BigTV English

EID 2025 : ఈద్ బరిలో మోహన్ లాల్… పవన్, సల్మాన్ లతో పోటీకి రెడీ

EID 2025 : ఈద్ బరిలో మోహన్ లాల్… పవన్, సల్మాన్ లతో పోటీకి రెడీ

EID 2025 : 2025 ఈద్ కు సినిమాల జాతర జరగబోతోంది. సౌత్ నుంచి మొదలు పెడితే నార్త్ వరకు సూపర్ స్టార్స్ అందరూ వచ్చే ఏడాది ఈద్ పై కన్నేశారు. తాజాగా తాను కూడా ఈద్ బరిలో ఉన్నాను అంటూ మోహన్ లాల్ కొత్త సినిమా అప్డేట్ వచ్చేసింది. “L2 ఎంపురాన్” (L2E : EMPURAAN) అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రం ఎప్పుడు రిలీజ్ కాబోతోంది? వచ్చే ఏడాది ఈద్ కానుకగా రిలీజ్ కాబోతున్న సినిమాలు ఏంటి? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.


2019లో “లూసిఫర్” (Lucifer) అనే మూవీతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న మూవీనే “L2 ఎంపురాన్” (L2E : EMPURAAN). లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ (Mohan Lal) హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో పలువురు సౌత్ స్టార్స్ భాగం కాబోతున్నారు. ఫస్ట్ పార్ట్ హిట్ కావడంతో సెకండ్ పార్ట్ పై అంచనాలు భారీగా పెరిగాయి. దానికి తగ్గట్టుగానే ఈ సినిమాను నిర్మిస్తుండగా, మోహన్ లాల్ తో పాటు “L2 ఎంపురాన్” (L2E : EMPURAAN) మూవీలో డైరెక్టర్ కం యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా కీలకపాత్రను పోషిస్తున్నారు. వీళ్ళిద్దరి కాంబినేషన్లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ ఇది.

ఇప్పటికే మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా “L2 ఎంపురాన్” (L2E : EMPURAAN)లో ఆయన పాత్రను ఖురేషి అబ్ర‌మ్‌గా పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. అలాగే పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్న పాత్ర జయేద్ మసూద్ ఫస్ట్ లుక్ ను విడుదల చేయగా మంచి రెస్పాన్స్ దక్కింది. ఈ సినిమాలో వీరిద్దరితో పాటు మోహ‌న్ లాల్‌, టోవినో థామ‌స్‌, మంజు వారియ‌ర్‌, నందు, సానియా అయ్య‌ప్ప‌న్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమాను వచ్చే ఏడాది మార్చి 27న తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో భారీ ఎత్తున రిలీజ్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు మేకర్స్.


ఇక వచ్చే ఏడాది ఈద్ కానుకగా రిలీజ్ కాబోతున్న సినిమాల్లో “L2 ఎంపురాన్” (L2E : EMPURAAN) మాత్రమే కాకుండా పవన్ కళ్యాణ్, సల్మాన్ ఖాన్, విజయ్ దేవరకొండ సినిమాలు కూడా ఉన్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veeramallu) సినిమా మార్చ్ 28న రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. అలాగే విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి (VD12) కాంబినేషన్లో వస్తున్న మూవీ కూడా మార్చి 28న థియేటర్లలోకి రాబోతోంది. ఇక సల్మాన్ ఖాన్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సికిందర్’ (Sikandar) మూవీ మార్చ్ 29న థియేటర్లలోకి రాబోతుంది. అంటే మొత్తానికి ప్రతి భాషలోనూ ఒక్కో సినిమా రిలీజ్ అవుతోంది. అయితే నిజానికి ఈ నాలుగు సినిమాలు కూడా పాన్ ఇండియా సినిమాలే. పైగా మోస్ట్ అవైటెడ్ సినిమాలు. మరి వీటిలో ఏ మూవీకి ప్రేక్షకుల ఆదరణ దక్కుతుందో చూడాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×