Kollywood:సినీ ఇండస్ట్రీలో విషాదాలు అభిమానులను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. కొంతమంది వయసు పై పడటం వల్ల తుది శ్వాస విడుస్తుంటే.. మరి కొంతమంది అనారోగ్య సమస్యలతో స్వర్గస్తులవుతున్నారు. ఈ క్రమంలోనే ఇక్కడ ఒక సీనియర్ నటి, అందులోనూ గుండెపోటు వచ్చి ఆమె తుది శ్వాస విడవడంతో అభిమానులు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక ఆమె ఎవరు? ఏం జరిగింది? అనే వివరాలలోకి వెళ్తే.. ప్రముఖ కోలీవుడ్ సీనియర్ నటి ముతాట్టి పెరుమాయి 73 సంవత్సరాల వయసులో గుండెపోటు కారణంగా మే 4 ఆదివారం తుది శ్వాస విడిచారు. అయితే ఈ విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి రావడంతో అభిమానులు ఈ విషయం తెలిసి కన్నీటి పర్యంతం అవుతున్నారు.
గుండెపోటుతో సీనియర్ నటి మృతి..
మధురై జిల్లా, ఉసిలంపట్టు సమీపంలోని అన్నంపారిపటతట్టి గ్రామానికి చెందిన ముతాట్టి పెరుమాయి.. ప్రముఖ దర్శకుడు భారతీయ రాజా దర్శకత్వం వహించిన ‘పొన్ను’ అనే చిత్రం ద్వారా సినీ పరిశ్రమకు పరిచయమయ్యారు. ఆ తర్వాత మళ్లీ భారతీరాజా దర్శకత్వం వహించిన పలు సినిమాలలో ముఖ్య పాత్రలు పోషించిన ఈమె, తన నటనతో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ఇక ఎక్కువగా గ్రామీణ కథా పాత్రలలో నటించిన ఈమె.. నటుడు విజయ్ (Vijay)హీరోగా నటించిన విల్లు, శివ కార్తికేయన్(Siva Karthikeyan) హీరోగా నటించిన ‘ఎథిర్ నీచ్చల్’ తదితర చిత్రాలలో నటించింది. ఇక ఇప్పటివరకు సుమారుగా 30 చిత్రాలకు పైగా నటించిన ఈమె.. అనారోగ్యం కారణంగా ఇటీవల నటనకు దూరంగా ఉన్నారు. ఈమె చివరిగా ‘డండాట్టి’ సినిమాలో చివరిగా నటించి, ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఈమె గుండెపోటు కారణంగా ఆదివారం ఉదయం కన్నుమూశారు. ఈమెకి ఒక కొడుకు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈమె మరణం సినీ ఇండస్ట్రీకి తీరని లోటు అని అభిమానులతో పాటు సినీ సెలబ్రిటీలు కూడా కామెంట్లు చేస్తున్నారు.