Jani Master:గత కొన్ని నెలల క్రితం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన జానీ మాస్టర్ (Jani master), ఆ తర్వాత జైలుకు వెళ్లడంతో అంతా మరిచిపోయారు. కానీ కొన్నాళ్లకు ఆయన బెయిల్ మీద బయటకు వచ్చారు. ప్రస్తుతం ఒక సినిమాకి కొరియోగ్రఫీ కూడా అందిస్తున్నారు. ఇలాంటి సమయంలో మళ్లీ గత నాలుగు రోజులుగా జానీ మాస్టర్ కేసు ట్రెండింగ్ లోకి వచ్చేసింది. దీనికి కారణం జానీ మాస్టర్ పై కేసు పెట్టిన లేడీ కొరియోగ్రాఫర్ శ్రేష్టి వర్మ (శShrasti Verma) ఇంటర్వ్యూ ఇవ్వడమే అని చెప్పవచ్చు. కేసు పెట్టిన ఇన్నాళ్ల తర్వాత ఈ వివాదం పై ఆమె బహిరంగంగా మాట్లాడడంతో ఈ విషయం కాస్త హాట్ టాపిక్ గా మారింది. దీనికి తోడు తాజాగా ఇంస్టాగ్రామ్ లో ఒక పోస్ట్ కూడా పెట్టింది శ్రేష్టి వర్మ. దీంతో జానీ మాస్టర్ కేసు మళ్లీ తెరపైకి వచ్చిందని చెప్పవచ్చు.
టైం చూసి దెబ్బ కొట్టిన శ్రేష్టి వర్మ..
అసలు విషయంలోకి వెళ్తే.. లైంగిక వేధింపుల కేసు విషయంలో కొంతమంది అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ జానీ మాస్టర్ ఒక పోస్ట్ పెట్టగా.. ఇండైరెక్టుగా యాంకర్ ఝాన్సీ (Jhansi ) ని ఉద్దేశించి, జానీ ఈ పోస్ట్ పెట్టినట్లు స్పష్టమవుతుంది. అయితే ఆయన ట్వీట్ చేసిన కొన్ని గంటలకే కొరియోగ్రాఫర్ శ్రేష్టి వర్మ కూడా ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయడం సంచలనంగా మారింది. తాజాగా చీరలో అందాలు ఆరబోస్తూ.. ఒక వీడియో పోస్ట్ చేసింది శ్రేష్టి వర్మ. దానికి ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సినిమాలోని “అబ్బనీ తీయని దెబ్బ” అనే పాటను బీజీఎంగా కూడా ఆడ్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది. జానీ మాస్టర్ కి ఇండైరెక్టుగా శ్రేష్టి వర్మ కౌంటర్లు ఇచ్చింది అంటూ నెటిజన్స్ సైతం కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికైతే శ్రేష్టి వర్మ మళ్లీ టైం చూసి కొట్టిందని , కౌంటర్ కి రీకౌంటర్ వేస్తోంది అని కామెంట్ చేస్తూ ఉండడం గమనార్హం.
జానీ మాస్టర్ కేసుపై తొలిసారి స్పందించిన శ్రేష్టి వర్మ..
ఇకపోతే గత కొన్ని నెలలుగా సినీ ఇండస్ట్రీలో సంచలనంగా మారిన ఈ కేసు పై తాజాగా శ్రేష్టి వర్మ ఒక మూడు రోజుల క్రితం ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించింది. తాను మాస్క్ పెట్టుకొని ఇంటర్వ్యూ ఇవ్వాల్సిన అవసరం లేదని, తాను ఒక వారియర్ ను అంటూ తెలిపింది. అదే ఇంటర్వ్యూలో శ్రేష్టి వర్మ మాట్లాడుతూ.. నేను నా ముఖానికి మాస్క్ పెట్టుకొని ఇంటర్వ్యూ ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే నేను బాధితురాలుగా బ్రతకాలని అనుకోవడం లేదు. ఒక యోధురాలిగా ముందుకొచ్చి నాకు జరిగిన అన్యాయానికి న్యాయం జరిగే వరకు పోరాడాలని నిర్ణయించుకున్నాను. కానీ నాపై కొంతమంది విమర్శలు చేస్తున్నారు. ఎందుకు ఇన్నాళ్ల తర్వాత ఇప్పుడు కేసు పెట్టింది అంటూ కామెంట్లు చేస్తున్నారు. వాస్తవానికి నేను వేధింపులు ఎదుర్కొన్నప్పుడు ఒక మైనర్ ని. అంతేకాదు సమాజంలో ఒక పవర్ఫుల్ పర్సన్ పై నేను పోరాడాల్సి వచ్చింది. అందుకే ఆ సమయంలో దానికి తగ్గ శక్తి , ధైర్యం నా దగ్గర ఉందా అనే ఆలోచనలు ఎక్కువగా ఉండేవి. ఇక ఆ వ్యక్తి కూడా మారుతాడు అనుకున్నాను. కానీ అది జరగలేదు. పైగా వేధింపులు కూడా ఎక్కువయ్యాయి. ఇప్పుడు నాకంటూ సపోర్టుగా కొంతమంది ముందుకు వచ్చారు. నేను ఏ తప్పు చేయలేదు. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. తప్పు చేసినవారికి శిక్ష తప్పదు” అంటూ శ్రేష్ఠి వర్మ తెలిపింది.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">