BigTV English

SRH LSG Friendship: మీరు మీరు కొట్టుకు చావండి కానీ.. మేము మాత్రం దోస్తులమే

SRH LSG Friendship: మీరు మీరు కొట్టుకు చావండి కానీ.. మేము మాత్రం దోస్తులమే

SRH LSG Friendship:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ ( Pat Cummins ) చేసిన పని… ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ప్రత్యర్థి జట్టు ప్లేయర్ ను… స్నేహితుడిగా భావించి… సన్రైజర్స్ హైదరాబాద్ బస్సులో ఎక్కించాడు కెప్టెన్ పాట్ కమ్మిన్స్. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటి ప్రత్యర్థి ప్లేయర్ ను హైదరాబాద్ బస్సులో ఎక్కించడం ఏంటి ? అలా ఎలా చేశాడు అని అనుకుంటున్నారా..? ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.


Also Read: Abhishek vs Digvesh: నీకు 10.. నాకు 10 అంటూ పంచాయితీ తెంపిన BCCI VP రాజీవ్ శుక్లా

లక్నో ప్లేయర్ ను SRH బస్సులో ఎక్కించిన పాట్ కమ్మిన్స్


ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో భాగంగా తాజాగా సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ లక్నో సూపర్ జెంట్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో అద్భుతంగా ఆడిన సన్రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్లు.. జట్టును ఎట్టకేలకు విజయతీరాలకు చేర్చారు. అదే సమయంలో… ఈ మ్యాచ్ లో దారుణంగా ఓడిపోయిన లక్నో… ప్లే ఆఫ్ రేసు నుంచి తప్పుకుంది. అయితే ఈ మ్యాచ్ అనంతరం… లక్నో నుంచి ప్రత్యేక బస్సులో సన్రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్లు బయలుదేరారు.

ఈ సందర్భంగా సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ చేసిన పని… నవ్వులు పూయించింది. లక్నో ఆటగాడు మిచెల్ మార్ష్ ను హైదరాబాద్ బస్సు ఎక్కించాడు పాట్ కమ్మిన్స్. అయితే.. నేరుగా అతన్ని తీసుకురాలేదు కానీ… మార్ష్ కటౌట్ తన వెంట తీసుకువచ్చాడు పాట్ కమ్మిన్స్. దీంతో అందరూ షాక్ అయి… హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ ఇలా చేస్తున్నారని అందరూ అనుకున్నారు.

లక్నో ఇంటికి పంపించిన హైదరాబాద్

హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ చేసిన పని వెనుక పెద్ద పరమార్థమే ఉంది. మా దెబ్బకు లక్నో కూడా ఇంటికి వెళ్లింది.. ఇక ఆస్ట్రేలియాకు వెళ్లి పోదాం… అక్కడి నుంచి లండన్ వెళ్లి, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఆడుకుందాం అని అర్థం వచ్చేలా మార్ష్ కటౌట్ ను పాట్ కమ్మిన్స్ తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. అలా కౌంటర్ ఇచ్చేలా.. పాట్ కమ్మిన్స్ ఇలా చేశాడట. ఈ వీడియోను స్వయంగా సన్రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం సోషల్ మీడియాలో పంచుకుంది. ఇక ఈ వీడియోని చూసిన క్రికెట్ అభిమానులు నవ్వుకుంటున్నారు. ఇది ఇలా ఉండగా… గత సంవత్సరం ఇండియన్ ప్రీమియర్లు 2024 టోర్నమెంట్ లో ఫైనల్ వరకు వెళ్ళింది సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ప్లే ఆఫ్ చేరకుండానే… ఇంటి దారి పట్టింది సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు. అయితే వెళ్లే జట్టు వెళ్లకుండా… తాజాగా లక్నో జట్టును ఓడించి… వాళ్లను కూడా ఇంటికి పంపించింది హైదరాబాద్.

Also Read: Sanjiv Goenka : 27 కోట్లు బొక్క… చేసేదేమీ లేక పంత్ కు మసాజ్ చేస్తున్న లక్నో ఓనర్

Related News

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Girls In Stadium : స్టేడియంలో అందమైన అమ్మాయిలనే ఎందుకు చూపిస్తారు.. ఇది ఎలా సాధ్యం

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Gill – Abhishek : యువరాజ్ స్కూల్ లో ట్రైనింగ్.. నెంబర్ వన్ ర్యాంక్ లో గిల్, అభిషేక్

Big Stories

×