Indian Coaching staff: ఇటీవల కాలంలో భారత క్రికెట్ జట్టు ఒడిదుడుకులతో నిండి ఉంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా 1 – 3 తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. అనంతరం జరిగిన పరిణామాలు బీసీసీఐని చికాకు పెట్టించాయి. ప్లేయర్లకు, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కి మధ్య విభేదాలు ఉన్నాయంటూ పెద్ద ఎత్తున వార్తలు కూడా వైరల్ అయ్యాయి. అందుకే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ప్రిపరేషన్ కూడా సరిగా జరగలేదని అప్పట్లో తీవ్రమైన విమర్శలు వచ్చాయి.
కోచ్ గౌతమ్ గంభీర్ కి.. మిగతా సీనియర్ ప్లేయర్లకు అసలు పోసగడం లేదనే వార్తలు వచ్చాయి. ఈ వార్తలను లీక్ చేసిన వారిపై ఇప్పుడు బీసీసీఐ వేటు వేసింది. కొద్ది రోజులుగా ఈ సంఘటనపై విచారణ చేసి ఇద్దరిని విధుల నుంచి తప్పించింది. గౌతమ్ గంభీర్ టీమ్ లో ఇద్దరిపై బీసీసీఐ వేటు వేసింది. ఇందులో టీం అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్, ఫీల్డింగ్ కోచింగ్ దిలీప్ పై వేటు వేసింది బిసిసిఐ. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సమయంలో డ్రెస్సింగ్ రూమ్ విషయాలను లీక్ చేశారనే కారణంతో బీసీసీఐ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది.
అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ పదవీకాలం 8 నెలల క్రితమే ప్రారంభమైంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్ ఓడిన తర్వాత బీసీసీఐ సమీక్ష సమావేశం నిర్వహించింది. ఆ సమయంలో డ్రెస్సింగ్ రూమ్ విషయాలు బయటకు వెళ్తున్నాయని కొందరు ఫిర్యాదులు చేశారు. ఈ క్రమంలోనే అభిషేక్, దిలీప్ ని విధుల నుంచి తప్పించినట్టు సమాచారం. అభిషేక్ నాయర్ స్థానంలో మరో వ్యక్తిని నియమించే ఆలోచన లేనట్లుగా బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి.
ఇక బ్యాటింగ్ కోచ్ గా సితాన్శు కోటక్ ఇప్పటికే జట్టుతో ఉన్నారని తెలిపింది. మరోవైపు దిలీప్ పనిని అసిస్టెంట్ కోచ్ రయాన్ టెన్ డస్కటే చూసుకుంటారని వెల్లడించింది. ఈ ఐపీఎల్ 2025 ముగిసిన తర్వాత భారత జట్టు టెస్ట్ సిరీస్ ని ఆడబోతోంది. ఇంగ్లాండ్ తో 5 టెస్టుల సిరీస్ కోసం అక్కడ పర్యటించబోతోంది. మరోవైపు ప్రస్తుతం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లినట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. మాజీ కోచ్ రాహుల్ ద్రావిడ్ పర్యవేక్షణలో టీమిండియా గత సంవత్సరం ఐసీసీ టీ-20 ప్రపంచ కప్ టైటిల్ గెలుచుకుంది.
Also Read: Virat Kohli: ఏంట్రా మామ… విరాట్ కోహ్లీకి 12 వేళ్ళు ఉన్నాయా… షాక్ లో ఫ్యాన్స్
అనంతరం గౌతమ్ గంభీర్ టీమిండియా హెడ్ కోచ్ గా బాధ్యతలు స్వీకరించిన తరువాత న్యూజిలాండ్ తో జరిగిన స్వదేశీ సిరీస్, ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్ ని కోల్పోవాల్సి వచ్చింది. ఇక కోచ్ పై తీవ్ర విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఆ తరువాత టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ ని కైవసం చేసుకుంది. ఇలా టీమిండియా ఒడిదుడుకుల మధ్య కొనసాగుతున్న నేపథ్యంలో గౌతమ్ గంభీర్ కి ఇష్టమైన కోచింగ్ సిబ్బంది వారి ఉద్యోగాలను కోల్పోయే అవకాశం ఉన్నట్లు సమాచారం. సహాయక సిబ్బందిలో మార్పులు చేయాలని బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
🚨 CHANGES IN INDIAN COACHING STAFF 🚨 [Abhishek Tripathi]
– One of the reason behind is the poor performance in BGT
– Assistant Coach Abhishek Nayar is likely to be removed.
– Fielding Coach T Dilip & Trainer Soham has been relieved from the duties as they completed more than 3… pic.twitter.com/q6kpSNlOqS— Johns. (@CricCrazyJohns) April 17, 2025