Bollywood: అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ బాలీవుడ్ లో సత్తా చాటారు అంటే, కచ్చితంగా పాన్ ఇండియా హీరోలుగా, హీరోయిన్లుగా, డైరెక్టర్లుగా చలామణి అయిపోవచ్చు అనేది ఒక నమ్మకం. అందుకే చాలామంది సౌత్ లో భారీ పాపులారిటీ అందుకున్న తర్వాత తమ దృష్టి మొత్తం బాలీవుడ్ పైనే పెడుతున్నారు. అందులో భాగంగానే దిగ్గజ దర్శకులుగా గుర్తింపు తెచ్చుకుంటూ.. ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందివ్వడమే కాకుండా హీరోల ఖాతాల్లో భారీ బ్లాక్ బస్టర్ విజయాలను చేరవేస్తున్న డైరెక్టర్లు.. ఇప్పుడు బాలీవుడ్ వైపు అడుగులు వేస్తున్నారు. ఇక అందులో భాగంగానే తాజాగా కోలీవుడ్లో భారీ పాపులారిటీ దక్కించుకున్న ఏకంగా 5 మంది తమిళ దర్శకులు ఇప్పుడు బాలీవుడ్ లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. మరి ఆ దర్శకులు ఎవరెవరో ఇప్పుడు చూద్దాం.
కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రతిభావంతులైన దర్శకులుగా పేరు దక్కించుకున్న ప్రభుదేవా (Prabhudeva), ఏ ఆర్ మురుగదాస్ (AR.Muragadas), విష్ణువర్ధన్ (Vishnuvardan) వంటి దర్శకులు బాలీవుడ్ లో కూడా తమ ప్రతిభను చూపించారు. ఇప్పుడు మరో 5 మంది కోలీవుడ్ దర్శకులు బాలీవుడ్ లో చిత్రాలను తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నారు.
అట్లీ..
‘జవాన్’ సినిమాతో బాలీవుడ్లోకి అడుగుపెట్టిన అట్లీ (Atlee) ప్రస్తుతం బాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్గా మారిపోయారు. ఆయన మొదటి సినిమాతోనే ఏకంగా రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. ఇప్పుడు సల్మాన్ ఖాన్ (Salman Khan) హీరోగా నటిస్తున్న చిత్రానికి దర్శకుడిగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ప్రారంభ దశలో ఉంది.
రాజ్ కుమార్ పెరియసామి..
దివంగత మేజర్ ముకుంద్ వరదరాజన్ (Mukundh varadarajan) జీవిత కథ ఆధారంగా శివ కార్తికేయన్(Siva Karthikeyan), సాయి పల్లవి(Sai Pallavi) కాంబినేషన్లో వచ్చిన చిత్రం ‘అమరన్’. ఈ సినిమాకి దర్శకత్వం వహించి, నేషనల్ గుర్తింపు పొందారు రాజ్ కుమార్ పెరియసామి (Raj Kumar periya sami). ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.350 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. ఇక ఈ సినిమా విజయం సాధించడంతో హిందీలో ఒక సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా రాబోతోందని సమాచారం.
లోకేష్ కనగరాజు..
కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా పేరు దక్కించుకున్న లోకేష్ కనగరాజు (Lokesh kanagaraju) ప్రస్తుతం రజనీకాంత్ (Rajinikanth) తో ‘కూలీ’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా తర్వాత ఖైదీ 2, రోలెక్స్, విక్రమ్ 2 వంటి చిత్రాలను లైన్లో పెట్టిన ఈయన, ఈ సినిమాల తరువాత బాలీవుడ్ లో అమీర్ ఖాన్ (Aamir Khan) తో సినిమా చేయనున్నట్లు సమాచారం.
టీజే జ్ఞానవేల్..
సూర్య (Suriya) తో ‘జై భీమ్’ చిత్రం చేసి భారీ పేరు సొంతం చేసుకున్న టీ.జే.జ్ఞానవేల్ (TJ Gnanavel) రజనీకాంత్(Rajinikanth) తో ‘వేట్టయాన్’ సినిమా కూడా చేశారు. ఇప్పుడు బాలీవుడ్ లో ‘దోస కింగ్’ అనే సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఇది శరవణ భవన్ రాజగోపాల్ జీవిత కథ ఆధారంగా రూపొందుతోంది
అరుణ్ మాతేశ్వరన్..
తమిళంలో రాకీ, ధనుష్(Dhanush ) కెప్టెన్ మిల్లర్, సాని కాయిదం వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన అరుణ్ మాతేశ్వరన్ (Arun matheswaran) ప్రస్తుతం ఇళయరాజా (Ilearaja) జీవిత కథ ఆధారంగా ఆయన బయోపిక్ ను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా తర్వాత బాలీవుడ్ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం.