Praveen Kandregula : టాలెంట్ ఉంటే కచ్చితంగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక స్థానం ఉంటుంది అని ప్రూవ్ చేసిన దర్శకులు చాలామంది ఉన్నారు. అయితే దర్శకుడిగా సినిమా చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు ప్రవీణ్ కాండ్రేగుల. ఆల్మోస్ట్ ప్రయత్నాలన్నీ ఆపేసిన తర్వాత రాజ్ డీకే సహాయంతో సినిమా బండి అనే సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా డైరెక్ట్ గా నెట్ ఫిక్స్ లో విడుదలైంది. ఈ సినిమా ట్రైలర్ చాలామందిని విపరీతంగా ఆకట్టుకొని సినిమా చూడాలి అనే క్యూరియాసిటీని క్రియేట్ చేసింది. అయితే ఈ సినిమాని ప్రేక్షకులు కూడా విపరీతంగా చూశారు. ఇది కథ సినిమా అంటే అని అందరికీ అనిపించేలా ఈ సినిమాను తీశాడు దర్శకుడు ప్రవీణ్. ఈ సినిమా తర్వాత దర్శకుడు ప్రవీణ్ కు మంచి పేరు వచ్చింది. ఇక ప్రస్తుతం శుభం అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న తరుణంలో ఈ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించింది చిత్ర యూనిట్.
వాళ్లు నాకు దైవంతో సమానం
కేవలం తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ప్రేక్షకులు మాత్రమే కాకుండా సౌత్ సినిమా ఇండస్ట్రీ ప్రేక్షకులు సమంతను విపరీతంగా ఇష్టపడతారు. ముఖ్యంగా తెలుగులో మంచి క్రేజ్ ఉంది. చాలామంది స్టార్ హీరోలతో సైతం వర్క్ చేసింది. ఆ తర్వాత లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. ముఖ్యంగా రాజ్ డీకే నిర్మించిన ది ఫ్యామిలీ మెన్ సిరీస్ సమంత కెరీర్ కు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అయింది. ఇప్పుడు ప్రవీణ్ కాండ్రేగుల దర్శకుడిగా చేస్తున్న శుభం సినిమాకి ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. దీనిపై ప్రవీణ్ స్పందిస్తూ సమంత లాంటివాళ్ళు ఇలాంటి చిన్న ఫిలిమ్స్ కి బిగ్గెస్ట్ సపోర్ట్. ఒక నాని లాంటి హీరో మాట్లాడటం వల్లనే కోర్ట్ బలగం వంటి సినిమాలకు మంచి పేరు వచ్చింది. అలా అని కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేయడంలో రాజ్ డీకే ఎప్పుడు ముందుంటారు. వాళ్లు నాకు దైవంతో సమానం.
మార్నింగ్ షో చూసినవాళ్లు అదృష్టవంతులు
శుభం సినిమా మీద విపరీతమైన కాన్ఫిడెంట్ తో ఉన్నాడు దర్శకుడు ప్రవీణ్. ఈ సినిమాకి సంబంధించి మార్నింగ్ షో చూసే వాళ్ళు చాలా అదృష్టవంతులు. ఈ సినిమా చూసిన వెంటనే వాళ్ళ టాక్ 10 మందికి చెప్తారు. ఈ సినిమా గురించి పాజిటివ్ గా స్ప్రెడ్ చేస్తారు. తర్వాత థియేటర్లు నిండుతాయి. నేను కచ్చితంగా చెబుతున్నాను ఈ సినిమా ఏంట్రా బాబు ఎలా ఉంది అని మోస్ట్ ఎక్సైటింగ్ ఫీల్ అవుతారు అంటూ ప్రవీణ్ తెలిపాడు. ఇకపోతే ఈ సినిమా ట్రైలర్ ఆసక్తికరంగానే అనిపించింది. ప్రవీణ్ స్పీచ్ తర్వాత సినిమా మీద క్యూరియాసిటీ అయితే కొంత మేరకు పెరుగుతుంది అని చెప్పాలి.
Also Read : Trivikram Srinivas: స్క్రిప్టు లాక్ అయింది, రిలీజ్ ఎప్పుడు అంటే.?