Shardul Thakur: టీమిండియా ఆల్రౌండర్, ముంబై క్రికెటర్ శార్దూల్ ఠాకూర్ రంజీ ట్రోఫీ మ్యాచ్ లో తొలిసారి హైట్రిక్ సాధించాడు. ముంబైలోని శరద్ పవార్ క్రికెట్ అకాడమీ { Sharad Pawar Cricket Academy} లో గురువారం జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో మేఘాలయపై భారత పేస్ ఆల్ రౌండర్, ముంబై క్రికెటర్ శార్దూల్ ఠాకూర్ { Shardul Thakur} హ్యాట్రిక్ సాధించాడు. ముంబైలోని శరద్ పవార్ క్రికెట్ అకాడమీలో గురువారం జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో మేఘాలయపై.. ముంబై తరఫున శార్దూల్ ఠాకూర్ హ్యాట్రిక్ సాధించాడు.
Also Read: Virat Kohli: కోహ్లీ కోసం 2 కిమీ లైన్.. RCB అంటూ నినాదాలు.. గూస్ బంప్స్ రావాల్సిందే!
ఠాకూర్ మూడో ఓవర్‌లో అనిరుధ్ బి, సుమిత్ కుమార్ మరియు జస్కీరత్‌లను అవుట్ చేసి, పాండిచ్చేరిపై హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన రిషి ధావన్ తర్వాత 2024/25 రంజీ ట్రోఫీ సీజన్‌లో హ్యాట్రిక్ సాధించిన రెండవ బౌలర్‌గా { Shardul Thakur} నిలిచాడు. మరుసటి ఓవర్‌లో మోహిత్ అవస్తి తన రెండో వికెట్ పడగొట్టాడు, ముంబై మేఘాలయను 3.1 ఓవర్లలో 6-2కి తగ్గించింది. ఠాకూర్ హ్యాట్రిక్.. రంజీ ట్రోఫీ చరిత్రలో ముంబై బౌలర్‌కి ఐదవది.
రంజీ ట్రోఫీలో ముంబై బౌలర్ల హ్యాట్రిక్ జాబితా:
1) జహంగీర్ బెహ్రంజీ ఖోట్ (బాంబే) vs బరోడా – 1943/44
2) ఉమేష్ నారాయణ్ కులకర్ణి (బాంబే) vs గుజరాత్ – 1963/64
3) అబ్దుల్ మూసబోయ్ ఇస్మాయిల్ (బాంబే) vs సౌరాష్ట్ర – 1973/74
4) రాయిస్టన్ హెరాల్డ్ డయాస్ (ముంబై) vs బీహార్ – 2023/24
5) శార్దూల్ ఠాకూర్ (ముంబై) vs మేఘాలయ – 2024/25
ఇక ఈ మ్యాచ్ లో శార్దుల్ ఠాకూర్ { Shardul Thakur} మాత్రమే కాకుండా ముంబై బౌలర్లు అదరగొడుతున్నారు. రెండు పరుగులకే ఆరు వికెట్లను కూల్చారు. శార్దూల్ ఠాకూర్ హైట్రిక్ సహా.. మరో వికెట్ కూడా పడగొట్టాడు. ఇక మోహిత్ 3 వికెట్లు పడగొట్టాడు. మేఘాలయ బ్యాటర్లలో ఐదుగురు బ్యాటర్లు డకౌట్ కాగా.. అర్పిత్ సుభాష్ రెండు పరుగులు చేశాడు. ప్రస్తుతం మేఘాలయ 15 ఓవర్లలో 40 పరుగులకు ఏడు వికెట్లను కోల్పోయింది. ప్రింగ్ సాంగ్ సంగ్మా (18*), అనీష్ చరక్ (0*) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. ఇటీవల జమ్మూ కాశ్మీర్ చేతిలో ముంబై అనూహ్యంగా ఓడిపోయిన విషయం తెలిసిందే.
Also Read: Natasa-Pandya: పాండ్యా భార్య నటాషా అరాచకం.. మొగుడితో చేయాల్సిన పనులు ప్రియుడితో ?
ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై తొలి ఇన్నింగ్స్ లో 120 పరుగులకే కుప్పకూలింది. స్టార్ బ్యాటర్లు అందరూ విఫలమైనా.. శార్దూల్ ఠాకూర్ { Shardul Thakur} 51 పరుగులతో హఫ్ సెంచరీ చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇక రెండవ ఎన్నికల్లోను చార్దోల్ ఠాకూర్ 105 బంతులలో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ రెండవ ఇన్నింగ్స్ లో { Shardul Thakur} మొత్తంగా 119 బంతులలో 113 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇటు బాల్ తోనే కాకుండా.. బ్యాట్ తోను అద్భుతాలు సృష్టిస్తున్నాడు శార్దూల్ ఠాకూర్. దీంతో క్రీడాభిమానులు శార్దూల్ ఠాకూర్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
🚨 HAT-TRICK FOR SHARDUL THAKUR IN RANJI TROPHY 🚨
– Thakur making a strong case for England tour in June. pic.twitter.com/Q2dcki5ayF
— Johns. (@CricCrazyJohns) January 30, 2025