Anakapalle Fire Accident: ఉమ్మడి విశాఖ జిల్లా పరవాడ ఫార్మా సిటీలో ఏం జరుగుతోంది? ఎందుకు చీటికీ మాటికీ అగ్నిప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి? కంపెనీలు సేఫ్టీ ప్రమాణాలు పాటించలేదా? ఎందుకు కార్మికులు ఆందోళన చెందుతున్నారు? అధికారులు తనిఖీలను గాలికి వదిలేశారా? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.
అనకాపల్లి సమీపంలోని పరవాడ ఫార్మాసిటీలో మంగళవారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. మెట్రో కెమ్ ఫార్మా కంపెనీలో మంటలు చెలరేగాయి. ఎఫ్లూయెంట్ ట్యాంక్ నుంచి మంటలు ఎగిసిపడ్డాయి. ఈలోగా ఫైర్ సిబ్బంది రావడంతో మంటలు అదుపులోకి వచ్చాయి. ప్లాంట్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ఘటన జరిగినట్టు వార్తలు వస్తున్నాయి.
పరవాడ జవహర్‌లాల్ ఫార్మాసిటీలో వందల సంఖ్యలో కంపెనీలు ఉన్నాయి. ఒక కంపెనీలో ప్రమాదం జరిగితే, చుట్టుపక్కలున్న కంపెనీలకు మంటలు వ్యాపిస్తున్నాయి. కంపెనీల మధ్య గ్యాప్ లేని పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. అయితే మార్నింగ్ వేళ ఫిష్ట్‌లు మారే సమయంలో ఘటనలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు జరిగిన ఘటనలు అలాంటివేనన్నది అక్కడి కార్మికుల మాట.
కెమికల్స్ లోపల ఉండడమే ప్రమాదానికి కారణంగా చెబుతున్నారు. ప్రస్తుతం ఘటనలో కార్మికులకు ఎలాంటి గాయాలు కాలేదు. ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే స్పందిన కంపెనీ స్టాప్, గోడౌన్‌ను ఖాళీ చేశారు. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో కెమికల్ గోడౌన్ పూర్తి దగ్దమైంది.
ALSO READ: కలెక్టరేట్‌లో రెవిన్యూ అధికారి.. ఆన్‌లైన్‌లో జాకీ-ఆసుతో బిజీ
రీసెంట్‌గా విషవాయువు లీకైన రక్షిత్ ఫార్మా కంపెనీలో ఇలాంటి ఘటన జరిగింది. గ్యాస్ లీక్ కావడం, బాయిలర్స్ బ్లాస్ట్స్ అవుతున్న సందర్భాలు ఎక్కువగా జరుగుతున్నాయి. సేఫ్టీ ప్రమాణాలు పాటించకపోవడమే దీనికి కారణంగా చెబుతున్నారు. ఏదైమైనా ఫార్మాసిటీలో వరసగా చోటు చేసుకున్న ప్రమాదాలపై కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.