచ్చారు. ఆయన భార్య రమా కాస్ట్యూమ్ డిజైనర్‌, ఇక అన్న కీరవాణి చక్కటి సంగీతాన్ని అందించారు. కొడుకు ప్రొడక్షన్ పనులు చూసుకున్నాడు. ఫ్యామిలీ మొత్తం కలిసి పనిచేసి బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకున్నారు. రామ్ చరణ్, ఎన్టీఆర్‌తో జక్కన్న తీసిన ఆర్ఆర్ఆర్ సినిమాతో మళ్లీ హిట్ కొట్టారు. రాజమౌళి ఇప్పటికే తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తీశారు. కన్నడలో సినిమాలు చెయ్యలేదు.. ఆయన తీసిన సినిమా ఒక్కటి కూడా ఫ్లాప్ కాలేదు. స్టూడెంట్ నంబర్ 1, మర్యాద రామన్న, ఈగ, ఛత్రపతి, బాహుబలి, ట్రిపుల్ ఆర్ వంటి బ్లాక్ బాస్టర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకొని సినీ చరిత్రలో హిట్ డైరెక్టర్ గా తన పేరును లిఖించుకున్నాడు. ఇకపోతే ప్రస్తుతం ఈయన మహేష్ బాబుతో ఓ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాకు ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేశారు. వచ్చే ఏడాది జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుందని సమాచారం. ఇక ఆ సినిమా ఎలాంటి రికార్డులను బ్రేక్ చేస్తుందో చూడాలి..


Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×