BigTV English

Nag Ashwin : తెరపైకి డైరెక్టర్ నాగ్ అశ్విన్ బయోపిక్..? హీరో ఎవరో తెలుసా..?

Nag Ashwin : తెరపైకి డైరెక్టర్ నాగ్ అశ్విన్ బయోపిక్..? హీరో ఎవరో తెలుసా..?

Nag Ashwin : టాలీవుడ్‌ యంగ్ డైరెక్టర్స్‌లలో నాగ్ అశ్విన్ (Nag Ashwin) రూటే సపరేటు. చేసింది మూడు సినిమాలే అయినా.. మూడో సినిమాతోనే ఇండియాస్ టాప్ డైరెక్టర్స్ లిస్ట్‌లో చేరిపోయాడు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ఏడి’ (Kalki 2898 AD) సినిమాతో వెయ్యి కోట్లు కొల్లగొట్టాడు. అలాంటి నాగ్ అశ్విన్ బయోపిక్‌కు అప్పుడే రంగం సిద్దమైంది. ఈ విషయాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత నాగవంశీ (Nag Ashwin) రివీల్ చేశాడు. నాగవంశీ నిర్మాణంలో తెరకెక్కిన మ్యాడ్ స్క్వేర్ ( Mad Square) సినిమా మార్చి 28న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా.. నాగ్ అశ్విన్ బయోపిక్‌ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.


విశ్వక్ సేన్‌తో అనుదీప్‌ ‘ఫంకీ’

జాతి రత్నాలు సినిమాతో టాలీవుడ్ జాతిరత్నంగా మారిపోయాడు దర్శకుడు అనుదీప్ (Anudeep). ఆయన ఏం మాట్లడినా సరే.. చాలా ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది. జాతి రత్నాలు తర్వాత కోలీవుడ్ హీరో కార్తికేయతో ‘ప్రిన్స్’ అనే సినిమా చేశాడు అనుదీప్. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం మాస్ కా దాస్ విశ్వక్ సేన్‌తో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాకు ఫంకీ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. లైలా త‌ర్వాత విశ్వక్ సేన్ నటిస్తున్న ఈ సినిమాను.. రొమాంటిక్ ల‌వ్ డ్రామా మూవీగా ప్లాన్ చేస్తున్నారు. గ‌త ఏడాది చివర్లో ఈ సినిమా పూజా కార్య‌క్ర‌మాల‌తో అఫీషియ‌ల్‌గా లాంఛ్ అయ్యింది. ఈ సినిమాను సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ఈ నిర్మిస్తున్నారు. తాజాగా మ్యాడ్ ప్రమోషన్స్‌లో ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు నాగవంశీ.


ఫంకీ.. నాగ్ అశ్విన్ బ‌యోపిక్‌

విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న ఫంకీ (Funky) సినిమాలో డ్రాగ‌న్ ఫేమ్ క‌య‌దు లోహ‌ర్ (kayadu lohar) హీరోయిన్‌గా న‌టిస్తోంది. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నాడు. అయితే.. ఈ సినిమా క‌ల్కి డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్ బ‌యోపిక్‌లా ఉంటుంద‌ని అన్నాడు నాగవంశీ. ఈ సినిమాలో విశ్వ‌క్‌సేన్ (Vishwaksen) ఓ సినిమా డైరెక్ట‌ర్‌గా క‌నిపిస్తాడ‌ని చెప్పుకొచ్చాడు. ఈ సినిమా కథలో హీరోయిన్ ప్రొడ్యూస‌ర్ కూతురిగా క‌నిపిస్తుంది. ఆమెకు డైరెక్టర్‌కు మధ్య ప్రేమ ఎలా మొద‌లైంది? అన్న‌ది చాలా ఫ‌న్నీగా ఉంటుంది. అనుదీప్ అనుకున్న‌ది అనుకున్న‌ట్లుగా తీస్తే.. ఈ సినిమా మరో గీత గోవిందం అవుతుందని అన్నాడు. అలాగే.. కథ కూడా చాలా బాగుంది. ఇది హీరోయిన్ డామినేటేడ్ స్టోరీతో సాగుతుంది. ఇప్ప‌టివ‌ర‌కు చేసిన షూటింగ్‌లో ఫ‌న్ బాగా వ‌చ్చింది’ అని నాగ‌వంశీ చెప్పాడు. దీంతో.. ఫంకీ ఇప్పటి నుంచే ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఈ సారి అనుదీప్ చేసే కామేడీ మామూలుగా ఉండదనే చెప్పాలి.

నాగ్ అశ్విన్ లవ్‌స్టోరీ 

ఇక నాగ్ అశ్విన్ ప్రేమ విషయానికొస్తే.. ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్ కుమార్తె ప్రియాంక దత్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. నాగ్ అశ్విన్ మరియు ప్రియాంక దత్‌ల ప్రేమ కథ ఒక సరళమైన, అందమైన ప్రయాణంగా చెప్పవచ్చు. నాగ్ అశ్విన్, ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన దర్శకుడు, తన సినిమా ప్రస్థానంలో ప్రియాంక దత్‌ను కలిశాడు. వీరి పరిచయం వృత్తిపరంగా మొదలై, క్రమంగా ప్రేమగా మారింది. వీరి ప్రేమ కథ “ఎవడే సుబ్రహ్మణ్యం” సినిమాతో మొదలైంది. ఈ చిత్రానికి ప్రియాంక దత్ నిర్మాతగా వ్యవహరించింది. అప్పటికే నాగ్ అశ్విన్‌తో కొన్ని యాడ్ ఫిల్మ్‌లలో కలిసి పనిచేసిన అనుభవం కూడా ఉంది. ఈ సినిమా సమయంలోనే వీరి మధ్య స్నేహం బలపడింది. ఇక నాగ్ అశ్విన్ తన సినీ ప్రస్థానాన్ని ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల వద్ద సహాయ దర్శకుడిగా ప్రారంభించాడు. “లీడర్” మరియు “లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్” చిత్రాలకు సహాయ దర్శకుడిగా పనిచేశాడు. అంతేకాకుండా, ఈ చిత్రాల్లో చిన్న పాత్రల్లో కూడా కనిపించాడు. ఆ తర్వాత “ఎవడే సుబ్రహ్మణ్యం” సినిమాతో దర్శకుడిగా మారాడు. ఇక “మహానటి” చిత్రం అతని కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచింది. చివరగా “కల్కి 2898 ఏడీ” సినిమాతో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కొట్టాడు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×