Kriti Kharbanda: ..కృతి కర్బందా (Kriti kharbanda).. ఈమె గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.. ‘బోనీ’ సినిమాతో ఇండస్ట్రీకి వచ్చిన ఈమె.. తెలుగులో ‘మిస్టర్ నూకయ్య’ సినిమాతో పరిచయమైంది. ఆ తర్వాత రామ్(Ram ) హీరోగా నటించిన ‘ఒంగోలు గిత్త’ సినిమాతో అందరికీ దగ్గరైన ఈమె.. ఆ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా నటించిన ‘బ్రూస్లీ’సినిమాలో రామ్ చరణ్ కి అక్కగా నటించి మరోసారి మెప్పించింది. ఇక ప్రస్తుతం తెలుగులో తక్కువగానే సినిమాలు చేస్తున్న ఈమె.. బాలీవుడ్ లో మాత్రం వరుస అవకాశాలు అందుకుంటూ బిజీగా మారిపోయింది. గత కొంతకాలం క్రితం నా సగ జీవితాన్ని సినిమాకే కేటాయించానని చెప్పిన ఈమె, గత ఏడాది వివాహం చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే వివాహం తర్వాత కొంతకాలం ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈమె ఇప్పుడు ‘హౌస్ ఫుల్ -5’ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ..ఈ క్రమంలోనే తాజాగా తన ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక షాకింగ్ పోస్ట్ పెట్టింది.
రెండు భావాల మధ్య చిక్కుకున్నాను – కృతికర్బందా
ఇక అందులో ఇలాంటి ఒకరోజు వస్తుందని ఊహించలేదు అంటూ చేసిన ఈ పోస్టు అందరిలో సరికొత్త అనుమానాలు క్రియేట్ చేస్తున్నాయని చెప్పవచ్చు. కృతి తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా.. “నేను ఈరోజు రెండు భావాల మధ్య ఇరుక్కున్నాను. రెండింటిని అనుభవిస్తున్నాను. నా తోబుట్టువులతో ఒక సంభాషణ మమ్మల్ని జ్ఞాపక శక్తికి దారితీసింది. నవ్వులు, విరామం తర్వాత నేను ఊహించని దానికంటే నన్ను బలంగా తాకింది. చిన్నతనంలో ఏమీ తెలియని అమ్మాయిలా గడిపాను. మహమ్మారితో జీవిస్తానని ఎప్పుడూ ఊహించలేద. ఇక పెద్దయ్యాక ప్రపంచాన్ని కొంచెం మెరుగ్గా అర్థం చేసుకున్నాను. ఇప్పుడు కూడా అర్థం చేసుకుంటున్నాను.
మీరు కూడా ఇలాగే బాధపడుతున్నారా..?
ప్రస్తుతం సంక్షోభంలో నివసిస్తున్న ప్రజల గురించి నేను ఆలోచిస్తున్నాను. వాళ్ళు ఎప్పుడైనా ఇలా ఊహించారా..? ముందుకు సాగడానికి, రక్షించడానికి, పోరాడడానికి, దుఃఖించడానికి, ఇంకా ఆశించడానికి వారికి బలం ఎక్కడ దొరుకుతుంది..? అని , నా దేశం కోసం పోరాడడం అంటే ఏమిటో నాకు ఎప్పటినుంచో తెలుసు.. కానీ ఈరోజు నేను గ్రహించింది ఏంటంటే.. దానికి ఏది అవసరమో నేను ఎప్పటికీ అర్థం చేసుకోలేనని.. ఇప్పటికే నాలో ఎన్నో ప్రశ్నలు నడుస్తున్నాయి. అందులో కొన్ని ప్రశ్నలకు సమాధానాలు లేవు. నేను మాత్రమే ఇలాంటి సంఘర్షణను ఎదుర్కొంటున్నానా..? ఇది భయమా ? అయితే భయపడాలా? లేదా ఇతరులు కూడా ఇలాంటి సంక్షోభంలోనే ఇరుక్కున్నారా? వారి కుటుంబాలతో కూర్చొని నిశ్శబ్దంగా అదే ఆశ్చర్యపోతున్నారేమో.. ? మీరు అలాంటి వారిలో ఒకరైతే మీరు తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. మీరు ఒంటరిగా లేరు.. అన్నింటిని ఒకేసారి అనుభూతి చెందడం సరైనది కాదు.. కాబట్టి ఏదైనా ఇలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు నేను నా తోబుట్టులతో ఎలా అయితే కూర్చొని నా సమస్యకు పరిష్కారం వెతుకుతున్నానో.. మీరు కూడా మీ వారితో కలిసి మీ సమస్యలకు పరిష్కారం కనుక్కోండి” అంటూ ఒక పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం ఈమె చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.