BigTV English

Kriti Kharbanda: పెళ్లికి ముందు జరగాల్సింది.. పెళ్లి తర్వాత జరిగిందేంటి.. ఇదేదో తేడాగా ఉందే..

Kriti Kharbanda: పెళ్లికి ముందు జరగాల్సింది.. పెళ్లి తర్వాత జరిగిందేంటి.. ఇదేదో తేడాగా ఉందే..
Kriti Kharbanda Haldi Ceremony
Kriti Kharbanda Haldi Ceremony

Kriti Kharbanda Haldi Ceremony Pics: ఢిల్లీ ముద్దుగుమ్మ కృతి ఖర్బంద గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. తెలుగులో అక్కినేని సుమంత్‌ హీరోగా నటించిన ‘బోణీ’ మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత డైరెక్ట్‌గా పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో నటించే ఛాన్స్ కొట్టేసింది. ‘తీన్మార్’ మూవీలో పవన్ కల్యాణ్‌కి జోడీగా నటించింది. ఆ తర్వాత ఒంగోలు గిత్త, మిస్టర్ నూకయ్య, ఓం త్రీడి, బ్రూస్‌ లీ వంటి సినిమాలలో నటించింది.


ఈ మూవీలలో తన అందం, నటనతో అందరినీ కట్టిపడేసింది. ఇందులో నటించినందుకు గానూ అద్భుతమైన క్రేజ్ అందుకుంది. అయితే ఆ తర్వాత టాలీవుడ్‌కి దూరమైన ఈ అమ్మడు.. బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అక్కడ కొన్ని చిత్రాల్లో నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది.

అయితే అదే సమయంలో నటుడు పుల్కిత్ సామ్రాట్‌తో ప్రేమలో పడింది ఈ ఢిల్లీ భామ. అప్పట్నుంచి ఏదో ఒక రూపంలో వీరికి సంబంధించిన వార్తలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. అయితే ఆ వార్తలపై ఈ జంట ఎప్పుడు నోరు విప్పలేదు.


Also Read: కామెడీ పాఠాలు చెప్పడానికి ఓటీటీలోకి ‘సుందరం మాస్టర్’ వచ్చేస్తున్నాడు.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే

కాగా అప్పుడప్పుడు ఈ జంట బయట కెమెరాలకు చిక్కుతూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండేవారు. దీంతో వీరి ప్రేమాయణం నిజమేనని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఆ వార్తలను నిజం చేస్తూ కృతి ఖర్బంద, పుల్కిత్ సామ్రాట్ పెళ్లి చేసుకున్నారు.

ఈ నెల అంటే మార్చి 15న ఈ జంట పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. దీంతో నెట్టింట వైరల్ అయిన వార్తలకు ఒక్కసారిగా చెక్ పెట్టినట్టయింది. అందుకు సంబంధించిన ఫొటోలు కొద్ది రోజుల తర్వాత సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో సినీ అభిమానులు, సెలబ్రెటీలు ఈ జంటకు శుభాకాంక్షలు తెలిపారు.

అయితే తాజాగా ఈ జంట తమ మరో వేడుకకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఎవరైనా పెళ్లికి ముందు హల్దీ వేడుకను జరుపుకుంటారు. కానీ ఈ బ్యూటీఫుల్ కపుల్ మాత్రం పెళ్లైన తర్వాత హల్దీ వేడుకను ఘనంగా జరుపుకున్నారు.

Also Read: పవన్ కల్యాణ్ ‘ఓజీ’ నుంచి క్రేజీ అప్డేట్.. విలన్ ఫస్ట్ లుక్ మామూలుగా లేదు భయ్యా

అయితే అదికూడా వెరైటీగా ఉండాలని.. ముల్తానీ మట్టితో ప్లాన్ చేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అందులో కృతి ఖర్బంద, పుల్కిత్ సామ్రాట్ ఒకరినొకరు ముద్దులు పెట్టుకుని ముల్తానీ మట్టితో ఉండటం చూడవచ్చు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి.

కాగా పుల్కిత్ సామ్రాట్‌కు ఇంతకుముందు వేరే అమ్మాయి శ్వేతా రోహిరాతో మ్యారేజ్ అయిన విషయం తెలిసిందే. ఈ జంట పెళ్లై ఏడాది కూడా పూర్తికాకుండానే విడిపోయారు. ఆ తర్వాత కృతి- పుల్కిత్ జీవితంలోకి వచ్చింది.

Tags

Related News

Free Pickle Offer: ఈ ఛాలెంజ్ క్లియర్ చేస్తే పికిల్ ప్యాకెట్ ఫ్రీ… పచ్చళ్ళ అక్క బంపర్ ఆఫర్?

Deepthi Sunaina: బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టిన షణ్ముఖ్ మాజీ లవర్.. సక్సెస్ రేటెంత?

YouTuber Armaan Malik: ఇద్దరు భార్యలు.. నలుగురు పిల్లలు.. ఆ యూట్యూబర్‌కు కోర్టు నోటీసులు

Kissik talks show : యాంకర్ సౌమ్య జీవితంలో అన్నీ కష్టాలే.. ఆ హీరో టార్చర్ తో కన్నీళ్లు..

Big TV Kissik Talks : ఇండస్ట్రీలో హార్డ్ వర్క్ పనికిరాదు, చాలామంది ఆ పని చేసి వచ్చారు

Big TV Kissik Talks : ఆ హీరోయిన్ కారుతో గుద్దింది, నేను చాలా పోగొట్టుకున్నాను 

Big Stories

×