Krishna Vamsi : ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ (Krishna Vamsi) తాజాగా సోషల్ మీడియా వేదికగా అభిమానికి క్షమాపణలు చెప్పారు. సదరు నెటిజన్ “భక్తి సినిమాల్లో అలాంటి సీన్స్ ఏంటి? అంటూ సూటిగా ఆయనను ప్రశ్నించారు. దీంతో కృష్ణవంశీ ఎలాంటి వాదన లేకుండానే తప్పైందని ఒప్పుకున్నారు. దీంతో తాజాగా ఆయన చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.
అసలు ఏం జరిగింది అంటే?
ఇటీవల కాలంలో కృష్ణవంశీ (Krishna Vamsi) దర్శకత్వంలో రూపొందిన ‘శ్రీ ఆంజనేయం’ (Sri Anjaneyam) మూవీపై తరచుగా చర్చ జరుగుతోంది. కొన్ని రోజుల క్రితం ‘హనుమాన్’ మూవీతో ‘శ్రీ ఆంజనేయం’ మూవీని పోలుస్తూ టోల్స్ చేశారు. ఇక ఇప్పుడేమో ‘శ్రీ ఆంజనేయం’ మూవీలో అలాంటి సీన్స్ ఎందుకు? అని డైరెక్ట్ గా డైరెక్టర్ని ప్రశ్నించారు. ఓ నెటిజన్స్ “శ్రీ ఆంజనేయం లాంటి భక్తి సినిమాలో ఛార్మిని ఎందుకు అలా చూపించారు సార్?” అని ప్రశ్నిస్తూ డైరెక్టర్ కృష్ణవంశీని ట్యాగ్ చేశారు.
వెంటనే కృష్ణవంశీ (Krishna Vamsi) స్పందిస్తూ “తప్పేనండి… క్షమించండి… డెస్పరేట్ టైమ్స్, డెస్పరేట్ మెజర్స్, డెస్పరేట్స్ డీడ్స్” అంటూ చేతులు జోడించి ఉన్న ఎమోజిని పోస్ట్ చేశారు. దీంతో కృష్ణ వంశీ రియాక్షన్ పై ఆయన అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మీరు చాలా హంబుల్ గా ఉంటారు. మీ సినిమాలు ఎప్పటికీ ఎవర్గ్రీన్” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
అంతేకాకుండా ఆ సీన్స్ లేకుంటే ‘శ్రీ ఆంజనేయం’ ఒక సూపర్ హిట్ మూవీ అయ్యేదని, ‘అమ్మోరు’లాంటి ఆల్ టైం డివోషనల్ క్లాసిక్ గా కూడా ఉండేదని అంటున్నారు. అప్పట్లోనే వీఎఫ్ఎక్స్ అద్భుతంగా చేశారు. కానీ చార్మి హాట్ సీన్స్ కారణంగా దెబ్బ పడింది అని కామెంట్స్ చేస్తున్నారు. 200 డేస్ ఆడే సినిమా కంటెంట్ ఇది” అంటూ అప్పుడెప్పుడో వచ్చిన సినిమా గురించి ఇప్పుడు డిస్కషన్ మొదలుపెట్టారు.
‘హనుమాన్’తో ‘శ్రీ ఆంజనేయం’కి పోలిక
ఇక ‘హనుమాన్’ (Hanuman) మూవీ రిలీజ్ టైంలో కూడా ఈ మూవీ కంటే ‘శ్రీ ఆంజనేయం’ (Sri Anjaneyam) బాగుందని కామెంట్స్ వినిపించాయి. అయితే అప్పట్లో ఆ కామెంట్స్ పై కృష్ణవంశీ స్పందిస్తూ “శ్రీ ఆంజనేయం మూవీ ఆడియన్స్ కి నచ్చలేదంటే సినిమాలోనే ఏదో తప్పు ఉందని అర్థం. దానికి ఆడియన్స్ ని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు. వాళ్ళు ఎప్పుడూ కరెక్ట్ గానే ఉంటారు” అంటూ కృష్ణవంశీ సమాధానం చెప్పారు.
2004లో వచ్చిన సినిమా గురించి డిస్కషన్
నితిన్, ఛార్మి హీరో హీరోయిన్లుగా నటించిన ‘శ్రీ ఆంజనేయం’ మూవీ 2004లో రిలీజ్ అయింది. ఈ మూవీకి దర్శకత్వం వహిస్తూనే, నిర్మాతగా కూడా వ్యవహరించారు కృష్ణవంశీ. సీనియర్ హీరో అర్జున్ ఈ మూవీలో హనుమంతుడిగా నటించారు. అప్పట్లోనే 10 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీ, హీరో హీరోయిన్ల లవ్ ట్రాక్ కారణంగా డిజాస్టర్ అనే టాక్ తెచ్చుకుంది. అయితే అప్పుడెప్పుడో వచ్చిన ఈ మూవీ గురించి ఇప్పటికీ చర్చ నడుస్తుండడం గమనార్హం.
Thappenandi…. Apologies.. desperate times desperate measures desperate deeds 🙏🙏 https://t.co/61ZzByYkaz
— Krishna Vamsi (@director_kv) February 3, 2025