BigTV English
Advertisement

Pushpa 2: బాలీవుడ్ లో బన్నీ దెబ్బ.. కింగ్ ఖాన్ అబ్బా..

Pushpa 2: బాలీవుడ్ లో బన్నీ దెబ్బ.. కింగ్ ఖాన్ అబ్బా..

Pushpa 2: పుష్ప అంటే ఫ్లవర్  అనుకుంటివా.. ఫైర్ కదా.. కాదు వైల్డ్ ఫైర్… నీయవ్వ తగ్గేదేలే. ఈ డైలాగ్ కు తగ్గట్లే పుష్ప 2 రికార్డ్స్ కూడా ఉన్నాయి. ఐకాన్ స్టార్  అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలోవచ్చిన చిత్రం పుష్ప 2. దాదాపు మూడేళ్ల క్రితం ఈ కాంబో నుంచి వచ్చిన పుష్ప ఏ రేంజ్ హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బన్నీకి జాతీయ అవార్డును తీసుకొచ్చి పెట్టిన సినిమాగా  పుష్పకు సపరేట్ గుర్తింపు ఉంటుంది.


ఇక ఈ సినిమాకు సీక్వెల్ గా ఎప్పుడెప్పుడు పుష్ప 2 వస్తుందా అని అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూసారు. ఇక ఎట్టకేలకు ఫ్యాన్స్ ఎదురుచూసిన క్షణం వచ్చేసింది. డిసెంబర్ 5 న పుష్ప 2 రిలీజ్ అయ్యి.. భారీ విజయాన్ని అందుకుంది. సాధారణంగా మొదటి పార్ట్ హిట్ అయ్యినంతగా రెండో పార్ట్ హిట్ అవ్వదు. కానీ,  పుష్ప 2 మాత్రం మంచి పాజిటివ్ టాక్ నే తెచ్చుకుంది. పక్కా కమర్షియల్ బొమ్మ అని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. ఇక ఇంకొంతమంది మాత్రం కథ ఏమి లేదు. అసలు ఎక్కడ మొదలయ్యి.. ఎక్కడ ముగిసిందో అర్ధమే కాలేదు అని పెదవి విరుస్తున్నారు.

Rajamouli : రాజమౌళికి జక్కన్న పేరు పెట్టింది ఎన్టీఆర్ కాదా.. ఎవరంటే?


ఇక ఇవేమి పట్టించుకోని ప్రేక్షకులు మాత్రం.. సినిమాను ఆదరిస్తూనే ఉన్నారు. ఇక పుష్ప 2 కూడా రికార్డ్ కలక్షన్స్ రాబట్టి సెన్సేషన్ సృష్టిస్తోంది. పుష్ప 2 మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 175 కోట్లు  కలెక్ట్ చేసిందని సమాచారం. పుష్ప 2 ఏకంగా 25 కోట్లకి పైగా షేర్ ని ఒక్క నైజాంలోనే అది కూడా ఒక్క రోజు లోనే  రాబట్టినట్లు తెలుస్తోంది. ఇది కూడా ఒక అరుదైన రికార్డ్ అని చెప్పాలి. ఇవన్నీ పక్కన పెడితే.. బాలీవుడ్ లో బన్నీ రికార్డ్స్ తిరగరాశాడు.

ఇప్పటివరకు ఏ బాలీవుడ్ హీరో కూడా సృష్టించని చరిత్రను సృష్టించాడు. పుష్ప 2 సినిమా హిందీలో తొలి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన  సినిమాగా రికార్డ్  క్రియేట్ చేసింది. ఒక్క రోజులోనే రూ. 72 కోట్లు వసూళ్లు రాబట్టి  బాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఈ విషయాన్నీ మేకర్స్ అధికారికంగా తెలిపారు. బాలీవుడ్ లో ఒక్కరోజులో అన్ని కోట్లు సాధించడం అంటే మాటలు కాదు. చివరికి ఆ పని కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ వలనే కాలేదు. షారుఖ్ నటించిన జవాన్ సినిమా రూ.64 కోట్ల నెట్ వసూళ్లు అందుకుంది.

Most Watched WebSeries In OTT : ఓటీటీలో ఈ ఏడాది ఎక్కువ మంది చూసిన టాప్ 5 వెబ్ సిరీస్..

ఇప్పుడు జవాన్ ను వెనక్కి నెట్టి మొదటి స్థానంలో పుష్ప 2 నిలబడింది. ఒక తెలుగు సినిమా.. హిందీలో ఇలాంటి రికార్డ్  సాధించడం ఇదే మొదటిసారి. బన్నీకి నార్త్ లో ఎంత క్రేజ్ ఉందో ఈ రికార్డులను బట్టే అర్ధమవుతుంది. అందుకే బన్నీ సైతం.. పాన్ ఇండియా లెవెల్లో ప్రమోషన్స్ చేసుకొచ్చాడు. ఇక ఈ పోస్టర్ చూసిన అభిమానులు.. అది బన్నీ దెబ్బ. అతను మనసుపెట్టాలే కానీ రికార్డులను గల్లంతు చేయడంలో ఆయన తరువాతే ఎవరైనా అని కామెంట్స్ పెడుతున్నారు. మరి ముందు ముందు పుష్ప 2  ఎలాంటి రికార్డులు బద్దలుకొడుతుందో చూడాలి.

Tags

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×