BigTV English

CM Chandrababu: మరో బాంబు పేల్చిన కేశినేని నాని.. ఆపై సీఎం చంద్రబాబుకు లేఖ

CM Chandrababu: మరో బాంబు పేల్చిన కేశినేని నాని..  ఆపై సీఎం చంద్రబాబుకు లేఖ

CM Chandrababu: ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది లిక్కర్ స్కామ్. దీనిపై లోతుగా దర్యాప్తు చేస్తోంది ప్రభుత్వం. తాజాగా ఈ వ్యవహారాన్ని టీడీపీకి అంటించే ప్రయత్నం చేశారు మాజీ ఎంపీ కేశినేని నాని. ఈ స్కామ్‌లో తమ్ముడు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ప్రయేముందని బాంబు పేల్చాడు. సీఎం చంద్రబాబుకు మాజీ ఎంపీ లేఖ రాశారు. ఈ వ్యవహారం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ హాట్‌గా మారింది.


కేశినేని నాని లేఖ సారాంశం

చదరంగం గేమ్ మాదిరిగానే ఏపీ రాజకీయాలు సాగుతున్నాయి. ముఖ్యంగా విజయవాడ రాజకీయాల విషయానికి వద్దాం. కేశినేని నాని- ఎంపీ కేశినేని చిన్ని మధ్య కోల్డ్‌వార్ ముదిరిపాకాన పడింది. ఒకరిపై మరొకరు బురద జల్లు కునే ప్రయత్నం చేస్తున్నారు.  తాజాగా లిక్కర్ స్కామ్ కేసులో తన తమ్ముడు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్నికి ప్రమేయం ఉందని ఆరోపిస్తూ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు కేశినేని నాని.


ఎంపీగా ఓడిపోయిన తర్వాత ఎంపీ చిన్నిపై లేనిపోని బురద జల్లుతున్నారు నాని. మొన్నటికి మొన్న విశాఖ భూముల విషయంలో చిన్నిపై  తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఇప్పుడు లిక్కర్ కేసు వంతైంది. ఈ కేసులో నిందితులను సిట్ విచారిస్తోంది. ఏ ఒక్క నిందితుడు ఎంపీ కేశినేని చిన్ని ప్రమేయమున్నట్లు చెప్పలేదు. ఆ విధంగా నానిని అడ్డుకుని వైసీపీ బురద జల్లుతోందా అనే అనుమానం అప్పుడే తెలుగు తముళ్లలో మొదలైంది.

ఇంతకీ మాజీ ఎంపి కేశినేని నాని వెల్లడించిన విషయాలకు వద్దాం. మద్యం కుంభకోణంలో కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి-ఆయన సన్నిహితుడు దిలీప్ పైలక్-విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిలకు సంబంధించిన సమాచారాన్ని మీ దృష్టికి తీసుకురావడానికి రాసినట్టు ప్రస్తావించారు. లిక్కర్ కుంభకోణంలో ఎంపీ కేశినేని చిన్ని, ఆయన భార్య జానకి లక్ష్మికి ప్రైడ్ ఇన్‌ఫ్రాకాన్ LLPలో నియమించబడిన భాగస్వామిగా ఉన్నారని ప్రస్తావించారు.

ALSO READ: ప్రభుత్వ ఆఫీసులో కామక్రీడలు.. ఆ ఉద్యోగి ఏకాంతానికి బ్రేక్

ప్రస్తుతం ఆకంపెనీ హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఉందని అడ్రాస్ సహా పేర్కొన్నారు. అదే చిరునామాలో కసిరెడ్డి-దిలీప్ పైలా నిర్వహిస్తున్న ఈశాన్వి ఇన్ఫ్రా ప్రాజెక్టు ఉందన్నారు. ప్రైడ్ ఇన్‌ఫ్రాకాన్-ఈశాన్వి ఇన్ఫ్రా కంపెనీలు ఒకే అధికారిక ఈ-మెయిల్ ఐడీని ఉపయోగిస్తున్నారని పేర్కొన్నారు. దీనివల్ల ఈ రెండు సంస్థల లోతైన, ఉద్దేశ పూర్వక కార్యాచరణ సంబంధాన్ని స్పష్టంగా సూచిస్తున్నట్లు రాసుకొచ్చారు.

