BigTV English

Ind vs Eng, 3rd T20I: బౌలింగ్ చేయనున్న టీమిండియా..అర్షదీప్ అవుట్.. షమీ ఇన్ !

Ind vs Eng, 3rd T20I: బౌలింగ్ చేయనున్న టీమిండియా..అర్షదీప్ అవుట్.. షమీ ఇన్ !

Ind vs Eng, 3rd T20I: టీమిండియా ( Team India ) వర్సెస్ ఇంగ్లాండ్  ( England ) మధ్య ఐదు టి20 సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు మ్యాచ్లు పూర్తి కాగా… ఇవాళ మూడవ టి20 మ్యాచ్ జరగనుంది. రాజ్ కోట్ వేదికగా… ఈ మూడవ టి20 మ్యాచ్ జరగనుంది. ఇవాళ సాయంత్రం 7 గంటల సమయంలో… టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య మ్యాచ్ ప్రారంభం అవుతుంది. అయితే కాసేపటికి క్రితమే టాస్ ప్రక్రియ ముగిసింది. రెండు మ్యాచ్ల తరహాలోనే మూడవ మ్యాచ్లో కూడా సూర్యకుమార్ సేన ( Surya Kumar Yadav) టాస్ గెలిచింది. ఈ తరుణంలోనే మరోసారి… మొదట బౌలింగ్ చేయాలని సూర్య కుమార్ నిర్ణయం తీసుకున్నాడు.


Also Read: U-19 T20WC: సెంచరీ చేసి చరిత్ర సృష్టించిన గొంగడి త్రిష.. టీమిండియా మరో విజయం !

దీంతో ఇంగ్లాండ్ మరోసారి మొదటి బ్యాటింగ్ చేయనుంది. ఇక టాస్ సందర్బంగా సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ…పిచ్ రిపోర్ట్ ప్రకారం మేం ముందుగా బౌలింగ్ చేస్తామన్నారు. రాజ్‌కోట్ ఎల్లప్పుడూ మంచి ట్రాక్‌గా ఉంటుంది…ఖచ్చితంగా ఇది మాకు అనుకూలిస్తుందని పేర్కొన్నారు. మేము వేరే బ్రాండ్ క్రికెట్ ఆడాలనుకుంటున్నాము, అర్ష్‌దీప్ విశ్రాంతి తీసుకుంటున్నాడు, షమీ వచ్చాడు అన్నారు. ప్రస్తుతం ఆడే పిచ్… మొదట బౌలింగ్ చేసిన వారికి అనుకూలించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఇక ఇప్పటికే రెండు మ్యాచ్ల్లో విజయం సాధించిన సూర్య కుమార్ సేన… మూడవ మ్యాచ్ లో గెలిచి సిరీస్ కైవసం తీసుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది. ఇక అటు మూడవ టి20 లో అయినా గెలిచి.. గాడిలో పడేందుకు ఇంగ్లాండ్ క్రికెటర్లు సన్నద్ధమవుతున్నారు.


ఇక దాదాపు 400 రోజుల తర్వాత టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ… అంతర్జాతీయ మ్యాచ్ కోసం రెడీ అయ్యాడు. మొదటి రెండు టీ20 లలో… మహమ్మద్ షమీ కి అవకాశం రాలేదు. దీంతో అతనికి మళ్ళీ గాయం తిరగబడిందని కొంతమంది ప్రచారం చేశారు. అయితే మ్యాచ్ పరిస్థితుల నేపథ్యంలో మహమ్మద్ షమీని పక్కకు పెట్టారట. అయితే ఇవాల్టి మ్యాచ్ చాలా కీలకంగా కానుంది. ఇందులో గెలిస్తే… సిరీస్ కైవసం చేసుకుంటుంది టీమిండియా. అందుకే కృషియల్ మ్యాచ్లో మహమ్మద్ షమీని… బరిలో దించుతున్నారు సూర్య కుమార్ యాదవ్. అయితే మహమ్మద్ షమీ… కారణంగా స్పిన్నర్లను పక్కకు పెట్టాల్సింది పోయి… హర్ష దీప్ సింగ్ ను మాత్రమే తీసేశారు. కాగా మొదటి రెండు టి20 లో గెలిచిన టీమిండియా…. 2-0 తేడాతో లీడింగ్ లో ఉంది. గత మ్యాచ్లో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ అద్భుతంగా బ్యాటింగ్ చేయడంతో ఓడిపోవాల్సిన టీమిండియా… గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఇక ఇవాళ కూడా గెలిస్తే సిరీస్ టీమిండియా కైవసం అవుతుంది.

Also Read: Kohli – Ranji: ఢిల్లీలో టైట్ సెక్యూరిటీ.. స్టేడియానికి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన విరాట్ కోహ్లీ ?

జట్లు:

భారత్ ( Team India )  (ప్లేయింగ్ XI): సంజు శాంసన్(w), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(c), ధ్రువ్ జురెల్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి

ఇంగ్లండ్ (ప్లేయింగ్ XI): ఫిలిప్ సాల్ట్, బెన్ డకెట్, జోస్ బట్లర్(సి), హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, జామీ స్మిత్(w), జామీ ఓవర్టన్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్

 

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×