CM Revanth Reddy: గత బీఆర్ఎస్ ప్రభుత్వం తనను నానా ఇబ్బందులు పెట్టిందని.. కానీ వారిపై తాము కక్షపూరిత రాజకీయాలు చేయడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గతంలో తన అరెస్ట్ ను ప్రస్తావిస్తూ అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు.
‘బల్లులు తిరిగే రూంలో ఉంచి నానా ఇబ్బందులు పెట్టారు. అలా 16 రోజులు నన్ను జైలులో ఉంచారు. నన్ను హింసించిన వాళ్లను దేవుడే ఆస్పత్రికి పంపించాడు. నా కూతురు లగ్నపత్రిక రాసుకునే కార్యక్రమానికి వెళ్లకుండా అడ్డుకున్నారు అయినా నేను ఎవరి పైనా కక్ష సాధించలేదు. నేను గిట్ల కక్ష సాధించి ఉంటే వాళ్లంతా జైలులో ఉండేవారు. నేను ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఆరోపిస్తున్నారు. వారిని జైలుకు పంపుతానన్న హామీని కూడా నేను నెరవేర్చలేదు. మేం ఎవరిపైనా కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం లేదు. మేం అలా చేస్తే వాళ్లు అక్కడ కూర్చుని మాట్లాడే వారు కాదు. డ్రోన్ ఎగరేస్తే మామూలుగా రూ.500 ఫైన్ వేస్తారు. కానీ ఇలా చేశానని గతంలో నన్ను అరెస్ట్ చేశారు’ అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
‘ఐఎస్ఐ తీవ్ర వాదులు, కరుడు గట్టిన నక్సలైట్లు ఉండే డిటెన్షన్ సెల్ లో నన్ను ఉంచారు. ఆ కోపాన్ని దిగమింగుకుని రాష్ట్ర ప్రయోజనాలకోసం పని చేస్తున్నాను. జైలులో ఉన్నప్పుడు కూడా కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడ్డారు. ఓపెన్ ఎయిర్ జైలులో రాత్రి లైట్లు కూడా ఆఫ్ చేయలేదు. బల్లులు, పురుగులు వస్తుంటే నిద్రలేకుండా కూర్చున్నాను. కానిస్టేబుల్ ను లైట్ ఆఫ్ చేయమంటే.. పైనుంచి ఆదేశాలు ఉన్నాయని ఆఫ్ చేయలేదు. ఎమ్మెల్యేలు, మంత్రులను జైలుకు తీసుకువెళ్ళి చూపిస్తా. జైలులో ఉన్నన్ని రోజులు రాత్రి నిద్రపోలేదు. అయినా ఏరోజు బీఆర్ఎస్ నాయకులపై ప్రభుత్వం కక్ష్య సాధింపుకు పాల్పడలేదు’ అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.
‘దేవుడు ఉంటాడు అంతకు నాలుగింతలు అనుభవిస్తారని అనుకున్నాను. నేను ప్రమాణ స్వీకారం చేసిన రోజే నాపై కక్ష్య సాధించిన వాళ్ళను దేవుడే ఆసుపత్రిలో చేర్చారు. మొదటిసారి జైలుకు వెళ్లినప్పుడు నా బిడ్డ లగ్గం ఉంటే కూడా అభ్యంతర పెట్టారు. ఢీల్లీ నుంచి న్యాయవాదులను పిలిపించారు. నా కూతురు లగ్నపత్రిక రాసుకోవడానికి వెళ్ళకుండా అడ్డుకున్నారు. రాజకీయ కక్ష్య సాధింపు మీదా..? మాదా..? ఇన్ని చేసినా నేను ఏం అనలేదు. నేను కక్ష్య సాధింపుకు పాల్పడితే మీ కుటుంబంలో ఏ ఒక్కరు బయట ఉండరు. నేను విజ్ఞత ప్రదర్శించాలని అనుకున్న. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని సంక్షేమం, అభివృద్ధి కోసం ఉపయోగించాలని అనుకున్నాను. విచక్షణతో ఎవరిపై ఇంతవరకు అక్రమ కేసులు పెట్టలేదు’ అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
ALSO READ: BDL Recruitment: మన హైదరాబాద్‌లో ఉద్యోగాలు.. ఈ అర్హత ఉంటే చాలు భయ్యా..!
ALSO READ: BANK OF BARODA: భయ్యా ఈ జాబ్ గిట్ల వస్తే జీతం రూ.28,00,000.. డిగ్రీ పాసైతే మీరు అప్లై చేసుకోవచ్చు..