BigTV English

Suriya 44 Title : ఓ స్వచ్ఛమైన ప్రేమ కథతో వస్తున్న సూర్య… టైటిల్ ఎంటంటే..?

Suriya 44 Title : ఓ స్వచ్ఛమైన ప్రేమ కథతో వస్తున్న సూర్య… టైటిల్ ఎంటంటే..?

Suriya 44 Title : ప్రముఖ కోలీవుడ్ హీరో సూర్య (Suriya)ఇటీవలే ‘కంగువ’ సినిమాను పాన్ ఇండియాలో విడుదల చేసి ఘోర పరాభవాన్ని చవిచూశారు. సినిమా కంటెంట్ బాగున్నా.. కొంతమంది కావాలని రూమర్స్ స్ప్రెడ్ చేశారని, అందుకే సినిమా డిజాస్టర్ అయిందని సూర్య భార్య ప్రముఖ హీరోయిన్ జ్యోతిక(Jyothika) కూడా బాధపడిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా సూర్య తన 44వ చిత్రాన్ని అనౌన్స్ చేసారు. కార్తీక్ సుబ్బరాజు(Karthik Subbaraju)దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా యుద్ధం నేపథ్యంలో రాబోతోంది. ఇక నేడు క్రిస్మస్ సందర్భంగా ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేస్తూ టీజర్ ను విడుదల చేశారు. సూర్య నటిస్తున్న ఈ సినిమాకి రెట్రో(Retro) అనే ను టైటిల్ ఫిక్స్ చేశారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తి అయింది.


టీజర్ విషయానికొస్తే.. ఈ ప్రేమ యుద్ధం నేపథ్యంలో రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో ప్రముఖ బ్యూటీ పూజా హెగ్డే (Pooja hegde) హీరోయిన్ గా నటిస్తోంది. టీజర్ లో సూర్య..”నాది స్వచ్ఛమైన ప్రేమ” అనే డైలాగ్ చెప్పడంతో ప్రారంభం అవుతుంది. టీజర్ చాలా ఇంట్రెస్టింగ్ గా సాగింది అని చెప్పవచ్చు.ఈ సినిమాలో ప్యూర్ లవ్ స్టోరీని చూపించబోతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి అయితే సూర్య ఈ సినిమాతో ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ విజయం అందుకునేలా కనిపిస్తోందని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.

రెట్రో సినిమా కాస్ట్ & క్రూ..


సూర్య హీరోగా, పూజాహెగ్డే హీరోయిన్గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజు(Karthik Subbaraju) దర్శకత్వం వహిస్తున్నారు. జయరాం, జోజు జార్జ్, కరుణాకరన్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. 2D ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై జ్యోతిక, సూర్య కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ సంగీతం అందిస్తూ ఉండగా. ప్రస్తుతం ఈ సినిమా కూడా పాన్ ఇండియా భాషల్లో విడుదలవడానికి సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్లో రిలీజ్ చేయడానికి చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నారు.

సూర్య సినిమాలు..

కోలీవుడ్ హీరోగా స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్న సూర్య తన సినిమాలను తెలుగులో కూడా విడుదల చేస్తూ.. తెలుగు బాక్సాఫీస్ వద్ద మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్నారు. ఇక ఇప్పుడు పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తున్న నేపథ్యంలో తన ప్రతి సినిమాని కూడా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేస్తూ భారీ పాపులారిటీ అందుకున్నారు. సూర్య అసలు పేరు శర్వానంద్ శివకుమార్. భారతీయ నటుడిగా, నిర్మాతగా, హోస్ట్ గా కూడా మంచి పేరు దక్కించుకున్నారు. తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన సూర్య..సినీ కెరీయర్లో తమిళనాడు స్టేట్ ఫిలిం అవార్డుతో పాటు నాలుగు ఫిలింఫేర్ అవార్డ్స్, రెండు ఎడిషన్ అవార్డులు కూడా అందుకున్నారు. సెలబ్రిటీల సంపాదన ఆధారంగా తయారుచేసిన ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీ 100 జాబితాలో ఏకంగా ఆరుసార్లు స్థానం దక్కించుకున్నారు. ఇక ఈయన భార్య జ్యోతిక ఒకవైపు లేడీ ఓరియంటెడ్ చిత్రాలు చేస్తూనే.. మరొకవైపు నిర్మాతగా కూడా తన భర్త తో సినిమాలను నిర్మిస్తోంది. ఇక వివాదాలకు పోకుండా తమ పని తాము చేసుకునే జంటలలో వీరు కూడా ఒకటి అని చెప్పవచ్చు.

Related News

Divvala Madhuri: ఆ రికార్డింగ్ డ్యాన్స్ వీడియోపై స్పందించిన దివ్వెల మాధురి.. రూ.కోటి మీదే!

Venuswamy : అమ్మ బాబోయ్.. వేణు స్వామి దగ్గరకు అమ్మాయిలు అందుకోసమే వస్తారా..?

Poster Talk Septmber : ఆగస్టు ఆగం అయింది… మరి సెప్టెంబర్ సేవ్ చేస్తుందా ?

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Kissik Talks Show : డైరెక్టర్స్ చేస్తుంది తప్పు.. ఆ పద్ధతి మార్చుకోండి.. గీతా సింగ్ సంచలన కామెంట్స్..

Kissik Talks Show : నటి గీతా సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

SivaJyothi: గుడ్ న్యూస్ చెప్పబోతున్న శివ జ్యోతి… బుల్లి సావిత్రి రాబోతోందా?

Movie Industry : ఇండస్ట్రీలో ఇవి మారాల్సిందే… లేకపోతే దుకాణం క్లోజ్ ?

Big Stories

×