Kushi:- రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ ఖుషి. పాన్ ఇండియా రేంజ్‌లో లైగర్‌తో బ్లాక్ బస్టర్ కొట్టాలని ఆశలు పెట్టుకున్న మన స్టార్‌కి ఆ మూవీ నిరాశనే మిగిల్చింది. అటు ఇటు కాదు.. డిజాస్టర్ అయ్యింది. దీంతో విజయ్ ఈసారి చాలా సైలెంట్‌గా తన నెక్ట్స్ మూవీగా ఖుషిని పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఈ సినిమాలో సమంత హీరోయిన్. నిజానికి ఖుషిని సమ్మర్‌లోనే విడుదల చేయాలనేది ముందుగా అనుకున్న ప్లాన్. అయితే సమంత మియోసైటిస్ బారిన పడటంతో సినిమా షూటింగ్ వాయిదా పడింది ఎట్టకేలకు ఇప్పుడు సమంత మళ్లీ ఖుషి షూటింగ్‌లో బిజీగా ఉంటోంది.
ఈ నేపథ్యంలో నిర్మాతలు ఖుషి సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. సెప్టెంబర్ 1న విజయ్ దేవరకొండ, సమంత సిల్వర్ స్క్రిన్ సందడి ఉంటుంది. వీరిద్దరూ కలిసి నటించటం ఇదేమీ కొత్త కాదు. మహానటి చిత్రంలోనూ వీరిద్దరూ నటించారు. ఇది రెండోసారి. శివ నిర్వాణ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. నిజానికి సినిమాను ఆగస్ట్ 11న రిలీజ్ చేయాలని ముందుగా అనుకున్నారు. అయితే ఆ రోజున మహేష్, త్రివిక్రమ్ మూవీ వస్తుంది కదా! అని వెనకడుగు వేశారు. తీరా ఇప్పుడు మహేష్ 28వ సినిమా రాదని అంటున్నారుగా.. సరే! ఆగస్ట్ 11నే వద్దాం అని అనుకున్నారందరూ అయితే ఆ రోజున మెగాస్టార్ చిరంజీవి తన భోళా శంకర్‌తో సందడి చేయడానికి రెడీ అయ్యారు.
సరే అసలు ఈ గొడవలెందుకు అని భావించిన నిర్మాతలు ఇప్పుడు ఖుషి సినిమాను సెప్టెంబర్ 1న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. అయితే ఇది మాత్రం సమంత ఫ్యాన్స్‌కు ఖుషి కబర్. ఎందుకంటే ఏప్రిల్ 14న సామ్ ప్రధాన పాత్రలో నటించిన పాన్ ఇండియా మూవీ శాకుంతలం రిలీజ్ అవుతుంది. దాని తర్వాత ఐదు నెలల లోపే ఖుషితో ఆమె థియేటర్స్‌లో సందడి చేయనుంది.
డా.బ్రహ్మానందంను అభినందించిన మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్
for more updates follow this link:-bigtv