Sankrantiki Vastunnam ..సాధారణంగా ఒక సినిమా థియేటర్లలో విడుదలై మంచి విజయాన్ని సాధించింది అంటే.. ఆ సినిమా ఓటీటీలో రావడానికి కాస్త ఆలస్యం అవుతుంది. ఇక ఓటీటీలోకి వచ్చిన కొంత కాలానికి మళ్లీ టీవీలోకి వస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ ఇక్కడ ఆశ్చర్యపోయే విషయం ఏమిటంటే..సంక్రాంతికి వచ్చి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకొని, అటు ఓటీటీ లో విడుదల కంటే ముందే టీవీలోకి రాబోతుండడంతో అభిమానులే కాదు సినీ ప్రేక్షకులంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఎప్పుడు? ఏ సమయంలో? టీవీల్లో ప్రసారం చేయబోతున్నారు అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి అసలు విషయాలు ఇప్పుడు చూద్దాం.
ఓటీటీ కంటే ముందే జీ తెలుగులో..
సంక్రాంతి బ్లాక్ బస్టర్ అనగానే అందరికీ గుర్తొచ్చే సినిమా సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunnam).. అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ (Venkatesh) హీరోగా నటించిన చిత్రం ఇది. ఇందులో ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh), మీనాక్షి చౌదరి (Meenakshi Choudhary) హీరోయిన్లుగా నటించారు. భారీ మధ్య సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇకపోతే ఓటీటీ రిలీజ్ తేదీని మేకర్స్ త్వరలో ప్రకటించనున్న నేపథ్యంలో అప్పుడే టీవీలో రావడానికి సిద్ధమయ్యింది. మార్చి 1వ తేదీన జీ తెలుగులో ప్రసారం కానుంది అని మేకర్స్ ప్రకటించారు. వచ్చే శనివారం సాయంత్రం 6 గంటలకు ఈ సినిమా ప్రసారం కానుంది అని మేకర్స్ చెప్పడంతో అభిమానులే కాదు ఆడియన్స్ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఆ డేట్ ను క్యాలెండర్ లో నోట్ చేసుకొని మరి సినిమా కోసం ఎదురు చూస్తూ ఉండడం గమనార్హం. ఇక ఇండస్ట్రీ చరిత్రలో ఈ చిత్రం ఓటీటీ విడుదలకు ముందే టీవీలోకి రానుండడం కూడా ఒక విశేషంగా చెప్పవచ్చు. ఏది ఏమైనా థియేటర్లలో మిస్ అయిన చాలామంది , అటు ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ కొనుగోలు చేయలేని వారు కూడా ఇప్పుడు ఎంచక్కా ఫ్యామిలీతో కలిసి ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీని చూసేయొచ్చు. ఇక ప్రాంతీయంగా విడుదలైన ఈ సినిమా తెలుగులో దాదాపు రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూల్ చేసి రికార్డు సృష్టించింది. మరి టీవీలో రాబోతున్న ఈ సినిమా ఎటువంటి టీఆర్పీ రేటింగ్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.
విక్టరీ వెంకటేష్ సినిమాలు..
గత కొంతకాలంగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న వెంకటేష్.. తన 75వ చిత్రంగా సైంధవ్ మూవీని విడుదల చేసి భారీ డిజాస్టర్ ను మూటగట్టుకున్నారు. ఈ సినిమాతో ఎలాగైనా మంచి విజయాన్ని అందుకున్న ఆయనకు నిరాశ మిగిలింది. దాంతో ఎలాగైనా హిట్టు కొట్టాలని అనిల్ రావిపూడి తో మళ్ళీ జతకట్టారు. గతంలోనే అనిల్ రావిపూడి తో ఎఫ్2, ఎఫ్3 సినిమాలు చేసి మంచి విజయాలను తన ఖాతాలో వేసుకున్న వెంకటేష్.. అందులో భాగంగానే మూడవసారి కూడా సినిమా చేశారు. ఇక ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. మొత్తానికైతే కామెడీ జానర్ ను నమ్ముకుని, ఫ్యామిలీ ఆడియన్స్ టార్గెట్ gaa అటు అనిల్ రావిపూడి ఇటు వెంకటేష్ ఇద్దరు కూడా సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. ఇక ప్రస్తుతం అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవిని లైన్లో పెట్టినట్లు తెలుస్తోంది.