BigTV English

Raj Tarun-Lavanya : రాజ్ తరుణ్ ఇంటి వివాదంలో లావణ్యకు ట్విస్ట్… ఇంటి నుంచి గెట్ అవుట్..

Raj Tarun-Lavanya : రాజ్ తరుణ్ ఇంటి వివాదంలో లావణ్యకు ట్విస్ట్… ఇంటి నుంచి గెట్ అవుట్..

Raj Tarun-Lavanya : టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ పేరు ప్రస్తుతం వార్తల్లో హాట్ టాపిక్ అయ్యింది.. ఆయన మాజీ లవర్ లావణ్య తనని మోసం చేశాడంట పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడంతో ఈ వ్యవహారం బయటకి వచ్చింది. అప్పటినుంచి ఈ కేసులో అనేక ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇంతకీ ఈ కేసులో తప్పు ఎవరిది? ఇదంతా డ్రామాగా జరుగుతుంది? నిజంగానే లావణ్యను రాజ్ తరుణ్ మోసం చేశాడా? ఇలాంటి ప్రశ్నలు ప్రజల్లో వ్యక్తం అవుతున్నాయి. ఈ కేసులో కీలకమైన వ్యక్తి అయిన మస్తాన్ సాయిని పోలీసులు అరెస్ట్ చేశారు. దాంతో గొడవ మొత్తం సర్దుమనిగిందని అనుకున్నారు. కానీ ఇప్పుడు మరో ట్విస్ట్ ఎదురయింది. ఈ సారి హీరో తల్లితండ్రులకు, లావణ్యకు మధ్య విల్లా విషయంలో గొడవ జరగడం గమనార్హం.. ప్రస్తుతం విల్లా ఎదుట హీరో పేరెంట్స్ ధర్నాకు కూర్చున్నారు.. దీనిపై తాజాగా లావణ్య బిగ్ టీవీ తో మాట్లాడారు. ఈ సందర్బంగా ఆమె ఏం అన్నారో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..


లావణ్య, రాజ్ తరుణ్ ఓ విల్లా.. మ్యాటరేంటంటే..?

రాజ్ తరుణ్ పేరెంట్స్… ప్రస్తుతం లావణ్య ఉంటున్న ఇల్లు తమదేనని, తమ ఇంట్లోకి తమకు ఎంట్రీ లేకపోవడం ఏమిటని చెబుతోన్నారని అంటున్నారు. ఈ సమయంలో వారు విల్లా ముందు ఆందోళనకు దిగారు. ఈ సమయంలో లావణ్యకు, రాజ్ తరుణ్ పేరెంట్స్ కు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో లావణ్య నార్సింగ్ పోలీస్ స్టేషన్ మెట్లేక్కింది.. తాను 15 ఏళ్లుగా ఉంటున్న ఇంట్లోకి పదిహేను మందితో వచ్చి దాడి చేశారని.. ఆ సమయంలో తనతో అసభ్యంగా ప్రవర్తించారని.. తన తమ్ముడిని కొట్టారని, తలుపులు పగులగొట్టే ప్రయత్నం చేశారని ఆరోపించింది. తన ఇంటి ముందు ధర్నాకు దిగారు అని కంప్లైంట్ చేసింది. ఆమె ఫిర్యాదుతో అలెర్ట్ అయిన పోలీసులు ఆ విల్లా దగ్గరకు వచ్చారు. రాజ్ తరుణ్ తదనంతరం ఆ విల్లా తనకు చెందుతుందని, ఆ విధంగా హీరో వీలునామా రాశాడని లావణ్య చెబుతోంది..ఈ లోగా ఒకరి అనుమతి లేకుండా మరొకరు ఈ ఇంటిని అమ్మడానికి వీలేదనే కండిషన్ కూడా వీలునామాలో ఉన్నట్లు ఆమె చెప్పుకొచ్చింది. అయితే పోలీసులు మాత్రం లావణ్యదే తప్పు అన్నట్లు తెలుస్తుంది.. ఈ వివాదం పై లావణ్య బిగ్ టీవీ తో మాట్లాడారు.


Also Read :2209లో జరిగే స్టోరీతో కిచ్చా సుదీప్ మూవీ.. స్టోరీ మొత్తం ట్విస్టులే..

బిగ్ టీవీ తో లావణ్య.. 

లావణ్య బిగ్ టీవీ తో మాట్లాడుతూ.. లావణ్య ప్రస్తుతం ఉంటున్న కోకాపేట లోని ఇంటికి వచ్చిన రాజ్ తరుణ్ తల్లి తండ్రులు ఈ ఇంటిని ఖాళీ చేయమని లావణ్యకు చెప్పడంతో ఇది నేను రాజ్ తో సహజీవనం చేసేటప్పుడు ఎవరికి దీనిని అమ్మకూడదు అని నిర్ణయించుకున్నాం. ఈ ఇంటిపై నాకు హక్కు వుంది. నేను ఎక్కడికి వెళ్ళనుఅని రాజ్ తరుణ్ పేరెంట్స్ తో గోడవకు దిగి వారిని ఇంట్లో నుండి బయటకు గెంటేసింది. దాంతో మరోసారి ఇది రచ్చకేక్కింది.. నిన్నఅర్ధరాత్రి వరకు లావణ్య ఇంటి వద్ద హైడ్రామా కొనసాగింది. తెల్లవారుజాము వరకు ఇంటి బయటే ఉన్నారు రాజ్ తరుణ్ తల్లిదండ్రులు. దీంతో ఈ వ్యవహారంలో రంగ ప్రవేశం చేసారు నార్సింగీ పోలీసులు. లావణ్య అసలు నా కొడలు కాదని ఈ ఇల్లు రాజ్ తరుణ్ పేరుపై ఉందని ఇది మాకు సొంతం అని, లావణ్య మా కొడుకుతో సహజీవనం చేసింది తప్పా నా కొడుకుని వివాహం చేసుకోలేదు, కోకాపేట్ లో ఉన్న విల్లా రాజ్ తరుణ్ ది. నా కొడుకు ఇంట్లో మేము ఉంటాం అని పోలీసులకు వివరించారు రాజ్ తరుణ్ తల్లిదండ్రులు.. ఇక పోలీసులు అన్ని విధాలుగా నచ్చ చెప్పి వారిని ఇంటి దగ్గర నుంచి బయటకు పంపించారు.. కానీ లావణ్య మాత్రం వాళ్ళ పేరెంట్స్ వచ్చారు. రాజ్ కూడా నా కోసం వస్తాడని అంటుంది. మరి ఈ కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి..

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×