Vijay thalapathy: ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి (Vijay thalapathy) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన సినిమాలతో భారీ పాపులారిటీ అందుకొని, కోట్లు కూడబెట్టిన ఈయన , ఇప్పుడు రాజకీయ రంగంలోకి ప్రవేశించబోతున్నారు. అందులో భాగంగానే తన చివరి సినిమాగా ‘దళపతి 69’ అనే వర్కింగ్ టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఇటీవల గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ సినిమాకు ‘జన నాయగన్’ అని టైటిల్ ను రివీల్ చేశారు. అంతేకాదు టైటిల్ కి తగ్గట్టుగా విజయ్ దళపతి జనాలతో సెల్ఫీ తీసుకుంటున్న పోస్టర్ని కూడా షేర్ చేయడం జరిగింది. దీంతో టైటిల్ కి, పోస్టర్ కి పూర్తి న్యాయం చేశారని విశ్లేషకులు కూడా కామెంట్లు చేశారు. ఇకపోతే ఇది విజయ్ కి చివరి సినిమా కావడం గమనార్హం. ఈ సినిమా పూర్తయిన వెంటనే ఈయన రాజకీయాల్లోకి వెళ్ళనున్నారు. ఈ సినిమా అక్టోబర్ లో విడుదలవుతుందని ప్రకటించినప్పటికీ, వచ్చే ఏడాదికి వాయిదా వేసినట్లు సమాచారం.
విజయ్ ఆస్తుల విలువ..
ఇకపోతే విజయ్ దళపతి ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.200కోట్ల వరకూ పారితోషకం తీసుకుంటున్నట్లు సమాచారం. అందులో భాగంగానే ఆయన ఆస్తి విలువ సుమారుగా రూ.600 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. ఇకపోతే ఈయన భార్య సంగీత కూడా భారీగా ఆస్తులు కలిగి ఉన్నారట. మరి ఆమెకు అంత ఆస్తి ఎలా వచ్చింది? ఆమె ఏం చేస్తుంది? అనే విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. విజయ్ దళపతి 1999 ఆగస్టు 25న సంగీత (Sangeetha)ను వివాహం చేసుకున్నారు. వీరి వివాహం జరిగి ఇప్పటికే 23 ఏళ్లకు పైగానే అవుతున్నా.. ఇప్పటికీ ఈ జంట ఎంతో మందికి ఆదర్శమని చెప్పవచ్చు. విజయ్ ప్రస్తుతం తమిళనాడులో ‘విజయకళగం’ అనే రాజకీయ పార్టీని ప్రారంభించారు. అయితే ఈ పార్టీకి సంబంధించిన ముఖ్యమైన కార్యక్రమాలలో ఆయనకు బదులుగా ఆయన భార్య సంగీత హాజరవుతున్నారు. పార్టీ ప్రారంభించడానికి ముందు ఈమె కేవలం సినిమా ఆడియో ఫంక్షన్ లో మాత్రమే పాల్గొనేవారు. కానీ ఇప్పుడు రాజకీయంగా కూడా పలు కార్యక్రమాలలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు.
సంగీత ఆస్తి విలువ..
ఈ నేపథ్యంలోనే తాజాగా సంగీత ఆస్తి విలువ వైరల్ గా మారింది. సంగీతకు దాదాపుగా రూ.400 కోట్ల ఆస్తి ఉంటుందని సమాచారం. ఇక ఆమె ఏఏ పనులు చేస్తుంది అనే విషయం తెలియదు కానీ ఈమె తండ్రి లండన్ లో వున్న కోటీశ్వరులలో ఒకరని తెలుస్తోంది. ఇక ఆ తండ్రి కారణంగానే ఈమెకు ఈ రేంజ్ లో ఆస్తి సంక్రమించినట్లు సమాచారం.
కార్ కలెక్షన్..
ఇక వీరి దగ్గర ఉండే కార్ల విషయానికి వస్తే.. కార్లను అమితంగా ఇష్టపడే విజయ్ ఆడి, బీఎండబ్ల్యూ, లెక్సస్ వంటి అనేక లగ్జరీ కార్లను కలిగి ఉన్నారు. చెన్నై నీలాంగరై లో ఈయనకు ఒక లగ్జరీ ఇల్లు ఉంది.అలాగే తిరువళ్లూర్ తిరుపోరూర్, తిరుమజిసై , వందలూర్ వంటి ప్రాంతాలలో అనేక ఆస్తులు కూడా ఉన్నట్లు సమాచారం. ఏది ఏమైనా విజయ్ భార్య కూడా భారీగా ప్రాపర్టీ కలిగి ఉండడంతో విజయ్ కి రాజకీయంగా తన పార్టీని విస్తరించడానికి ఆర్థిక ఇబ్బందులు ఉండవు అని కొంతమంది కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.