BigTV English

Akhanda 2: బాలకృష్ణతో ఛాన్స్ కొట్టేసిన సీనియర్ నటి లయ కూతురు.. ఈసారైనా హిట్ కొడుతుందా?

Akhanda 2: బాలకృష్ణతో ఛాన్స్ కొట్టేసిన సీనియర్ నటి లయ కూతురు.. ఈసారైనా హిట్ కొడుతుందా?

Akhanda 2: హీరో అయినా హీరోయిన్ అయినా.. సినిమాల్లో ఏ విభాగంలో పనిచేసే వ్యక్తులు అయినా కూడా తమ వారసులను వెండితెరపై నటులుగానే చూసుకోవాలని అనుకుంటారు. కొందరు నటీనటులు అయితే తమ వారసులను చైల్డ్ ఆర్టిస్ట్‌గానే ప్రేక్షకులకు పరిచయం చేసి వారికి దగ్గర చేయాలని ప్రయత్నిస్తున్నారు. అలాగే సీనియర్ నటి లయ కూడా తన కూతురిని చైల్డ్ ఆర్టిస్ట్‌గా పరిచయం చేసింది. లయ కూతురు శ్లోకా ఇప్పటికే ఒక మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించింది. కానీ లక్ కలిసిరాక ఆ మూవీ, అందులో తన పాత్ర ప్రేక్షకులను ఇంప్రెస్ చేయలేకపోయాయి. అయినా ఇప్పుడు ఏకంగా బాలకృష్ణతో నటించే ఛాన్స్ కొట్టేసింది.


లక్కీ ఛాన్స్

బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే ప్రేక్షకుల్లో అంచనాలు మామూలుగా ఉండవు. బాలయ్య నటించిన సినిమాలు వర్కవుట్ అవ్వకపోతే కచ్చితంగా వెంటనే బోయపాటితో మూవీ చేస్తే హిట్ దక్కుతుందని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. అదే ఒక సెంటిమెంట్‌లాగా మారిపోయింది. ఇప్పటివరకు ఈ కాంబోలో వచ్చిన ఒక్క మూవీ కూడా ఫ్లాప్ అవ్వలేదు. అందుకే వీరు కలిసి చేస్తున్న తరువాతి సినిమా ‘అఖండ 2’ (Akhanda 2)పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ.. వచ్చే ఏడాది విడుదల కానుందని ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేశారు. తాజాగా ఈ సినిమాలో బాలయ్యతో కలిసి నటించడానికి లయ కూతురు శ్లోకా ఛాన్స్ కొట్టేసిందని సమాచారం.


Also Read: అరెస్ట్ దెబ్బ.. బన్నీపై భారీ భారం.. ఎన్ని కోట్లంటే..?

డిశాస్టర్‌గా నిలిచింది

లయ అంటే తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు ఉంది. కెరీర్ సాఫీగా సాగిపోతున్న సమయంలోనే పెళ్లి చేసుకొని అమెరికాలో వెళ్లి సెటిల్ అయ్యింది ఈ సీనియర్ హీరోయిన్. చాలాకాలం తర్వాత రవితేజ హీరోగా నటించిన ‘అమర్ అక్బర్ ఆంటోని’ మూవీతో తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది లయ. అదే మూవీలో తనతో పాటు తన కూతురు శ్లోకాను కూడా ప్రేక్షకులను పరిచయం చేసింది. ఆ సినిమా ఎక్కువమంది ప్రేక్షకులకు రీచ్ అవ్వలేక డిశాస్టర్‌గా నిలిచింది. అందుకే శ్లోకా డెబ్యూ గురించి చాలామందికి తెలియకుండా పోయింది. కానీ తనకు ఇప్పుడు ‘అఖండ 2’లో బాలకృష్ణ కూతురిగా నటించే అవకాశం దక్కింది.

అదే క్యారెక్టర్

బాలకృష్ణ (Balakrishna), బోయపాటి శ్రీను (Boyapati Srinu) కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘అఖండ’ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఆ మూవీకి సీక్వెల్ ఉంటుందని మేకర్స్ అప్పుడే అనౌన్స్ చేశాడు. ‘అఖండ’లో ఒక చిన్న పాప క్యారెక్టర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు అదే పాత్రను సీక్వెల్‌లో కంటిన్యూ చేయడం కోసం శ్లోకాను ఎంపిక చేసినట్టు సమాచారం. ఒకవైపు లయ కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో తన సెకండ్ ఇన్నింగ్స్‌కు సిద్ధమవుతుంటే.. మరోవైపు తన కూతురు శ్లోకా (Sloka) కూడా ప్రేక్షకుల్లో మంచి మార్కులు కొట్టేయడానికి ప్రయత్నాలు చేస్తోంది. మరి ఈ సినిమా అయినా శ్లోకాకు హిట్ తెచ్చిపెట్టి, లయ (Laya) కూతురిగా ఆడియన్స్‌కు గుర్తుండిపోయేలా చేస్తుందేమో చూడాలి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×