BigTV English

OTT Movie : భారీ సంఖ్యలో చిన్న పిల్లలు మిస్సింగ్… ముక్కలు ముక్కలుగా నరికి… IMDbలో 7.1 రేటింగ్ ఉన్న ఈ మూవీని చూశారా ?

OTT Movie : భారీ సంఖ్యలో చిన్న పిల్లలు మిస్సింగ్… ముక్కలు ముక్కలుగా నరికి… IMDbలో 7.1 రేటింగ్ ఉన్న ఈ మూవీని చూశారా ?

OTT Movie : ఢిల్లీలోని ఒక స్లమ్‌ ఏరియాలో చిన్న పిల్లలు ఒక్కొక్కరుగా అదృశ్యమవుతారు. ఒకరోజు రాత్రి ఓ పోలీసు అధికారి ఒక చిన్న పిల్లాడి అరుపులను వింటాడు. కానీ అతను అరుపులు విన్పించిన ప్రాంతానికి చేరుకునే సరికి ఆ బాలుడు మిస్ అవుతాడు. ఈ అపహరణల వెనుక ఒక సైకోపాథ్ ఉన్నాడని తెలుస్తుంది. అతను ఎవరు? అతని ఉద్దేశం ఏమిటి? అనేది తెలియాలంటే ఈ మూవీ పేరేంటి? ఎక్కడ చూడవచ్చు అనే వివరాలను ముందుగా తెలుసుకోవాలి.


కథలోకి వెళ్తే…

ఎస్ఐ రామ్ చరణ్ పాండే (దీపక్ దోబ్రియాల్) ఒక అవినీతి పోలీసు అధికారి. సెక్టార్ 36 అనే స్లమ్‌ ఏరియాలో తరచుగా చిన్న పిల్లలు మిస్ అవుతారు. ఈ కేసులన్నీ పాండే దగ్గరకే వస్తాయి. ముఖ్యంగా మిస్ అయిన పిల్లల తల్లిదండ్రులు పాండేను తమ పిల్లలను కాపాడమని వేడుకుంటారు. కానీ ఆయన పెద్దగా పట్టించుకొడు. ఈ నేపథ్యంలోనే మిస్సింగ్ కేసులు ఎక్కువ అవుతాయి. ఒక రోజు మురికి కాలువలో ఒక కుళ్ళిన మనిషి చేయి కనిపిస్తుంది. రామ్ చరణ్ దానిని జంతువు చేయి అని కొట్టిపారేసి, ఆ చేయిని కనిపెట్టిన బాలుడికి కొంత డబ్బు ఇస్తాడు. .


ఈ క్రమంలోనే ఎస్ఐ ఆ మిస్సింగ్ కేసులపై దృష్టి పెడతాడు. అయితే అంతలోనే ఓ పండగలో భాగంగా కుటుంబ సభ్యులు అందరూ ఉండగానే ఎస్ఐ గారాల పట్టిని కిడ్నాప్ చేస్తారు. కానీ ఆయన తన పాపను కాపాడుకుంటాడు. ఇంకేముంది ఈ మిస్సింగ్ కేసులు అన్ని నిజమేనని గ్రహించి, పైనున్న అధికారులు తనను తప్పుదారి పట్టిస్తున్నారని గ్రహిస్తాడు. అప్పటి నుంచి పాండే కేసును పర్సనల్ గా తీసుకుని ఇన్వెస్టిగేట్ చేయడం మొదలు పెడతాడు. కానీ పెద్దగా లీడ్స్ దొరకవు.

అయితే విచారణలో భాగంగా ప్రేమ్ (విక్రాంత్ మస్సే) అనే వ్యక్తిని కలుస్తాడు. అతని ఓనర్ బల్బీర్ బస్సీకి పొలిటికల్ గా మంచి పరిచయాలు ఉంటాయి. ఆ వ్యక్తి ఓ బిజినెస్ పని మీద బయటకు వెళ్ళగా, ఇంట్లో పనోడు మాత్రమే ఉంటాడు. ఇక పిల్లల మిస్సింగ్ కేసులో ఆధారాలన్నీ ఆ ఇంటివైపే చూపడంతో పాండే విచారణ కోసం వెళతాడు. నిజానికి ప్రేమ్ పిల్లల్ని కిడ్నాప్ చేసి, చంపిన తర్వాత శరీరాన్ని ముక్కలుగా నరుకుతాడు. చోటే లాల్ అనే ఫ్రెండ్ తో కలిసి అవయవాల అక్రమ రవాణా వ్యాపారాన్ని నడుపుతాడు. ఇద్దరూ ఈ వ్యాపారం ద్వారా సంపాదించే డబ్బును పంచుకుంటారు.

ఈ నేపథ్యంలోనే బస్సీ ఇంటికి అతని కోరిక తీర్చడానికి వెళ్ళిన చుమ్కీ అనే అమ్మాయి మిస్ అవుతుంది. ఆ లీడ్ కాస్తా ప్రేమ్ దగ్గరకు దారి తీస్తుంది. మరి పాండే బాగా ఇన్ఫ్లూయెన్స్ ఉన్న బస్సీని, అతని పనివాడు ప్రేమ్ ను టచ్ చేయగలిగాడా? ఈ కేసును ఎలా చేధించాడు? గుండెను పిండేసే ఆ షాకింగ్ క్లైమాక్స్ ఏంటి? అనే విషయాలకు సమాధానాలు కావాలంటే ఈ సినిమాను చూడాల్సిందే.

Read Also : కట్టుకున్న భార్యను బలిచ్చే మొగుడు… ఆ భయంకరమైన శాపం అలాంటిది మరి

ఏ ఓటీటీలో ఉందంటే?

ఈ గ్రిప్పింగ్ క్రైమ్ థ్రిల్లర్ పేరు ‘Sector 36’. 2024లో రిలీజ్ అయిన ఈ హిందీ సినిమా ఓటీటీని ఓ ఊపు ఊపేసింది. ప్రస్తుతం Netflix లో అందుబాటులో ఉంది. IMDbలో 7.1 రేటింగ్ తో దుమ్మురేపిన ఈ సినిమాలో విక్రాంత్ మాస్సీ, దీపక్ దోబ్రియాల్, అకాంక్షా రంజన్ కపూర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఆదిత్య నింబాల్కర్ దర్శకత్వం వహించారు.

Related News

Kotthapallilo Okappudu OTT: ఓటీటీ విడుదలకు సిద్ధమైన  కొత్తపల్లిలో ఒకప్పుడు… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Conistable Kanakam: యాక్షన్ థ్రిల్లర్ గా కానిస్టేబుల్ కనకం… అంచనాలు పెంచిన ట్రైలర్!

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో … ఒక్కడితో సరిపెట్టలేక ….

OTT Movie : పని మనిషితో రాసలీలలు… ఒకరి భార్యతో మరొకరు… అన్నీ అవే సీన్లు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

Big Stories

×