RAPO22 Movie Title: టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని దేవదాస్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఆ మూవీతోనే చాలామంది అమ్మాయిలకు డ్రీమ్ బాయ్ గా మారిపోయాడు రామ్. గత ఏడాది డబల్ ఈ స్మార్ట్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ గా డబల్ ఇస్మార్ట్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందింది. ఈ మూవీ తర్వాత ఇప్పటివరకు రామ్ ఎటువంటి మూవీ అనౌన్స్ చేయలేదు. రామ్ నెక్ట్ సినిమా అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ టైం లోనే రామ్ కొత్త మూవీ అనౌన్స్మెంట్ అఫీషియల్ గా మూవీ మేకర్స్ ప్రకటించారు. తాజాగా ఈ సినిమా టైటిల్ పై ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.. ఇంతకీ సినిమా టైటిల్ ఏంటో చూద్దాం..
రామ్ లేటెస్ట్ మూవీ టైటిల్..
మైత్రి మూవీ మేకర్స్ తో రామ్ నెక్ట్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వారు నిర్మిస్తున్నారు ఈ సినిమా మీద భారీ అంచనాలే నెలకొన్నాయి. తాజాగా ఇప్పుడు ఆ మూవీ మరో అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్ లో రామ్ 22వ సినిమా అందని వాడు అందరివాడు అనే క్యాప్షన్ తో.. ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ రెవీల్ చేయనున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ మూవీ టైటిల్ ఆంధ్ర కింగ్ తాలూకా అని అనుకుంటున్నట్లు సమాచారం. రామ్ నెక్ట్ సినిమా టైటిల్ ఆంధ్ర కింగ్ తాలూకా అని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ రానున్నట్లు తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ నవీన్ ఎర్నేని, రవిశంకర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. హీరోయిన్ గా భాగ్యశ్రీ బోస్ నటించనున్నారు. ఈ మూవీలో రావు రమేష్, సత్య, రాహుల్ రామకృష్ణ ముఖ్యపాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఈ మూవీ టైటిల్ మే 15న సోషల్ మీడియా వేదికగా తెలపన్నారు. ఆంధ్ర కింగ్ తాలూకా అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు టాక్. ఇప్పుడు రామ్ తన కొత్త సినిమా ప్రకటనతో ఫ్యాన్స్ ఖుషి లో ఉన్నారు.
టాప్ హీరో మూవీస్ లో ఛాన్స్ ..
ఇక రామ్, పూరి జగన్నాథ్ కాంబో లో 2019లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. దానికి సీక్వెల్ గా డబల్ ఈ స్మార్ట్ సినిమాను 2024లో రిలీజ్ చేశారు. ఈ మూవీ ఆశించినంత స్థాయిలో సక్సెస్ ని అందుకోలేదు. రామ్ ఆశలన్నీ తన 22వ సినిమా మీదే ఉన్నాయి .భాగ్యశ్రీ వరుస సినిమాలతో నటిస్తున్నారు. గత సంవత్సరం రవితేజతో మిస్టర్ బచ్చన్ మూవీతో మెప్పించారు.ప్రస్తతం కింగ్డమ్ మూవీలో విజయ్ దేవరకొండతో నటిస్తున్నారు. ఈ మూవీ తరువాత ఆమె రామ్ మూవీ షూటింగ్ లో పాల్గొనున్నారు.
Vennela Kishore : ఆఫ్ట్రాల్ పాస్ పోర్ట్ కోసం మెగాస్టార్ మూవీనే వద్దనుకున్న వెన్నెల కిషోర్