BigTV English

Supermassive Black Hole :  ఉన్నట్టుండి ప్రకాశవంతంగా మారిన బ్లాక్ హోల్.. ఎందుకంటే..?

Supermassive Black Hole :  ఉన్నట్టుండి ప్రకాశవంతంగా మారిన బ్లాక్ హోల్.. ఎందుకంటే..?
Black Hole


Supermassive Black Hole : గత కొంతకాలం సోలార్ సిస్టమ్‌లో ఉన్న అతిపెద్ద బ్లాక్ హోల్ గురించి ఆస్ట్రానాట్స్‌లో చర్చలు జరుగుతున్నాయి. కొన్నేళ్ల క్రితం కనిపెట్టిన ఈ బ్లాక్ హోల్‌ను స్ఫష్టంగా స్టడీ చేయడం ద్వారా వాటి గురించి పూర్తిగా అవగాహన వస్తుందని వారు భావిస్తున్నారు. అంతే కాకుండా బ్లాక్ హోల్‌ను వారు కనిపెట్టిన సమయం నుండి ఇప్పటివరకు అందులో పలు మార్పులు వచ్చాయని ఆస్ట్రానాట్స్ చెప్తున్నారు. తాజాగా ఇది మరింత ప్రకాశవంతంగా మారిందని బయటపెట్టారు.

భూమికి అత్యంత దగ్గరగా ఉన్న అతిపెద్ద బ్లాక్ హోల్ పేరు సాగిట్టారియస్. ఇది తాజాగా నిద్రాణస్థితి నుండి మారి తన ప్రకాశాన్ని మరింత ఎక్కువ చేసుకుందని ఆస్ట్రానాట్స్ గమనించారు. కానీ ఇలా ఎందుకు జరిగిందని వారికి కూడా పూర్తిగా స్పష్టత లేదు. మిల్కీ వే మధ్యలో ఉన్న ఈ బ్లాక్ హోల్.. సూర్యుడికంటే నాలుగు మిలియన్ రెట్లు పెద్దగా ఉంటుంది. ముందుగా దీనిలో ఎలాంటి కదలికలు లేవని, ఇది పెద్దగా మారే అవకాశం లేదని శాస్త్రవేత్తలు అనుకున్నారు. కానీ 200 ఏళ్ల క్రితం నుండి ఇది పెద్దగా అవ్వడం ప్రారంభమయ్యింది. దగ్గరలో ఉన్న కాస్మిక్ ఆబ్జెక్ట్స్‌ను తనలో కలిపేసుకోవడం మొదలుపెట్టింది.


ప్రస్తుతం సడెన్‌గా బ్లాక్ హోల్ ప్రకాశవంతంగా మారడానికి కారణాలు ఏంటో కనుక్కోవడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. దీని ప్రకాశం గురించి పక్కన పెడితే.. పూర్తిగా బ్లాక్ హోల్స్ గురించి స్టడీ చేస్తే ఇలాంటి అనుకోని మార్పుల గురించి పూర్తిగా తెలుసుకునే అవకాశం ఉంటుందని వారు భావిస్తున్నారు. అందుకే ముందుగా అనుకున్నట్టుగానే పూర్తిగా బ్లాక్ హోల్స్ ఫీచర్స్ గురించి స్టడీ చేయడంలో నిమగ్నమయిపోయారు. అంతే కాకుండా ఈ స్టడీలో వాటి యాక్టివిటీ గురించి కూడా తెలుస్తుందని వారు నమ్ముతున్నారు.

ఎకో అనే ఎక్స్‌రే ద్వారా సాగిట్టారియస్ బ్లాక్ హోల్ గురించి ఎన్నో విషయాలను శాస్త్రవేత్తలు తెలుసుకున్నారు. దీని చుట్టూ జరిగే ఈవెంట్స్ గురించి వారికి ఒక అవగాహన కలిగింది. బ్లాక్ హోల్స్ చుట్టూ ఉండే మాలిక్యులర్ క్లౌడ్స్ గురించి కూడా వారికి తెలిసింది. ఇక తాజాగా బ్లాక్ హోల్స్‌లో వస్తున్న మార్పులను స్టడీ చేయడం పూర్తిగా ఆస్ట్రోఫిజిక్స్‌పైనే ఆధారపడి ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. నాసాకు చెందిన ఇమేజింగ్ ఎక్స్ రే పొలారిమెట్రీ ఎక్స్‌ప్లోరర్ టెక్నాలజీ ద్వారా బ్లాక్ హోల్స్ గురించి మరిన్ని విషయాలను తెలుసుకోవాలని వారు ప్రయత్నిస్తున్నారు.

Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×