JACK Movie Review: ‘టిల్లు స్క్వేర్’ తో రూ.100 కోట్లు కొట్టిన సిద్ధు జొన్నలగడ్డ, ‘బేబీ’ తో రూ.100 కోట్లు కొట్టిన వైష్ణవి చైతన్య, ‘విరూపాక్ష’ తో రూ.100 కోట్లు కొట్టిన నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘జాక్’. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ప్రేక్షకులను ఈ సినిమా ఎంత వరకు ఆకట్టుకుందో ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం రండి..
కథ..
పాబ్లో నెరుడా అలియాస్ జాక్ (సిద్ధు జొన్నలగడ్డ) చాలా పనులు చేయాలనుకుంటాడు. సమర్థుడు అనుకుంటాడు. అయితే అతను ఎక్కువగా స్పై అవ్వాలని కలలు కంటూ ఉంటాడు. ఇందుకోసం ఇంటర్వ్యూ కూడా ఇస్తాడు. రిజల్ట్ వచ్చేలోపే దేశభక్తితో.. ఆఫ్లైన్ లో స్పై ఆపరేషన్స్ చేస్తూ ఉంటాడు. మరోపక్క అతని తండ్రి(నరేష్) కొడుకుని మంచి ఉద్యోగంలో చూడాలి అనుకుంటాడు. కానీ స్టడీస్లో టాపర్ అయ్యుండి కూడా.. ఏ ఉద్యోగం చేయకుండా అతను చేసే పనులు చూసి టెన్షన్ పడుతూ ఉంటాడు. దీంతో జాక్ లవర్ భానుమతి అలియాస్ ఆఫ్సాన్ (వైష్ణవి చైతన్య) అతను ఏం చేస్తాడా? అని కనిపెట్టాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. అయితే జాక్ చేసే పనుల వల్ల రా చీఫ్ మనోజ్ (ప్రకాష్ రాజ్) కి వచ్చిన ఇబ్బందులు ఏంటి? తర్వాత జాక్ లైఫ్లో ఎలాంటి సమస్యలు వచ్చి పడ్డాయి? అసలు జాక్ అండ్ మనోజ్..లు ఎవరి కోసం సీక్రెట్ ఆపరేషన్లు చేస్తున్నారు? వంటి ప్రశ్నలకి సమాధానమే మిగిలిన సినిమా.
విశ్లేషణ..
దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ సినిమా అనగానే యూత్ కానీ ఫ్యామిలీ ఆడియన్స్ కానీ ఇంట్రెస్ట్ చూపిస్తారు. వాళ్లకి నచ్చే అలాగే ఆలోచింప చేసే ఎలిమెంట్స్ ఇతని సినిమాల్లో ఉంటాయి అనేది వాళ్ళ నమ్మకం. అదే భాస్కర్ బలం కూడా..! అయితే ఈసారి అతని బలాన్ని వదిలేసి ఓ స్పై యాక్షన్ జోనర్ ని ఎంపిక చేసుకున్నాడు. తప్పేమీ లేదు దర్శకుడు అన్నాక అన్ని జోనర్లని ట్రై చేయాలి. ఏ దర్శకుడితో ఎలాంటి విషయం ఉందో వెంటనే అంచనా వేయలేం కదా. ‘సార్’ సినిమా వచ్చే వరకు వెంకీ అట్లూరి ప్రేమ కథలు మాత్రమే తీయగలడేమో అని అంతా అనుకున్నారు. కానీ అతనిలో అంత టాలెంట్ ఉందని ఆ సినిమా వచ్చాకే కథ ప్రూవ్ అయ్యింది. అలాగే సంపత్ నంది కూడా. అతని మొదటి సినిమా లవ్ స్టోరీ. కానీ రెండో సినిమా రాంచరణ్ తో మాస్ ప్రయత్నం చేశాడు. సక్సెస్ అయ్యాడు. సో భాస్కర్ కూడా అలాగే సక్సెస్ అవుతాడేమో అని అంతా అనుకున్నారు. కానీ కట్ చేస్తే.. ఈ యాక్షన్ స్పై డ్రామాని అతను సరిగ్గా హ్యాండిల్ చేయలేదు. ఈ విషయం ట్రైలర్ తోనే చాలా మందికి కొంత క్లారిటీ వచ్చింది.
