దిగ్గజ లెజెండ్రీ దర్శకులు కోడి రామకృష్ణ (Kodi Ramakrishna) పేరు చెప్పగానే.. మనకు ముందుగా ‘అమ్మోరు’, ‘అరుంధతి’ వంటి చిత్రాలే గుర్తుకొస్తాయి. ముఖ్యంగా ఈ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లారు కోడి రామకృష్ణ. ముఖ్యంగా సమాజంలో జరిగే ప్రతి విషయాన్ని స్మృశించి సినిమా తీసి విజయం అందుకున్నారు. తన సినిమాలతో సమాజానికి మంచి సందేశాన్ని కూడా అందించారు.అంతేకాదండోయ్ ఈయన తెలుగు సినిమాకు విజువల్ ఎఫెక్ట్స్ అనే కొత్త డైమెన్షన్ పరిచయం చేసి.. సినిమా ప్రపంచాన్ని పూర్తిగా మార్చివేశారు. ఈరోజు తెలుగు సినిమా స్థాయి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది అంటే.. నాడు ఆయన వేసిన పునాదే కారణం అని చెప్పవచ్చు. అలాంటి ఆ మహనీయుడు 6వ వర్ధంతి ఈరోజు.. ఈ నేపథ్యంలోనే ఆయనకు సంబంధించిన కొన్ని విషయాలు వైరల్ గా మారగా అందులో ఒకటి ఆయన తలకట్టు, చేతికి తాళ్లు, వేళ్లకు ఉంగరాలు.. ఎప్పటికప్పుడు ఈ విషయాలు అభిమానులను ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. మరి కోడి రామకృష్ణ తలకు కట్టుకునే పాగా వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటో? ఇప్పుడు చూద్దాం.
విజువల్ ఎఫెక్ట్స్ ను ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత..
1949 జూలై 23న ఆంధ్రప్రదేశ్ పశ్చిమగోదావరి జిల్లాలో జన్మించారు కోడి రామకృష్ణ. మొదట అసోసియేట్ డైరెక్టర్గా కెరియర్ ఆరంభించిన ఆయన, ఆ తర్వాత దర్శకత్వం వైపు అడుగులు వేశారు. సినిమాటిక్ టెక్నిక్స్, స్టోరీ టెల్లింగ్ పై గాఢమైన అవగాహన ,ఫ్యాషన్ కలిగి ఉన్న ఈయనకు అదే తెలుగు సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా మార్చింది. ఇకపోతే సినిమా ఇండస్ట్రీలో 24 ఫ్రేమ్స్ అని అందరూ చెబుతారు కానీ కోడి రామకృష్ణ విజువల్ ఎఫెక్ట్స్ ను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసి.. దానిని ఒక కళ రూపంగా మార్చి ఈరోజు ఎఫెక్ట్స్ 25త్ క్రాఫ్ట్ గా మార్చారు. ముఖ్యంగా ఫాంటసీ ఫిలింస్ గా వచ్చిన అమ్మోరు, దేవి, దేవుళ్ళు, అంజి, అరుంధతి ఇలా ఒక్కో సినిమాతో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచిన ఆ సినిమాలన్నీ కూడా తెలుగు సినిమా స్థాయిని పెంచాయి. ముఖ్యంగా సినిమాల ద్వారా ప్రేక్షకులకు కూడా సినిమాని చూసే దృష్టి మార్చేసిన విజనరీ కోడి రామకృష్ణ. ఇకపోతే కోడి రామకృష్ణ సినిమాలే కాకుండా ఆహార్యం కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటుంది. మణికట్టు నిండా రక్షా తాళ్ళు.. చేతికి ఉంగరాలతో పాటు నుదిటిన తిలకం, తలకి ఒక కట్టు కట్టుకునేవారు. ఇక ఎక్కువగా తెల్లటి వస్త్రాలతో నుదుటిన కూడా తెల్లటి కట్టుతో బయట కనిపించేవారు. మరి దీని వెనుక ఉన్న రహస్యాన్ని ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు కోడి రామకృష్ణ.
తలకట్టు, రక్షాతాళ్ళ వెనుక ఉన్న రహస్యం ఇదే..
అసలు విషయంలోకి వెళితే.. దర్శకుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత కోడి రామకృష్ణ చేసిన చిత్రం ‘తరంగిణి’. 1992లో ఈ సినిమా విడుదలయ్యింది. ఇకపోతే ఈ సినిమా షూటింగ్లో ఉన్నప్పుడు సీనియర్ ఎన్టీఆర్ మేకప్ మ్యాన్ మోకా రామారావు(Moka Ramarao) కోడి రామకృష్ణ దగ్గరకు వచ్చి..” మీ నుదురు చాలా పెద్దగా ఉంది. ఎండ తగలకుండా నుదుటికి కట్టు కట్టండి” అని చెబుతూనే.. ఆయన దగ్గర ఉన్న ఒక తెల్ల కర్చీఫ్ ని స్వయంగా కోడి రామకృష్ణ నుదుటన కట్టారట. అయితే అనూహ్యంగా కోడి రామకృష్ణ ఆ రోజంతా షూటింగ్లో చాలా హుషారుగా పనిచేశారట. ఇక మరుసటి రోజు కూడా ఒక తెల్లటి బ్యాండ్ ఒకటి ప్రత్యేకంగా తయారు చేయించి మరీ ధరించారట.ఆ సమయంలో తనలో ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చినట్లు గమనించిన కోడి రామకృష్ణ.. దానినే సెంటిమెంట్ గా కొనసాగించారు. అంతేకాదు సినిమాలలో ఏదైనా సమస్య ఏర్పడినప్పుడు తనకు పరిష్కారం దొరకకపోతే.. వెంటనే నుదుటికి కట్టు కడితే ,ఆ పరిష్కారం లభించేదని సన్నిహితులతో కూడా కోడి రామకృష్ణ తెలియజేశారట. ఇకపోతే నుదుటికి కట్టు కట్టుకున్న ఈయన చేతికి అన్ని తాళ్లు, ఉంగరాల కథ ఏంటి..? అనే విషయానికి వస్తే.. ఈయన ఎక్కువగా దైవానికి సంబంధించిన సినిమాలను తెరకెక్కించారు. అందులో అమ్మోరు, దేవి, దేవుళ్ళు, అరుంధతి లాంటి సినిమాలు చేశారు. ఆ సమయంలో దైవంతో పాటు దయ్యం కూడా ఉంటుందని నమ్మే కోడి రామకృష్ణ దుష్టశక్తులండి తనను తాను కాపాడుకోవడానికి ఒక వ్యక్తి ఇచ్చిన సలహా మేరకు చేతికి రక్ష తాళ్లతో పాటు ప్రత్యేకంగా తయారు చేయించిన ఉంగరాలను కూడా ధరించే వారట. ఇక ఇవన్నీ కూడా ఆయనను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా మార్చాయని చెప్పవచ్చు.
Sankrantiki Vastunnam : ఓటీటీ కంటే ముందుగానే టీవీల్లోకి.. డేట్ అండ్ టైం వచ్చేసింది..