అరెస్టయిన ఇద్దరు కీలక వ్యక్తులతో సిట్టింగ్ ఎంపీ నేరుగా సంబంధం ఉండటం రాజకీయ, రక్షణ, ఆర్థిక సమన్వయం ఆందోళన కలిగిస్తోందన్నారు కేశినేని నాని. దీనికితోడు ఎంపీ చిన్నికి సంబంధించి హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ పెట్టుబడులు, బినామీ భూమి కొనుగోళ్ల వ్యవహారాన్ని బయటపెట్టారు. సిట్టింగ్ ఎంపీ ఇద్దరు అరెస్టు చేయబడిన వ్యక్తుల కంపెనీలో భాగస్వామిగా ఉండటం పలు అనుమానాలు తలెత్తుతున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు మాజీ ఎంపీ.

ఎంపీ కేశినేని చిన్ని రిప్లై

మరోవైపు ఎంపీ కేశినేని చిన్ని రియాక్ట్ అయ్యారు. నీతిమాలిన ఆరోపణలకు స్పందించాల్చిన అవసరం లేదన్నారు. ప్రజా ప్రతినిధిగా ప్రజలకు, మా పార్టీ క్యాడర్‌కు స్పష్టత ఇవ్వడం కోసం , వెన్నుపోటు దారుడు, నయవంచకుడు, నమ్మక ద్రోహి, జగన్‌కి గూఢచారిగా పని చేస్తున్నావని రాసుకొచ్చారు.

తాను క్రియాశీల రాజకీయాల్లో అడుగు పెట్టడానికి ముందు మా సంస్థకు చెందిన ఆస్తి సరిహద్దులో కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి సంస్థకు చెందిన స్థలం ఉందన్నారు. సంయుక్తంగా నిర్మాణం చెపట్టడానికి 2021లో రిజిస్టర్ అయిన సంస్థ అని, అందుకు సంబంధించిన వివరాలు పబ్లిక్ డొమైన్‌లో అందరికి అందుబాటులో ఉన్నాయన్నారు.

రాజకీయాల్లోకి అడుగు పెట్టాలన్న నిర్ణయం తర్వాత కసిరెడ్డి సంస్థతో ఎలాంటి నిర్మాణాలు జరపకుండా ఆనాడే నిర్ణయం తీసుకున్నట్లు రాసుకొచ్చారు. ఆ నిర్ణయం కారణంగా ఆర్థికంగా తాను నష్టపోవడం జరిగిందన్నారు.
అమెరికా, దుబాయ్ కంపెనీలు అంటూ నాని సృష్టించిన ఫేక్ కంపెనీలను నిరూపించాల్సిన బాధ్యత, ఆరోపణలు చేసిన వారిపై ఉంటుందన్నారు.

జగన్ లాంటి కాలకేయుడు పాలనలో కన్నతల్లి లాంటి పార్టీకి వెన్ను పోటు పొడిచింది నువ్వకాదా అంటూ ప్రశ్నించారు. జె గ్యాంగ్‌తో కుట్ర పన్ని చిమ్మిన విషం ప్రజలు , పార్టీ మరువలేదని తెలిపారు. నీలో సత్తా వుంటే తనకు-కసిరెడ్డికి మధ్య ఆర్థిక లావాదేవీలు ఉన్నాయని నిరూపించాలని ఛాలెంజ్ విసిరారు. ఎంపీ రియాక్షన్‌పై కేశినేని నాని ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

 

Related News

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Nara Lokesh: ర్యాగింగ్ ఘటనపై లోకేష్ ఘాటు రియాక్షన్

Visakhapatnam 2050: విశాఖ నగరం 2050లో.. ఇలా ఉంటుందా? అసలు ఊహించలేం కదా!

Araku Coffee: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అరకులో ఇకపై అందరూ లక్షాధికారులే!

Pawan Kalyan project: పవన్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం.. కోట్లల్లో ఖర్చు.. ఎందుకంటే?

Big Stories

×