Big Stories

TDP: ఇది కదా దేవుడి స్క్రిప్ట్!

TDP: కొన్ని విషయాలు భలే గమ్మత్తుగా ఉంటాయి. కాకతాళీయంగా జరిగినా.. అవెంతో ఆసక్తిగా ఉంటాయి. ఏపీలో ఓ నెంబర్ చుట్టూ పొలిటికల్ గేమ్ నడుస్తోంది. 2019లో టీడీపీ ఓడిపోయింది. సైకిల్ పార్టీకి కేవలం 23 సీట్లు మాత్రమే వచ్చాయి. 151 స్థానాల్లో గెలిచి వైసీపీ అధికారంలోకి వచ్చింది. చంద్రబాబును జగన్ విమర్శిస్తూ.. గతంలో టీడీపీ పవర్‌లో ఉన్నప్పుడు 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను లాగేసుకున్నారు.. ఇప్పుడు టీడీపీ అదే 23 మంది ఎమ్మెల్యేలకు పరిమితమైందంటూ జగన్ సెటైర్లు వేశారు. ఇది కదా దేవుడి స్క్రిప్ట్ అంటూ ఓ పంచ్ డైలాగ్ కూడా వదిలారు. ఆ నెంబర్ 23 చుట్టూ కొన్నాళ్ల పాటు విమర్శలు, సెటైర్లు నడిచాయి.

- Advertisement -

కట్ చేస్తే, టీడీపీకి ఓ రోజు వచ్చింది. ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్యంగా ఆ పార్టీ అభ్యర్థి అనురాధ గెలిచారు. ఇది వైసీపీకి బిగ్ షాక్. టీడీపీలో ఫుల్ జోష్. ఇక్కడ మళ్లీ 23 నెంబర్ ప్రముఖంగా నిలవడం యాదృచ్చికం.

- Advertisement -

ఎమ్మెల్సీ ఎన్నిక జరిగి టీడీపీ గెలిచిన తేదీ 23. టీడీపీ అభ్యర్థి అనురాధకు వచ్చిన ఓట్లు 23. నెంబర్ గేమ్ కాకపోతే మరేంటి?

నెంబర్ 23ని పర్‌ఫెక్ట్‌గా క్యాచ్ చేశారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్. 23 చుట్టూ పంచ్ డైలాగులు వదులుతూ.. జగన్‌కు ట్విటర్‌లో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. లోకేశ్ ఏమన్నారంటే…

“మేము 23 సీట్లే గెలిచామ‌ని ఎద్దేవ చేశావు. అందులో న‌లుగురిని సంత‌లో ప‌శువుల్లా కొన్నావు. చివ‌రికి అదే 23వ తేదీన‌, అదే 23 ఓట్ల‌తో నీ ఓట‌మి-మా గెలుపు. ఇది క‌దా దేవుడు స్క్రిప్ట్ అంటే జగన్ గారు!”.. అంటూ ఆసక్తికర ట్వీట్ చేశారు నారా లోకేశ్. ఈ ట్వీట్ ఇప్పుడు టీడీపీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నెంబర్ 23 పై మరోసారి పంచ్‌లు, సెటైర్లు పేలుతున్నాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News