Nayanthara :నయనతార(Nayanthara)..ఈ పేరు దక్షిణాదిలోనే ఒక బ్రాండ్.. అలాంటి ఈ భామ సినీ ఫీల్డ్ లోకి రావడానికి ఎంతో కష్టపడింది. వచ్చిన ప్రతి ఒక్క అవకాశాన్ని వదులుకోకుండా ఒక్కో మెట్టెక్కుతూ, చివరికి దక్షిణాదిలోనే సూపర్ స్టార్ గా మారింది. అయితే ఈమె కాలేజీలో చదివే టైం నుంచే మోడలింగ్ పై ఇంట్రెస్ట్ తో ఈ ఫీల్డ్ లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత ఇండస్ట్రీలోకి మలయాళీ దర్శకుడు సత్యన్ అంతికాడ్ ‘మనస్సి నక్కరే’ చిత్రంలో మొదటిసారి కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా ఓ మోస్తారుగా హిట్ అవ్వడంతో ఆ తర్వాత రప్పకల్, తస్కర వీరన్, వంటి చిత్రాల్లో మమ్ముట్టి (Mammutty), మోహన్ లాల్ (Mohan Lal) వంటి పెద్ద పెద్ద స్టార్లతో చేసింది. ఆ తర్వాత ‘చంద్రముఖి’, ‘గజినీ’ వంటి చిత్రాల్లో కూడా నటించింది. అలాంటి నయనతార టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి ‘బాస్’, ‘లక్ష్మీ’ వంటి చిత్రాలు చేసి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఈ చిత్రాల్లో అద్భుతంగా నటించి స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.
విగ్నేష్ శివన్ తో ప్రేమ, పెళ్లి..
అలాంటి సమయంలోనే బాపూ చిత్రం అయిన ‘శ్రీరామరాజ్యం’లో సీతగా నటించి అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసింది. ఈ సినిమా తర్వాత నయనతార కెరియర్ మారిపోయింది అని చెప్పవచ్చు. ఏ పాత్రలో అయినా ఇట్టే దూరిపోయి నటించే హీరోయిన్ గా నయనతార తయారైంది. చివరికి దక్షిణాదిలోనే లేడీ సూపర్ స్టార్ గా మారింది. అలాంటి నయనతార సినిమాల్లో చేసే సమయంలోనే పలువురితో లవ్ లో పడి చివరికి తమిళ్ డైరెక్టర్ విజ్ఞేష్ శివన్ (Vighnesh shivan)తో మూడు ముళ్ళు వేయించుకుంది. ఈ చూడ చక్కని జంటకు ఇద్దరు కవల పిల్లలు కూడా పుట్టారు. ఈ కవల పిల్లలు సరోగసి ద్వారా పుట్టారు. ఈ పిల్లల ఆలనా పాలనా చూసుకుంటూ సినిమాల్లో దూసుకుపోతున్న నయనతార తాజాగా ఒక కార్యక్రమంలో పాల్గొని తన పిల్లలను ఎలా చూసుకుంటుందో బయటపెట్టింది.
పిల్లలకు అలాంటి రహస్యం చెబుతున్న నయనతార..
నయనతార మాట్లాడుతూ.. “నా పిల్లలకు నేనే ప్రతి రోజు ఆహారం తినిపిస్తాను. వారికి సంబంధించి అన్ని పనులు నేనే చేస్తాను. వారు శ్రద్ధతో వినయంగా మంచి వ్యక్తులుగా పెరగాలని ప్రతిరోజు నిద్రిస్తున్న సమయంలో వాళ్ళ చెవిలో అందరినీ ప్రేమించాలి, ఇతరులపై దయ కలిగి వుండాలి అని చెబుతాను. పిల్లలు నిద్రిస్తున్న సమయంలో మనసు ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి ఈ విషయాలు మనం చెవిలో చెబితే వారికి క్లియర్ గా మైండ్ కు ఎక్కి, ఆ విధంగానే బిహేవ్ చేస్తారని” నయనతార చెప్పింది. అలా నయనతార తన పిల్లలు నిద్రిస్తున్న టైం లో ఈ విధంగా చెవిలో చెబుతుందట. ప్రస్తుతం ఆమె చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో చాలామంది తల్లిదండ్రులు వారి పిల్లల చెవులలో ఈ విధంగానే చెప్పాలి అని, పిల్లల విషయంలో నయనతారని ఫాలో అవ్వాలి అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక రీసెంట్ గా నయనతార ధనుష్ తో జరిగిన వివాదంతో కోలీవుడ్లో హాట్ టాపిక్ అయిన సంగతి మనకు తెలిసిందే.