Group-2 exams: ఆంధ్రప్రదేశ్ గ్రూప్-2 అభ్యర్థులకు ఇది బిగ్ అలర్ట్. గ్రూప్ -2 పరీక్షలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రేపు జరగాల్సిన గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలని ఏపీపీఎస్సీని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.
ALSO READ: Jobs in Indian Railways: శుభవార్త.. రైల్వేలో 32,438 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోనివారికి మరో అవకాశం..
రోస్టర్ విధానంలో లోపాలు ఉన్నాయంటూ గత కొన్ని రోజుల నుంచి అభ్యర్థులు చేసి అభ్యంతరాలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. అటు రోస్టర్ అంశంపై కోర్టులో ఉన్న పిటిషన్ విచారణ మార్చి 11న జరగనుండగా.. అప్పటి వరకు వేచి చూడాలని ప్రభుత్వం భావిస్తోంది. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 23వ తేదీ అంటే.. రేపటి రోజున గ్రూప్ 2 పరీక్ష జరగాల్సి ఉంది. కానీ పరీక్షకు ఒక్క రోజు ముందు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్ 2 మెయిన్స్‌పై అభ్యర్థుల నుంచి వస్తున్న కొన్ని వినతులను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం కొద్దిరోజుల పాటు పరీక్షలను వాయిదా వేయాలని ఏపీపీఎస్సీకి ఆదేశాలు జారీ చేసింది.
రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రేపటి నుంచి జరగాల్సిన గ్రూప్ -2 మెయిన్స్ పరీక్షలను ఏపీపీఎస్సీ వాయిదా వేసినట్లు సమాచారం. రోస్టర్ తప్పులు సమస్యం పరిష్కారం చూపకుండా పరీక్షల నిర్వహణపై అభ్యర్థులు కొద్దిరోజులుగా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై గ్రూప్-2 అభ్యర్థులు కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసిన విషయం విదితమే. ఈ పిటిషన్ వచ్చే నెల మార్చి 11వ తేదీన విచారణకు రానుంది.
ALSO READ: IOCL jobs: అలెర్ట్.. టెన్త్, ఇంటర్ అర్హతతో 246 ఉద్యోగాలు.. మంచి వేతనం.. రేపే లాస్ట్ డేట్ భయ్యా..
ఇదిలా ఉండగా.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అఫిడవిట్ వేసేందుకు మరి కొంత సమయం కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల విన్నపాన్ని పరిగణనలోకి తీసుకుని గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షను కొద్దిరోజులు వాయిదా వేయడం మంచిదని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే పరీక్షను వాయిదా వేయాలని ఏపీపీఎస్సీ సెక్రటరీకి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.