Kubera Business : తమిళ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘కుబేర’.. ధనుష్ తో పాటుగా ఈ మూవీలో టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున కూడా నటిస్తున్నారు. తెలుగు స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఫిమేల్ లీడ్ రోల్ చేస్తున్నారు.. ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. నాగార్జున ఇటీవల డబ్బింగ్ కంప్లీట్ చేశారు. త్వరలో అన్ని పనులు పూర్తి చేసి.. జూన్ 20న మూవీని గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల చేయనున్నారు మేకర్స్.. అయితే గత కొద్దిరోజులుగా ఈ మూవీ బిజినెస్ పై వార్తలు వినిపిస్తున్నాయి. ఆంధ్రా రికార్డ్ బ్రేక్ చేసేలా బిజినెస్ జరిగిందని టాక్.. మరి ఎన్నికోట్లు జరిగిందో ఒకసారి తెలుసుకుందాం..
‘కుబేర’ బిజినెస్ డీటెయిల్స్..
ధనుష్, నాగార్జున ప్రధాన పాత్రలో నటిస్తున్న మూవీ కుబేర.. ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ పై స్పెషల్ ఫోకస్ చేశారు. అయితే ఆంధ్రా హక్కులను రూ.18 కోట్ల కు మేకర్స్ కోట్ చేసినట్లు తెలుస్తోంది. గతంలో ఏ మూవీకి లేని రికార్డ్ బ్రేక్ చేసింది. ఈ రేంజులో బిజినెస్ జరగడం మామూలు విషయం కాదు. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం బిజినెస్ దాదాపు రూ.40 కోట్ల కు చేరుకోవచ్చని ట్రేడ్ పంతులు అంచనా వేస్తున్నారు. తెలుగు లో ఈ మాత్రం బిజినెస్ జరగడం మామూలు విషయం కాదు. ఇంతగా బిజినెస్ జరగడానికి కారణం నాగార్జున అని తెలిసిందే. తెలుగులో కుబేరా నెవ్వర్ బిఫోర్ బిజినెస్ చేయనున్నట్లు అర్థమవుతుంది. కొత్త రికార్డులు క్రియేట్ అవ్వనున్నట్లు తెలుస్తోంది.. మరి కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి..
కుబేర మూవీ..
ఈ మధ్య ధనుష్ బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. డైరెక్టర్ గా, నిర్మాతగా కూడా పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. కుబేర మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. మూవీని శేఖర్ కమ్ముల అద్భుతంగా తీర్చిదిద్దారని టాక్ వినిపిస్తోంది. మేకర్స్ రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ కూడా మంచి రెస్పాన్స్ అందుకుంది. పలు సాంగ్స్ టాప్ ట్రెండింగ్ లో ఉన్నాయి.. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యం లో మేకర్స్ ప్రమోషన్స్ పై ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది.. కుబేర పై భారీ అంచనాలే ఉన్నాయి. మరి జూన్ 20న థియేటర్ల లో కి రాబోతున్న ఈ మూవీ ఎలాంటి రికార్డుల ను బ్రేక్ చేస్తుందో చూడాలి.. కుబేర పై నాగార్జున ఆశలు పెట్టుకున్నారు. మరి ఎలాంటి రికార్డులను బ్రేక్ చేస్తుందో.. ఈ మధ్య నా సామిరంగా మూవీ మంచి విజయాన్ని అందించింది.. మరి కుబేర సక్సెస్ అయితే ఆయన ట్రాక్ రికార్డ్ మారుతుందని నాగ్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.