ICC Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ( ICC Champions Trophy 2025) … నిర్వహణపై గత కొన్ని రోజులుగా సందిగ్ధత నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్… వచ్చే సంవత్సరం జరగనుంది. ఐసీసీ లెక్క ప్రకారం ఈ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ( ICC Champions Trophy 2025) పాకిస్థాన్ లో నిర్వహించాలి. కానీ పాకిస్తాన్ లో నిర్వహిస్తే టీమిండియా… అక్కడికి వెళ్లడం సాధ్యపడదు. భద్రతా కారణాలు, దేశ అంతర్గత సమస్యలు, ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య విభేదాలు… ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలే ఉన్నాయి.
వీటి కారణంగా టీమిండియాను పాకిస్తాన్ కు పంపేది లేదని ఇప్పటికే భారత ప్రభుత్వం ప్రకటన.. చేయడం జరిగింది. దానికి తగ్గట్టుగానే… భారత క్రికెట్ నియంత్రణ మండలి కూడా వ్యవహరిస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ( ICC Champions Trophy 2025) నుంచి తప్పుకుంటాం కానీ పాకిస్తాన్ కు వెళ్ళేది లేదని… ఇప్పటికే ఐసీసీ కి తేల్చి చెప్పింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. అయితే.. పాకిస్తాన్ కంటే టీమిండియా అవసరం ఐసీసీకి ఉంది.
Also Read: IND vs Aus 2nd Test: 180 పరుగులకే కుప్పకూలిన టీమిండియా..ఆదుకున్న తెలుగోడు !
టీమిండియా ఆడితేనే ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ( ICC Champions Trophy 2025) కు ప్రకటనలు వస్తాయి. లేకపోతే ఐసీసీకి తీవ్ర నష్టం. ఇది గ్రహించిన ఐసీసీ పాలక మండలి… పాకిస్తాన్ ను ఒప్పించింది. ఇక చేసేదేమీ లేక హైబ్రిడ్ మోడల్ కు పాకిస్తాన్ కూడా ఒప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ( ICC Champions Trophy 2025) లో భాగంగా… అన్ని మ్యాచ్ లు పాకిస్తాన్ దేశంలోనే జరుగుతాయి. కానీ టీమిండియా ఆడే మ్యాచ్ లు… మాత్రం దుబాయ్ లో నిర్వహించబోతున్నారు.
ఒకవేళ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ( ICC Champions Trophy 2025)లో టీమిండియా సెమిస్ అలాగే ఫైనల్ కు చేరితే ఖచ్చితంగా దుబాయ్ లో ఈ రెండు మ్యాచ్లు జరుగుతాయి. ఒకవేళ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ( ICC Champions Trophy 2025) లో టీమిండియా ఈ రెండు మ్యాచ్ లకు అర్హత సాధించకపోతే పాకిస్తాన్ లో… సెమీఫైనల్ అలాగే ఫైనల్ మ్యాచ్ లు జరుగుతాయి. ఈ మేరకు ఐసీసీ కూడా కీలక ప్రకటన చేసినట్లు సమాచారం. ఇక వచ్చే సంవత్సరం అక్టోబర్ మాసంలో మహిళల వన్డే ప్రపంచ కప్… ఇండియా లో జరగనున్న సంగతి తెలిసిందే.
Also Read: IND vs Aus 2nd Test: బ్యాటింగ్ చేయనున్న టీమిండియా.. భారీ మార్పులతో బరిలోకి !
అయితే ఈ టోర్నమెంటులో… పాకిస్తాన్ ఆడే మ్యాచ్ లు… ఇండియా వెలుపల.. నిర్వహించే ఛాన్స్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక 2026 పురుషుల టీ20 ప్రపంచ కప్ శ్రీలంకతో పాటు ఇండియా కూడా ఉమ్మడిగా నిర్వహించ బోతున్న సంగతి తెలిసిందే. అయితే ఆ సమయంలో పాకిస్తాన్ ఆడాల్సిన మ్యాచ్ లన్నీ శ్రీలంక వేదికగా జరిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఈ మేరకు ఐసీసీ నిర్ణయాలు తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై అతి త్వరలోనే ప్రకటన కూడా రానుంది.