Uric Acid Diet: వేసవి కాలం వచ్చిందంటే చాలా మందికి కీళ్ల నొప్పులు, వాపులు, నడవడంలో ఇబ్బంది మొదలవుతుంది. దీనికి శరీరంలో యూరిక్ యాసిడ్ పెరగడం కూడా ఒక కారణం. యూరిక్ యాసిడ్ అధిక మొత్తంలో ఏర్పడినప్పుడు లేదా బయటకు రాలేనప్పుడు.. అది కీళ్లలో పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. దీనివల్ల భరించలేని నొప్పి, వాపు వంటి సమస్యలు ఎదురవుతాయి.
సకాలంలో దీనిని గుర్తించకపోతే ఈ సమస్య మరింత పెరుగుతుంది. కానీ భయపడాల్సిన అవసరం లేదు. సరైన ఆహారం తీసుకోవడం ద్వారా దీనిని నియంత్రించవచ్చు. ఈ సమస్య నుండి ఉపశమనం కలిగించే 5 కూరగాయల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. దోసకాయ:
వేసవిలో దోసకాయ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇందులో 90% కంటే ఎక్కువ నీరు ఉంటుంది. ఇది శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. అంతే కాకుండా వ్యర్థ పదార్థాలను బయటకు పంపడంలో కూడా చాలా బాగా సహాయపడుతుంది. సమ్మర్‌లో యూరిక్ యాసిడ్‌ను నియంత్రించడానికి.. మీరు దోసకాయ రసం కూడా తాగవచ్చు లేదా సలాడ్‌గా కూడా తినవచ్చు. ఇది శరీరం నుండి అదనపు ఆమ్లాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది. ఫలితంగా కీళ్ల నొప్పులను కూడా తగ్గిస్తుంది.
2. టమాటోలు:
టమాటోలు తినడం వల్ల యూరిక్ యాసిడ్ పెరుగుతుందని చాలా మంది చెబుతుంటారు. కానీ ఇది ఒక అపోహ మాత్రమే. నిజానికి టమాటాలో విటమిన్ సి , యాంటీ ఆక్సిడెంట్లు అధిక మెత్తంలో ఉంటాయి. ఇవి యూరిక్ యాసిడ్‌ను నియంత్రించడంలో సహాయపడతాయి. అంతే కాకుండా ఇది శరీరం యొక్క pH స్థాయిని సమతుల్యం చేస్తుంది. యూరిక్ యాసిడ్ పేరుకుపోకుండా కూడా నిరోధిస్తుంది. మీరు టమాటోలను సలాడ్, జ్యూస్ లేదా కూరగాయల తయారీలో కూడా వాడవచ్చు.
3. నిమ్మకాయ:
నిమ్మకాయ శరీరాన్ని సహజంగా డీటాక్సిఫై చేస్తుందని చెబుతారు. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది యూరిక్ యాసిడ్‌ను కరిగించి శరీరం నుండి తొలగించడంలో సహాయపడుతుంది. నిమ్మరసం తాగడం వల్ల శరీరంలో ఆల్కలీన్ ప్రభావం ఉంటుంది. దీనివల్ల యూరిక్ యాసిడ్ తగ్గడం ప్రారంభమవుతుంది. ఈ సమస్యను నివారించాలనుకుంటే.. ప్రతి రోజు ఉదయం గోరు వెచ్చని నీటిలో నిమ్మకాయ పిండి తాగండి. ఇది శరీరాన్ని డీహైడ్రేట్ చేయడంలో యూరిక్ యాసిడ్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది.
4. సోరకాయ:
మీరు మీ శరీరంలో యూరిక్ యాసిడ్‌ను నియంత్రించాలనుకుంటే ఖచ్చితంగా మీ ఆహారంలో సోరకాయ చేర్చుకోండి. ఇది సులభంగా జీర్ణమవుతుంది కూడా. ఇందులో అధిక మొత్తంలో నీరు ఉంటుంది. అందుకే ఇది శరీరం నుండి యూరిక్ యాసిడ్‌ను తొలగించడంలో సహాయపడుతుంది. మీరు సోరకాయను జ్యూస్ లాగా చేసి కూడా తాగవచ్చు. అంతే కాకుండా స్వీట్ ల తయారీలో కూడా వాడవచ్చు.
Also Read: గ్లిజరిన్‌లో ఈ 2 కలిపి వాడితే.. రాలిన చోట కొత్త జుట్టు వస్తుంది
5. పొట్లకాయ:
శరీరం నుండి వ్యర్థ పదార్థాలను తొలగించడంలో పొట్లకాయ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతే కాకుండా ఇది యూరిక్ యాసిడ్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది. ఇందులో ఫైబర్, ఖనిజాలు కూడా ఉంటాయి. ఇది జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తుంది. అంతే కాకుండా.. యూరిక్ యాసిడ్ పెరిగే అవకాశాలు తగ్గుతాయి.