E-Paper
Advertisement

Kota Srinivasarao: దయచేసి నన్ను చంపొద్దు.. చెతులెత్తి వేడుకున్న కోట..

Kota Srinivasarao: దయచేసి నన్ను చంపొద్దు.. చెతులెత్తి వేడుకున్న కోట..
Advertisement

Kota Srinivasarao: పాపం కోట శ్రీనివాసరావు. ఆయన ఆరోగ్యంపై పదే పదే పుకార్లు రేపుతున్నారు కొందరు దుర్మార్గులు. ఆరోగ్యంగా ఉన్నా కూడా.. హెల్త్ కండిషన్ క్రిటికల్ అంటూ.. చనిపోయారంటూ.. తప్పుడు వార్తలు రాస్తున్నారు కొందరు. పనిగట్టుకుని మరీ ఇలాంటి వారితో ఆడుకుంటున్నారు.

కోటా శ్రీనివాసరావు, చంద్రమోహన్.. ఇలా కాస్త వయసు మళ్లిన వారిపై రెగ్యులర్‌గా ఇలాంటి చెత్త న్యూస్ వైరల్ చేస్తున్నారు శాడిస్టులు. యూట్యూబ్ వ్యూస్ కోసం.. వెబ్‌సైట్ హిట్స్ కోసం.. సోషల్ మీడియా లైకుల కోసం.. బతికుండగానే సెలబ్రిటీల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఈ పాపిస్టి ధోరణి ఈమధ్య మరీ పెరిగిపోతోంది.

Advertisement

లేటెస్ట్‌గా, కోట శ్రీనివాసరావు చనిపోయారంటూ సోషల్ మీడియాలో కొందరు ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన వయస్సు 75 ఏళ్లు. పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. బిందాస్‌గా ఇంకో పదేళ్లు బతికేస్తారు. కొడుకు పోయిన బాధ ఒక్కటే ఆయనకు లోటు. అలాంటిది.. కోటను కొందరు పదే పదే టార్గెట్ చేస్తూ సైకోల్లా బిహేవ్ చేస్తున్నారు.

తాను మృతిచెందినట్లు సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై కోట శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని.. ఆ వదంతులను నమ్మొద్దని వివరణ ఇచ్చారు. దయచేసి తనను చంపొద్దని.. మనిషి ప్రాణాలతో ఆడుకోవద్దని.. చేతులెత్తి వేడుకున్నారు. తప్పుడు ప్రచారం చేస్తున్నవారికి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పాలని కోట శ్రీనివాసరావు కోరారు. ఆ మేరకు ఓ వీడియోను రిలీజ్ చేశారు.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×