BigTV English

Monalisa : మోనాలిసా మోస పోలేదు.. స్పెషల్ సాంగ్‌తో ఎంట్రీ.. ఎక్స్‌ప్రెషన్స్ ఎలా ఇస్తుందో మీరే చూడండి

Monalisa : మోనాలిసా మోస పోలేదు.. స్పెషల్ సాంగ్‌తో ఎంట్రీ.. ఎక్స్‌ప్రెషన్స్ ఎలా ఇస్తుందో మీరే చూడండి

Monalisa: ప్రయాగ్ రాజ్ లో జరిగిన మహా కుంభమేళా అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం. కోట్లాది భక్తులు స్నానమాచరించి పునీతులయ్యారు. ఈ మేళాలో ఇండోర్ కు చెందిన పదహారేళ్ల యువతి మోనాలిసా బోస్లే తన అందం, సహజమైన ఆకర్షణతో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. రుద్రాక్ష మాలలు అమ్ముతూ కనిపించిన ఈ చిన్నది తన నవ్వుతో నెట్టింట వైరల్ అయింది. ఓవర్ నైట్ లో స్టార్ అవడం అంత ఈజీ కాదు కానీ, మోనాలిసాకా అదృష్టం కుంభమేళా ద్వారా కలిగింది. ఆ తరువాత ఆమెకి ఓ సినిమాలో ఛాన్స్ దొరికినట్లు పుకార్లు వచ్చాయి. తాజాగా ఆమె ఓ స్పెషల్ సాంగ్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆ వివరాలు చూద్దాం..


స్పెషల్ సాంగ్‌తో ఎంట్రీ..

మోనాలిసా సోషల్ మీడియాలో తనకు వచ్చిన క్రేజ్ తో సినిమా పరిశ్రమ వరకు వచ్చింది. తాజాగా ఈమె ఓ స్పెషల్ సాంగ్ లో నటిస్తున్నట్లు సమాచారం. కుంభమేళా తర్వాత సినిమాలు, స్పెషల్ సాంగ్స్, యాడ్స్ తో బిజీగా గడుపుతున్నారు మోనాలిసా. తాజాగా ఈమె నటుడు ఉత్కర్ష సింగ్ తో కలిసి నటిస్తున్నారు. ముంబైలో యాక్టింగ్ క్లాసెస్ ద్వారా నైపుణ్యం సాధించిన మోనాలిసా ఓ స్పెషల్ సాంగులో ఉత్కం సింగ్ తో కలిసి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తాజాగా ఈ సాంగ్ కు సంబంధించిన షూటింగ్ పూజా కార్యక్రమం మొదలైంది. మోనాలిసా చేసే స్పెషల్ సాంగ్ ను కొంతమేర చిత్రీకరించారు. ఈ పాటలో మోనాలిసా అందం,ఎక్సప్రెషన్స్  ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఎప్పుడెప్పుడు ఆమె నటనను చూస్తామా అని.. ఆమె ఫ్యాన్స్ కు ఇది పండుగ లాంటి వార్త.


మోనాలిసా మోస పోలేదు..

కుంభమేళా ముగిసిన తరువాత బాలీవుడ్ చిత్రం ది డైరీ ఆఫ్ మణిపూర్ అవకాశం వచ్చినట్లు మోనాలిసా పై అప్పట్లో వార్తలు వచ్చాయి. రాజకుమార్ రావు సోదరుడు అమిత్ రావుతో కలిసి నటించే ఈ చిన్నది కొట్టేసింది. అయితే ఈ సినిమా దర్శకుడుగా సనోజ్ మిశ్రాపై ఆరోపణలు రావడంతో ఈ ప్రాజెక్టు పై స్పష్టత లేకుండా పోయింది. తాజాగా స్పెషల్ సాంగ్ లో నటించే అవకాశం రావడంతో ఇక ఆమె సినీ జీవితం మొదలైంది అంటూ అభిమానులు విషెస్ తెలుపుతున్నారు.

అప్పుడు ఫాన్స్ తో ఇబ్బంది ..ఇప్పుడు ఫాన్స్ తో సందడి ..

మోనాలిసా మధ్యప్రదేశ్లోని ఖర్గోన్ జిల్లాలోని మహేశ్వర్ లో జన్మించింది. ఈమె తన కుటుంబంతో కలిసి మహా కుంభమేళాలో రుద్రాక్ష, ముత్యాల మాలలు అమ్ముతూ అందరి దృష్టిని ఆకర్షించింది. సహజమైన ఆకర్షణతో సోషల్ మీడియాలోని వీడియోల ద్వారా వైరల్ అయింది. అయితే అదే టైంలో ఆమెకి ఫ్యాన్స్ ఎక్కువయ్యి ఆమె షాప్ వద్దకు వెళ్లి సెల్ఫీలు, వీడియోలు అడగడంతో వ్యాపారం దెబ్బతింది. కొందరు ఆమెను ఇబ్బంది పెట్టడంతో ఆమె తండ్రి ఆమెను తిరిగి ఇండోర్ కు పంపించారు. మోనాలిసా తనకి వచ్చిన క్రేజ్ ను యాడ్స్ రూపంలోనూ ఉపయోగించుకుంది. కేరళకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త బోబి చెమ్మనూరు ఆమెను కోజికోడ్ లో జువెలరీ షోరూం ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు.అక్కడ ఆమె ఫాన్స్ తో సెల్ఫీ దిగి సందడి చేసారు. ఆమె తొలిసారి విమానంలో ప్రయాణించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆమె కేరళకు విమానంలో వెళ్తున్నట్లు వీడియో బయటికి రావడంతో ఈ వీడియో అప్పట్లో సెన్సేషన్ అయింది. యూట్యూబ్ లో పది లక్షలకు పైగా వీక్షణను సాధించింది. ఇక ఇప్పుడు ఆమె నుండి రాబోతున్న స్పెషల్ సాంగ్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×