ఇక సినిమా స్టార్ట్ అయిన మొదటి 20 నిమిషాలకి మిగిలిన క్లారిటీ కూడా వచ్చేస్తుంది. సిద్ధు జొన్నల గడ్డ మార్క్ కామెడీ, నరేష్ తో వచ్చే సన్నివేశాలు తప్ప మిగిలిన అన్ని సీన్లు చాలా పేలవంగా ఉంటాయి. ఒక సీన్ నుండి ఇంకో సీన్ వచ్చే లోపు.. డిజాస్టర్ స్టేటస్ రేషియో పెరుగుతూనే ఉన్న ఫీలింగ్ అందరికీ కలుగుతుంది. ఏదేమైనా ఫస్ట్ హాఫ్ కొంతలో కొంత ఓకే. కానీ సెకండాఫ్ అయితే భరించడం చాలా కష్టం. క్లైమాక్స్ పూర్తవ్వకముందే ఆడియన్స్ బయటకి వెళ్లిపోయే పరిస్థితి. దర్శకుడిగా, కథకుడిగా బొమ్మరిల్లు భాస్కర్ మార్క్ ఏమాత్రం కనపడని సినిమా ఇది. సామ్ సి ఎస్ నేపధ్య సంగీతం, మిగిలిన సంగీత దర్శకులు కంపోజ్ చేసిన పాటలు కూడా బోర్ కొట్టిస్తాయి. విజయ్ కె.చక్రవర్తి సినిమాటోగ్రఫీ కూడా తేలిపోయింది.
నటీనటుల విషయానికి వస్తే.. సిద్ధు తన మార్క్ నటనతో కొంతవరకు ఎంగేజ్ చేయగలిగాడు. కానీ సినిమాలో విషయం లేనప్పుడు అతను మాత్రం ఎంతవరకు ఆడియన్స్ ని థియేటర్లలో కూర్చోబెట్టగలడు. వైష్ణవి చైతన్య లుక్స్ తో తప్ప నటనతో మెరుపులు మెరిపించింది ఏమీ లేదు. అసలు ఈ సినిమాలో హీరోయిన్ అవసరం లేదు కూడా..! ఏదో ఆమెకు కొంత ఇమేజ్ ఉంది కదా అని తీసుకున్నట్టు ఉన్నారు. ప్రకాష్ రాజ్ నటన కూడా ఓవర్ గా అనిపించిన సినిమా ఇది. నరేష్ ని కూడా సరిగ్గా వాడలేదు. మిగిలిన నటీనటులు ఎంతకంతే..!
ప్లస్ పాయింట్స్..
సిద్ధు జొన్నలగడ్డ
ఫస్ట్ హాఫ్ (కొంతవరకు)
మైనస్ పాయింట్స్..
స్క్రీన్ ప్లే
డైరెక్షన్
సెకండాఫ్
మ్యూజిక్
మొత్తంగా ‘జాక్’ … క్యాప్షన్ కి తగ్గట్టే ఓ క్రాక్ సినిమా. ‘ఒంగోలు గిత్త’ బొమ్మరిల్లు భాస్కర్ కెరీర్లో పెద్ద డిజాస్టర్ అని ఇప్పటివరకు చెప్పుకునేవారు. అదే నిర్మాతకి ‘జాక్’ తో అంతకు మించిన డిజాస్టర్ ఇచ్చి ‘ఒంగోలు గిత్త’ కల్ట్ క్లాసిక్ అనిపించాడు బొమ్మరిల్లు భాస్కర్.
JACK Telugu Movie Rating – 1 / 5